Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేటీయార్ పోరాటాలు కొత్త పుంతలు కాదు… విచిత్ర పుంతలు ఫాఫం..!!

July 8, 2025 by M S R

.

ప్రతిపక్షాల రాజకీయ పోరాటాల్లో కొత్త పుంతలు అనే పదం చాన్నాళ్లు, చాలాసార్లు విన్నాం గానీ… కేటీయార్ వాటన్నింటికీ మించిన విచిత్ర పుంతలు… కొన్నిసార్లు తనకే అర్థం కాదు కావచ్చు బహుశా…

లేకపోతే మరేమిటి..? విదేశాల నుంచి రాగానే ఏదో సమస్య ఎత్తుకుని, హరీశ్ రావు మీద పైచేయి సాధించాలి, లేకపోతే తను బాగా ఫోకస్ అవుతున్నాడనే భావనతో…. ప్రెస్ మీట్ చర్చ అంశాన్ని ఎత్తుకున్నాడు…

Ads

సరే, సొంత పార్టీలో బావామరుదల నడుమ… అన్నాచెల్లెళ్ల నడుమ స్పర్థ ఉంటే తప్పు లేదు, ఒకవేళ సమాజానికి మంచిదే అయితే అదీ మంచిదే… కానీ ఇదేం పోకడ..?

ఒక్కసారి ఇది చూడండి…

https://muchata.com/wp-content/uploads/2025/07/WhatsApp-Video-2025-07-08-at-11.50.31.mp4

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? అసెంబ్లీలో అయినా సరే, పార్లమెంటులో అయినా సరే… కేసీయార్ అయినా సరే, కేటీయార్, కిషన్ రెడ్డి, మోడీ ఎవరైనా సరే… మేం అమలు చేస్తున్న రైతు పథకాల మీద చర్చకు రెడీ అన్నాడు… పొలిటికల్‌గా ఈ సవాళ్లు సహజమే, జనంలో చర్చను, ఆలోచనను రేకెత్తించడానికి…

తనేమన్నాడు..? కేసీయార్, నువ్వు ప్రజాజీవితంలో లేకుండా పోయావు, జనం నీకు అప్పగించిన ప్రతిపక్ష పాత్ర కూడా నీకు చేతకావడం లేదు, అసెంబ్లీలో చర్చిద్దాంరా రైతు ప్రభుత్వం ఎవరో… అనేది తన సవాల్ సారాంశం…

బీఆర్ఎస్‌తోపాటు బీజేపీని కూడా సవాల్ చేస్తున్నాడు తను… రాజకీయాల్లో బహిరంగ చర్చకు సిద్ధమేనా..? అనే సవాళ్లు జస్ట్, నినాదాల కోసమే… ఇదేమీ అమెరికా కాదు, నిర్మాణాత్మక చర్చలు, టీవీ చర్చలు సాధ్యం కావడానికి…

రేవంత్ ఉన్నది ఢిల్లీలో… కానీ ఏమోయ్, రేవంతూ, నడువ్, నేను ప్రెస్ క్లబ్‌కు వస్తున్నాను, చలో వచ్చెయ్, చర్చిద్దాం అన్నట్టుగా పోలోమంటూ వందల మందితో బయల్దేరాడు కేటీయార్… దీన్నే వింత పుంతలు అంటారు… ఈ లెక్కన కవిత చాలా నయం… అఫ్ కోర్స్, హరీష్ ఇంకా నయం…

తను పిలిచింది మీ డాడీని… పైగా అసెంబ్లీకి… తెలంగాణ సమాజం వోట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు కొలువు దీరే అసెంబ్లీకి… దానికి ఓ సాన్టిటీ ఉంటుంది… ప్రెస్ క్లబ్ కూడా వోకే, కానీ తను ప్రెస్ క్లబ్‌లో కూర్చుందాంరా అని కాదు కదా సవాల్ విసిరింది…?

మరెందుకీ వక్ర వర్తింపు..? పోనీ, నిజంగానే ప్రెస్ క్లబ్‌లో చర్చకు రెడీ అయ్యే పక్షంలో ముందుగా ఓ ప్రిపరేషన్ ఉంటుంది… ఎవరెవరు జర్నలిస్టులు..? ఎంత మంది రావాలి..? ఎజెండా ఏమిటి..? అనే అంశాలు… పోలోమంటూ వందల మందితో ప్రెస్ క్లబ్ మీదకు దండెత్తడం కాదు కదా కేటీయార్…

ఫాఫం, ఆ క్లబ్‌కు కూడా నువ్వు చేసిన హామీలన్నీ వ్యర్థాలయ్యాయి కదా… యాదికి ఉందో లేదో… దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది… ఛల్, చౌరాస్తాలో తలబడదాంరా, కలబడదాంరా అనేట్టుగా ఉండవు కదా ప్రజాచర్చలు భావి నాయకా..!! ఓ ప్రజాస్వామిక వేదిక అసెంబ్లీ ఉంది కదా… డాడీతో కలిసి రావచ్చు కదా… జనం తీర్పూ అదే కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…
  • ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…
  • ఎస్ ‘సర్’… బెంగాల్‌లో అరాచకం సుప్రీం కోర్టుకూ అర్థమైంది..!
  • Narcissistic Injury…. కేజ్రీవాల్ మానసిక సమస్య… రాఘవ్ చద్దా తొలగింపు…
  • ఫాఫం పాడి కౌశిక్..! చివరకు రెంటికి చెడ్డ రేవడి ఐపోబోతున్నాడా..?!
  • దొందూ దొందే…! గ్యాండ్ లీడర్ తరువాత ఎవరికి వారే… దూరం- వైరం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions