కేటీయార్ చేసే వ్యాఖ్యల మీద స్పందించడానికి సీనియర్ జర్నలిస్టులు కూడా పెద్దగా ఇంట్రస్టు చూపించరు… తను అన్నీ ఆలోచించే మాట్లాడతాడులే, కాస్త హోం వర్క్ కూడా చేస్తాడులే అనే నమ్మకం ఒక కారణం… కానీ ఈమధ్య ఎందుకో ఫ్రస్ట్రేషన్ వద్దన్నా కనిపిస్తున్నట్టుంది తన మాటల్లో… తన వ్యాఖ్యల్లో ఒకింత రాజకీయ అపరిపక్వత కూడా కనిపిస్తున్నట్టుంది… యాక్టింగ్ ముఖ్యమంత్రిగా, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా తను ఏం మాట్లాడినా ఆ అంశాలపై లోకల్‌గానే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓ వాచ్ ఉంటుంది…
మరీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటు చేశాక, బీజేపీ తరువాత మేమే అన్నంత హైప్ క్రియేట్ చేస్తున్నాక… సహజంగానే కేసీయార్, కేటీయార్ మాటల మీద ఓ లుక్కు, వాటి విశ్లేషణ సహజం… సరే, బీజేపీని బట్టలిప్పి బజారులో బరిబాతల నెలబెడతాం వంటి పరుష వ్యాఖ్యలు కేడర్ కోసం అని సమర్థించుకోవచ్చు… బీజేపీ వైపు నుంచి కూడా అంతే ‘‘మర్యాద’’ భాష వినిపిస్తోంది కాబట్టి కేటీయార్ తిట్లు కూడా చల్తా… అలాగే కిషన్‌రెడ్డి ఫోన్‌లో పెగాసస్ ఉంది… ఆ ఫోన్ కూడా మోడీ వింటున్నాడు అనే వ్యాఖ్య కాస్త నవ్వు పుట్టించినా సరే, ఇలాంటి మైండ్ గేమ్స్ రాజకీయాల్లో సహజమే అని జస్టిఫై చేసుకోవచ్చు…
కిషన్‌రెడ్డి ఇలాంటివి చాలా వినీ వినీ కేంద్ర మంత్రి పదవి దాకా చేరాడు… మోడీ సమకాలీనుడు తను… కాకపోతే తన బాస్ వెంకయ్యతో కూడి కెరీర్ చెడగొట్టుకున్నాడని అంటారు… తను మొన్నటిదాకా హోం శాఖలో చేశాడు కదా… పెగాసస్ అనే స్పై వేర్‌ను రిమూవ్ చేయించుకోలేక పోయాడా..? సరే, తన సంగతి వోకే… తెలంగాణలో ప్రతి వ్యక్తి జాతకం మా చేతి వేళ్ల మీద ఉంది అన్నాడు అప్పట్లో ఓ ఐఏఎస్ పెద్ద మనిషి… అంటే ఏ రేంజులో పౌరుల వ్యక్తిగత డేటాలోకి జొరబడినట్టు..?
Ads
పెగాసస్ నిజమో కాదో సుప్రీమే తేల్చలేకపోయింది… మరి పది వేల ఫోన్లలో పెగాసస్ ఉందని కేటీయార్ ఏ ఆధారంతో చెబుతున్నాడు..? పోనీ, ఆ రచ్చ మనకెందుకులే గానీ… ఏక్‌సేఏక్ సైబర్ నిపుణులు, జెమ్స్ ఉన్నారు హైదరాబాద్ పోలీస్ విభాగంలో… ఆఫ్టరాల్ పెగాసస్‌ను రిమూవ్ చేయించుకోలేడా కేటీయార్..? పెగాసస్ అనేది అంత తోపేమీ కాదు… ఆఫ్టరాల్ ఓ స్పైవేర్… ప్రతి రాష్ట్రమూ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోంది, రికార్డ్ చేస్తోంది… తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తోంది…
శాంతిభద్రతలు, పరిపాలన కోణంలో ఎవరికైనా తప్పదు… ఏపీలో ఇలా హైఎండ్ స్పైవేర్ టెక్నాలజీ, పరికరాల కొనుగోలు కేసులోనే అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు బుక్కయింది… తనకు లింక్ లేదు గానీ, డేటా చౌర్యం కేసు వేరే… ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కాకపోతేనే ఆశ్చర్యపడాలి… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… వేటకుక్కలు, సీబీఐ, ఈడీ, ఐటీ మామీద కూడా దాడులు చేస్తయ్ వంటివి ప్రస్తుత సందర్భంలో ఊహించేవే… వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కనిపించదు వంటి వ్యాఖ్యల్లోనూ రాజకీయ ఎత్తుగడ, వెక్కిరింపుకన్నా అపరిపక్వతే కనిపిస్తోంది… కాలగతిలో, ఏదో ఓ దశలో కాంగ్రెస్ కనుమరుగు అయితే అవుతుందేమో గానీ, ఇప్పటికప్పుడు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టడం అంత వీజీ కాదు.,.
అన్నింటికీ మించి మోహన్ భాగవత్ మీద చేసిన వ్యాఖ్యలు మరీ ఇమ్మెచ్యూర్… “ఏమిటా చిల్లర మాటలు..? తనేమైనా ఎన్నికల్లో నిలబడ్డాడా..? కనీసం కౌన్సిలర్‌గా గెలిచాడా..?” అంటున్నాడు కేటీయార్… వార్డు సభ్యులు, ఎన్నికలు, కౌన్సిలర్లు మాత్రమే మనుషులా..? వాళ్లే మాట్లాడాలా..? అసలు మోహన్ భాగవత్ గురించి తెలియకుండా తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడా ఓ రాష్ట్రానికి..? ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదనే బేసిక్ పాయింట్ తెలియదా తనకు..? ఈ దేశంలో ఏం మాట్లాడాలన్నా కనీసం కౌన్సిలర్ అయి ఉండాలా..? ఆర్ఎస్ఎస్ భావజాలం మీద విమర్శ తప్పులేదు కానీ మరీ ఇదేం విమర్శ..? భాగవత్ క్షుద్ర రాజకీయవేత్త కాదు… RSS లో అక్కడిదాకా చేరడం చిన్న విషయం కాదు…
450 కోట్లతో మోడీ ఇల్లు కట్టుకున్నాడు అనే విమర్శ కూడా అంతే… వందల కోట్లతో కేసీయార్ ప్రగతి భవన్ కట్టుకున్నాడు అనే విమర్శ ఎంత నాసిరకమో ఇదీ అలాంటిదే… మోడీ కట్టింది పీఎం రెసిడెన్సా లేక మోడీ హౌజా..? అసలు కేటీయార్‌కు ఏమైంది హఠాత్తుగా…!? కేసీయార్ కూడా అప్పట్లో అమిత్ షా, భ్రమిత్ షా అని వెక్కిరించేవాడు…!!
Share this Article