.
Bharadwaja Rangavajhala...
బాపు రమణలు కృష్ణ ఇంకా నటశేఖరగానే ఉండగా తీసిన కృష్ణావతారం సినిమా గుర్తుంది కదూ…
ఆ సిన్మా తమిళంలో వచ్చిన రాజాంగంకు రీమేకు.
ఆ సిన్మా హీరో వాగై చంద్రశేఖర్.
డైరెక్టర్ శక్తి.
కృష్ణావతారం 1982 లో రిలీజ్ అయ్యింది.
రాజాంగం 1981 రిలీజ్.
Ads
యంగ్ హీరో చంద్రశేఖర్ చేసిన కారక్టర్ ను హీరో కృష్ణకు అడాప్ట్ చేయడానికి రమణ గారు పెద్దగా కష్టం పడలేదు.
అదే ఎర్ర చొక్కా, గళ్ళ లుంగీ.
శ్రీదేవి తెలుగులో చేసిన కారక్టర్ తమిళ్ లో లేదు.
అసలు తమిళ్ లో హీరోయిన్ అనే పాత్రే లేదు.
నరమున్న నాలిక రా అంటూ తెలుగులో వచ్చే పాట ప్లేస్ లో అక్కడా పాట ఉంది కానీ…
అది చంద్రశేఖర్ మనోరమల మధ్య నడుస్తుంది.
రమణ గారు తెలుగు అనువాదం తన స్టైల్లో నడిపారు.
రావు గోపాలరావు లెవెల్లో కృష్ణతో డైలాగ్ చెప్పించి వావ్ అనిపించారు.
శ్రీధర్ పాత్ర ఢిల్లీ గణేష్ చేయగా విజయశాంతి తమిళ్ లో చేసిన పాత్రే తెలుగులోనూ చేసింది.
చందశేఖర్ ఆర్గానిక్ గా ఉంటాడు. కృష్ణ బాగా గడుసుగా ఉంటాడు.
ఇక కథ విషయానికి వస్తే…
అనగానగా ఓ డబ్బున్న సావుకారు గారి కూతురు పెళ్లి కాకుండా నెల తప్పుతుంది.
ఈ విషయం తెలీని సదరు సావుకారు గారు… కూతురుకి తన బాస్ కొడుకు సంబంధం కలుపుకోవాలి అనుకుంటాడు. అనుకోవడం కాదు మాటిచ్చేస్తాడు.
తీరా ఇసయం తెల్సి ఇప్పుడెలా అనుకుంటాడు.
పైగా సంబంధం కలుపుకోవాలి అనుకున్న బాసుడు ఆ రోజో మరురోజో మీ ఇంటికి వస్తా అంటాడు.
ఆడికి ఏం చెప్పాలో పాలుపోదు.
కూతురు ఎవుడ్నో పేమించింది అని సెప్పొచ్చు కానీ తనకు కడుపు చేసింది ఎవురో సెప్పదు ఆ పిల్ల.
ఆ బాసుగాడితో రిలేషన్ స్ట్రెయిన్ కాకుండా చూసుకోడం ఎలారా భగవంతుడా అని ఏడుత్తా ఉంటే
అప్పుడు సావుకారి పెద్దల్లుడు ఓ దిక్కుమాలిన సలహా సెప్తాడు.
అదేటీ అంటే…
బాసూ బాసూ, ఐ యామ్ వెరీ సారీ… నీ కొడుక్కి నా చిన్న కూతురుని ఇస్తాను అన్నాను గానీ తీరా ఇంటికొచ్చేటలికి అదెవుడినో పేమిత్తోందని తెల్సి ఖంగు తిన్నా అని సెప్పు మావా అంటాడు పెద్దల్లుడు.
ఆ పేమిచ్చేవాడికిచ్చి పెళ్లి కూడా సేసేసా అని సెప్పమాంతాడు.
అట్టేట్టా సెప్తాను రా అది పేమించినోడి పేరు సెప్పడం లేదుగందా అంటాడు సావుకారు.
ఏం పర్లేదు మాంగారు నా క్లయింట్ ఒకడు ఉన్నాడు ఆడ్ని అందాక నీ రెండో అల్లుడుగా నిలబెడదాం అంటాడు…
ఆ క్లయింట్ వచ్చి చిన్నల్లుడుగా నిలబడి గండం దాటిత్తాడు కానీ…
సావుకారు కూతురు లవర్ ఎవురో కనుక్కుని పెళ్లి సేపిద్దాం అని అక్కడే తిష్ట వేస్తాడు.
కారణం ఆడు చాలా మంచి సెడ్డోడు. ధర్మం నిలబెట్టడం కోసం అనవసరం అయిన ఇసయాల్లో తలదూర్చి జైలుకి వెళ్లే బాపతు.
అంచేత ఆడికి ఈ పిల్ల కట్టం చూసి కడుపు తరుక్కుపోతుంది.
అందుకే ఆడెవుడో తేల్చాలి అనుకుంటాడు.
సివరికి ఆ పిల్ల కడుపుకు కారణం ఆ ఇంటి పెద్దల్లుడే అని కనిపెట్టి ఆడ్ని కొడతాడు.
ఈలోగా ఆ అమ్మాయి పండంటి మగపిల్లాడ్ని కంటుంది.
తన తప్పేం లేకుండా ఇంత నరకం అనుభవించిన ఆ అమ్మాయి నిజం అందరికీ తెలిసిపోయాక ఆత్మహత్య చేసుకు చనిపోతుంది.
ఆ పిల్ల కన్న కొడుకును తీసుకుని ఆ ఇంటోంచి బయటకు వచ్చేత్తాడు మనోడు.
ఈ కథ రాసింది తుళు రైటర్ కె ఎన్ టైలర్.
అయితే ఈ కథలో లోపం ఏంటి అంటే. ..
నన్ను పాడు చేసింది ఈడే అని చెప్పేయొచ్చు కదా ఆ అమ్మాయి. ….
మరీ బేలగా ఉండిపోతుంది…. తప్పు కదా
అలాగే తనకు ద్రోహం చేసిన వాణ్ని కనిపెట్టి చితక్కొట్టిన ఆ మంచి సెడ్డోన్ని, అదేనండి ఈరోని పెళ్ళాడినట్టు తియొచ్చు కదా…
అట్టా ఎందుకు తీయరు అంటే
విలన్ రేపు చేసిన అమ్మాయి కారక్టర్ అవుతుంది తప్ప హీరోయిన్ కానేరదు అనే సంప్రదాయం ఆలోచన వల్ల…
Share this Article