.
సిద్ధాంతాల్లేవ్, ఓన్లీ రాద్ధాంతాలే…! పార్టీల విధానాల్లేవ్, ఓన్లీ సెంటిమెంట్ మంటలే..!! జుబ్లీ హిల్స్ ఎన్నిక ‘ఆడబిడ్డ’ చుట్టూ తిరుగుతోంది… అలా తిప్పితేనే గెలుస్తామని భ్రమపడిన కేటీయార్‌కు ఇటు రేవంత్ రెడ్డి నుంచి, అటు సొంత ఆడబిడ్డ కవిత నుంచి బలమైన కౌంటర్లు పడుతున్నయ్…
కేటీయార్ దగ్గర జవాబుల్లేవ్… సరే, ఈ ఆడబిడ్డ ఎజెండా ఏమిటో చూద్దాం… అబ్బే, మహిళలు, సమానహక్కులు, ప్రాధాన్యం వంటి అంశాలు కావు… మాగంటి గోపీనాథ్ మరణించాడు కదా, ఆయన భార్యను నిలబెట్టేసి, సానుభూతితో గెలిచేద్దామని బీఆర్ఎస్ ప్లాన్…
Ads
సానుభూతి ఉట్టిగానే రాదు కదా… అక్కడక్కడా ప్రచారవేదికలో గద్గదస్వరం, కన్నీళ్లు తప్పవు… ఆమె బాధ సహజమే కావచ్చుగాక… కన్నీళ్లు రాకుండా, బాధను తట్టుకుని, నిలబడి గట్టిగా నిలబడే నేత కావాలి జనానికి… బేలగా ఏడ్చేవాళ్లు కాదు…
ఏమిటీ కన్నీటి నాటకం అని ఎవరో కాంగ్రెస్ నేత ఏదో అన్నాడుట… ఆడబిడ్డను అవమానిస్తారా అని కేటీయార్ ఇప్పుడు ప్రచారాల్లో ఉరుముతున్నాడు… తనకూ తప్పదు పాపం… కానీ వెంటనే రేవంత్ రెడ్డి అందుకున్నాడు… సొంత ఆడబిడ్డనే పార్టీ నుంచి, ఇంటి నుంచి తరిమేసినవ్, నువ్వు కూడా ఆడబిడ్డలు, కన్నీళ్ల గురించి మాట్లాడుతున్నావా కేటీయార్ అనడుగుతున్నాడు…

సొంతింటి ఆడబిడ్డనే తరిమేసిన వాళ్లు ఈ సునీతను సరిగ్గా చూసుకుంటారా..? సొంత చెల్లెకు అన్నం పెట్టనోడు పిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తాడట అని వెటకారాన్ని దట్టించాడు… పైగా మహిళల్ని అసలు కేబినెట్‌లో తీసుకోని కేసీయార్‌కు ఆడబిడ్డలంటే అలుసు అంటున్నాడు…
కేటీయార్ దగ్గర నో ఆన్సర్… ఇది సరిపోదు కదా, కవిత ఎంటరైంది… నన్ను అవమానించారు, పార్టీ నుంచి తరిమేశారు, ఇంటికీ దూరం చేశారు, చివరకు సొంత బావ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు… తలుచుకుంటేనే కడుపు దేవుకుపోతోంది అని తనూ సెంటిమెంట్ దట్టించింది… ఎస్, దీనికీ కేటీయార్ దగ్గర ఆన్సర్ లేదు…
ఎందుకంటే… ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ అరాచకం… సొంత బిడ్డ, సొంత అల్లుడినీ నమ్మకుండా ఆ ఫోన్లూ ట్యాప్ చేయించిన గ్రేట్ తండ్రి కేసీయార్… తన నీడల్నీ తను నమ్మడు, నమ్మలేదు… దీంతో కేటీయార్ ప్రచారం చేస్తున్న ‘ఆడబిడ్డ’ అనే అస్త్రం మధ్యలోనే దారితప్పి ఉల్టా బీఆర్ఎస్ మీదకే వస్తోంది… అదెలా అంటే…
ఇది సరిపోదు అనుకుని, రేవంత్ రెడ్డి అప్పటి నేత పీజేఆర్‌ను తెరమీదకు తీసుకొచ్చాడు… (పీజేఆర్‌కు ఈ ఏరియాలో కాస్త మంచి పేరుంది…) ‘‘పీజేఆర్ మరణిస్తే ఏకగ్రీవానికి అంగీకరించలేదు, పైగా పీజేఆర్ కుటుంబాన్ని గంటల తరబడీ బజారులో నిలబెట్టాడు..’’ ఇదీ సీఎం విమర్శ… ఇక్కడా కేటీయార్ దగ్గర నో ఆన్సర్… ఇలా జుబ్లీ హిల్స్ ఎన్నిక ‘ఆడబిడ్డ’ అనే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతోంది… ప్రబలంగా..!!
Share this Article