.
ఫాఫం కేటీయార్ అనాలనిపస్తుంది కొన్నిసార్లు… నీట్ విద్యార్థులకు మద్దతుగా నిన్న తను నిర్వహించిన నిరసన ధర్నా కమ్ ఆందోళనలో తన మాటల్ని చూస్తే పక్కాగా అదే అనాలనిపిస్తుంది… తన కోటరీ తనను పూర్తిగా మిస్‌లీడ్ చేస్తున్నదనేది ఖాయం… దాంతో కేటీయార్ తను డీఫేమ్ అవుతూ, అన్‌పాపులర్ అయిపోతూ, తన చేష్టలన్నీ కౌంటర్ ప్రొడక్ట్ అయిపోతున్నాయి…
నీ చుట్టూ కోవర్టులను గుర్తించు చిన్న దొరా..! నిజానికి ఫస్ట్ నుంచీ విద్యార్థుల ఆందోళనల పట్ల బీఆర్ఎస్‌కు ఓ స్టాండ్ లేదు, ఏమైనా మాట్లాడితే మోదీకి కోపం వస్తుందేమో, ఆయనకు కోపం వస్తే మొదటికే మోసం వస్తుందేమో అని భయం… అసలే కాళేశ్వరం కత్తి బీఆర్ఎస్ పెద్దల మెడలపై వేలాడుతున్నాయి కదా… సీబీఐ, ఈడీ వంటివి ఉరిమితే ఏం జరుగుతుందో వాళ్లకూ తెలుసు… కకావికలు… కటకటాలు…
Ads
అందుకని సైలెంట్… అచ్చు, జగన్‌లాగే… దొందూ దొందే కదా… కానీ స్టూడెంట్స్ నిరసనలకు మద్దతు చెప్పకపోతే మరింత జనానికి దూరం అయిపోతామేనని అనుకుని ఓ ప్లాన్ వేశారు, కేటీయార్ 50వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించకుండా, విద్యార్థుల కోసం త్యాగం చేసి, వాళ్లకు మద్దతుగా ఓ ధర్నా చేద్దామని ప్లాన్…
(అఫ్‌కోర్స్, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కేటీయార్ జన్మదిన వేడుకలు అని నమస్తే తెలంగాణ రాసుకుంది పాపం… ఇదొక భారీ కౌంటర్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీ కేటీయార్‌కు…) మరీ మోదీకి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తే, మోదీకి కోపం వస్తే కొత్త తలనొప్పులు అని తెలుసు కదా… జస్ట్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకటీరెండు మాటలు చెప్పేసి, ఇక రేవంత్ రెడ్డి మీద పడ్డాడు కేటీయార్…
సో, నీ ధర్నాలో నిజాయితీ లేదు, విద్యార్థుల పట్ల నిజమైన ప్రేమ లేదు, ఆందోళన లేదు,, జస్ట్ రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఓ చాన్స్… అందుకని ‘‘నేను మోడీ పేరెత్తితే ఈ కేడీకి ఎందుకు కోపం? కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో ఆందోళనలు చేస్తుంటే కొడంగల్‌లో దాక్కున్నాడు రేవంత్ రెడ్డి, తనకు ధైర్యం లేదు… ఇలా సాగిపోయింది తన ప్రసంగం… అబ్సర్డ్…
నువ్వు నిలదీయాలని అనుకుంటే, నీ రాజకీయ పోకడలో నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టు, నీట్ వైఫల్యాలు- అక్రమాల్లో రేవంత్ రెడ్డికి లింకేమిటి..? ఇవే జనంలో పలుచన చేసేవి… నిజానికి కొడంగల్‌లో రేవంత్ రెడ్డి నిరసన ప్రదర్శించాడు… ఈరోజు మొత్తం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో మరో భారీ నిరసన ర్యాలీ చేయబోతున్నారు…
రేవంత్ రెడ్డికి తెలుసు కదా కేటీయార్ పోకడ… అందుకని పాత గ్లోబరీనా భూతాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చి కేటీయార్ మీద ప్రయోగించాడు… మిగతా కాంగ్రెస్ నాయకులూ అందుకున్నారు… అంతేనా… నీ హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ సహా చాలా లీకులు జరిగాయి, మీరేం చేశారు..? అని బండి సంజయ్ కూడా కడిగి పారేశాడు..,
సో, అవన్నీ మళ్లీ జనంలో చర్చనీయాంశాలు అయిపోయి, కేటీయార్ నెగెటివిటీని మూటగట్టుకున్నాడు అకారణంగా..! అన్నింటికన్నా ముఖ్యంగా… ‘‘అవసరమైతే కేసీయార్ స్వయంగా రంగంలోకి దిగుతాడు’’ అని కేటీయార్ పెద్ద జోక్ పేల్చాడు… రెండున్నరేళ్లుగా జనానికి మొహం చూపించలేక, పెద్ద పెద్ద సమస్యలు వస్తేనే జనంలోకి రాని పెద్ద దొర ఇప్పుడు జనంలోకి వస్తాడని కేటీయార్ చెప్పడం అక్కడ గుమిగూడిన వారికే నవ్వు పుట్టించింది..!! ఫాఫం !!!
హరీష్ రావు తెలివైనోడు… తను కేటీయార్ కాదు… అందుకే ఈ డొల్ల పోకడలకు దూరంగా ఉన్నాడు !!!
Share this Article