Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో ఈ చంద్రముఖి… సౌందర్య, జ్యోతిక, శోభనల్ని మించి ఎన్నోరెట్లు..!

July 12, 2024 by M S R

వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి 1974 లో వచ్చిన ఈ కృష్ణవేణి సినిమా . వాణిశ్రీ నట విరాట రూపాన్ని చూపిన మరో సినిమా ఇది . ఈ సినిమాలో ఆమె పాత్ర మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్ర . ఏవోవో హెల్యూసినేషన్స్ ఆమెను వెంటాడుతూ ఉంటాయి . చంద్రముఖిలో జ్యోతిక పాత్ర వంటిది . జ్యోతికే చాలా బాగా చేసింది . జ్యోతిక కన్నా వాణిశ్రీ ఈ సినిమాలో ఇంకా గొప్పగా నటించింది . కృష్ణంరాజు సొంత సినిమా ఇది .

మన తెలుగు సినిమాకు మాతృక కన్నడంలో వీర హిట్ అయిన శరపంజర అనే సినిమా . శరపంజర అంటే బాణాల బోను అని . కర్నాటకలో మూడు సెంటర్లలో సంవత్సరం ఆడింది . హీరోయిన్ కల్పనకు , సినిమాకు అవార్డుల మీద అవార్డులు వచ్చాయి . కానీ , మన తెలుగు సినిమా ముందు , ముఖ్యంగా వాణిశ్రీ నటన ముందు దిగదుడుపే . కన్నడంలో హీరోయిన్ పేరు కావేరి . మనకు కృష్ణా నదిలాగే వారికి కావేరి కదా ! కన్నడ సినిమా కూడా త్రివేణి అనే రచయిత వ్రాసిన నవల ఆధారంగా తీసారు . నవల పేరు కూడా త్రివేణే .

మనకు గోదావరి నేపధ్యంలో చాలా సినిమాలు ఉన్నాయి . కృష్ణా నది నేపధ్యంలో చాలా తక్కువ సినిమాలే ఉన్నాయి . వాటిల్లో ఒకటి ఈ కృష్ణవేణి . సినిమాలో చాలా భాగం , ఓ అందమైన పాట కృష్ణా నది నేపధ్యంలోనే ఉంటాయి . శ్రీశైలం , నాగార్జున సాగర్ , అమరావతి ప్రస్తావనలు , లొకేషన్లు ఉంటాయి .

ప్రముఖ దర్శకుడు వి మధుసూధనరావు దర్శకత్వంలో తీయబడిన ఈ సినిమాతోనే కృష్ణంరాజుకు హీరో స్థానం సుస్థిరమయింది . బహుశా ఈ సినిమా తర్వాత ఆయన విలన్ పాత్రలు వేసినట్లు లేదు . ఈ సినిమా విజయానికి వాణిశ్రీ తర్వాత ప్రధాన కారణం సంగీత దర్శకత్వం . విజయభాస్కర్ సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది .

Ads

ముఖ్యంగా కృష్ణవేణి తెలుగింటి విరిబోణి పాట . సాహిత్యం , నృత్యం , వాణిశ్రీ ఆహార్యం , టేకింగ్ అన్నీ అద్భుతమే . ఆరోజుల్లో వాణిశ్రీ చీరె కట్టుడు , మోచేతుల కిందకు జాకెట్ , ఎయిర్ హోస్టెస్ లాగా హెయిర్ స్టైల్ ఓ పేద్ద ఫేషన్ ట్రెండుని సెట్ చేసాయని చెప్పవచ్చు . మరో సూపర్ హిట్ పాట శ్రీశైలా మల్లయ్యా పాట . పేరంటాలలో కూడా ఆడవాళ్లు పాడే పాట . శివాలయాల్లో కూడా వినిపించే భక్తి పాట . ఈ సినిమాలో ఆరుద్ర , దాశరధి , కొసరాజుల సాహిత్యం మరచిపోలేనివి

సంగుతం మధుర సంగీతం , ఎందుకో నీవు నాతో ఉన్న వేళ ఇంత హాయి , పదునాలుగేళ్ళు వనవాసమేగి మరలి వచ్చెను సీత పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ జనని కృష్ణవేణి పద్యం లాంటి పాట కూడా చాలా బాగుంటుంది .

గుమ్మడి , అంజలీదేవి , నిర్మలమ్మ , శబరి పండరీబాయి , రాజబాబు , రావి కొండలరావు ప్రభృతులు నటించారు . వాంప్ పాత్రలు , క్లబ్బుల్లో విలన్ డెన్సుల్లో డాన్స్ వేసే పాత్రలు వేసే మంజు భార్గవికి ప్రాముఖ్యత కలిగిన ఫుల్ లెంగ్త్ పాత్రే దొరికింది ఈ సినిమాలో . బాగా నటించింది .

మన తెలుగులో కూడా వంద రోజులు ఆడింది . వంద రోజుల ఫంక్షన్ కు బహుమతి ప్రదానం NTR గారే చేసారు . మహిళలు బాగా మెచ్చిన సినిమా కూడా . యూట్యూబులో ఉంది . కన్నడ సినిమా కూడా ఉంది . సినిమా ఇష్టులు కన్నడ సినిమా కూడా కాసేపు చూడండి . వాణిశ్రీ ఎంత గొప్పగా నటించిందో తెలుస్తుంది .

కృష్ణవేణి సినిమా మా తరంలో చూడని వారు ఉండరు . ఈతరంలో ఎవరయినా ఉంటే యూట్యూబులో తప్పక చూడండి . టివిలో వస్తే మిస్ కాకండి . చూసినవారు కూడా ఖాళీగా ఉన్నప్పుడు పాటల వీడియోలు చూడవచ్చు .

ఎంత గొప్ప సినిమా అంటే సాధారణంగా హీరోయిన్ చచ్చిపోతే , సినిమా సక్సెస్ కావటం కష్టం . ఈ సినిమాలో వాణిశ్రీ చనిపోయినట్లు ప్రేక్షకులకు గుర్తు కూడా ఉండదు . అంతగా కవర్ అయిపోతుంది . An excellent drama . వాణిశ్రీ సినిమా . ఆవిడే షీరో … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions