.
Pardha Saradhi Upadrasta ….. ఫార్ములా–E స్కామ్ అంటే ఇదే అసలు కథ. ఏసీబీ రిపోర్ట్ లో ఏముంది? ACB రిపోర్ట్ ఒక్క విశ్లేషణ…
తెలంగాణలో జరిగిన ఫార్ములా-E రేస్ అంటారు గదా…
అది రేసు కన్నా “అవినీతి పరుగు” ఎక్కువగా జరిగింది అని ACB ఫైనల్ రిపోర్ట్ చెబుతోంది…
Ads
ఎవరు నిందితులు?
కేటీఆర్
IAS అరవింద్ కుమార్
BLN రెడ్డి
FEO కంపెనీ వాళ్లు ఇద్దరు
వీరి మీదే కేసు…
ఎక్కడ మొదలైంది?
ఈ రేస్ వ్యవహారం ప్రభుత్వ నిర్ణయం కాదు.
కేటీఆర్ ఒక్కరే నిర్ణయించుకున్నారు.
శాఖలకు చెప్పలేదు.
CMకి చెప్పలేదు.
ఫైళ్లు తిరగలేదు.
కేబినెట్‌కు విషయం వెళ్లలేదు.
అంటే…
సిస్టమ్ మూడో గేర్ లో ఉండగా, నిర్ణయం డైరెక్ట్ 6వ గేర్‌లోకి వెళ్లింది.
Electoral Bonds — అసలు లింక్…
ACE NXT GEN అనే కంపెనీ BRS కు ₹44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చింది.
బాండ్లు ముందే ఇచ్చారు, అగ్రిమెంట్లు, రేస్ అనుమతులు తర్వాత వచ్చాయి.
ACB మాటల్లో:
“ఇది quid-pro-quo స్పష్టమైన ఉదాహరణ…”
HMDA పేరు అగ్రిమెంట్లో లేదు కానీ డబ్బు మాత్రం HMDA నుంచే వెళ్ళింది!
Tri-party agreementలో HMDA లేదు.
అయినా—
సీజన్ 9కి → 46 కోట్లు
సీజన్ 10కి → 54.88 కోట్లు
బ్యాగ్ HMDAదే, ఖర్చు FEOదే.
చివరికి RBI, GST ఉల్లంఘనలతో ₹8 కోట్లు HMDA కు ఫైన్ కూడా పడింది. ఒక ప్రభుత్వ సంస్థ RBI నిబంధనలు ఉల్లంఘించి జరిమానా వేయించుకోవడం అవమానకరం. నువ్వు ఎందుకు చేశావు అని అప్పటి MD అరవింద్ కుమార్ ను అడిగితే నాకు మౌఖిక ఆదేశాలతో వత్తిడి వచ్చింది విడుదల చేశా అని చెప్పాడు ACB కి అని ACB రిపోర్ట్.,
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఒప్పందాలు!
2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల కోడ్.
కోడ్ ఉన్నప్పుడు కూడా—
👉 అక్టోబర్ 30న కొత్త అగ్రిమెంట్
👉 పెద్ద మొత్తంలో చెల్లింపులు
👉 EC అనుమతి లేదు
👉 Finance dept అనుమతి లేదు
ఇది ఏమిటంటే…
“వర్షం పడుతుండగా బట్టలు సూకాగా ఉండాలి అన్నట్టే…”
తెలంగాణపై పడిన భారం
సీజన్ 10, 11, 12 కలిపి— 600 కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై వేసేశారు.
ప్రతిఫలం ఉందా?
ప్రభుత్వ లాభం ఏదైనా వచ్చిందా?
➡️ ACB చెప్పింది…. : లేదు. జీరో.
🟦 Nielsen రిపోర్ట్ — కేటీఆర్ చెప్పిన 700 కోట్ల లాభం… కథే!
కేటీఆర్ పదేపదే చెప్పిన 700 కోట్ల లాభం అన్నది— ఉత్తదే…
ACB చెబుతుంది…:
❌ రిపోర్ట్ అసలు నిజం కాదు
❌ డేటా లేదు
❌ కంపెనీ సహకరించలేదు
❌ ఏ శాఖ దగ్గరా సమాచారం లేదు
సూటిగా చెప్పాలంటే:
“రిపోర్ట్ కూడా ఫేక్… లాభం కూడా ఫేక్”…ప్రభుత్వానికి, హైద్రాబాద్ కు ఉపయోగం కాబట్టి చేసాం అన్న దానిలో నిజం లేదు అని ACB రిపోర్ట్ చెపుతోంది….
ప్రతి ఒక్కరి పాత్ర సింపుల్‌గా…
కేటీఆర్
ఒకరే నిర్ణయాలు,
ప్రక్రియ అంతా పక్కన పెట్టి అంతా తానే అని వ్యవహరించటం,
రాజకీయ లాభం పెద్దదిగా…
అరవింద్ కుమార్
Governor అనుమతి లేకుండా కాంట్రాక్టులు,
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం KTR నోటి మాట మీద HMDA నుండి డబ్బులు విడుదల
MAUD + HMDA అధికారాల దుర్వినియోగం
BLN రెడ్డి
తప్పు బిల్లులను పాస్
సిబ్బందిపై ఒత్తిడి
FEO టీమ్
అక్రమ అగ్రిమెంట్లు
మేమే పెట్టుబడి పెడతాము అని చెప్పి HMDA నిధుల వినియోగం, సొమ్ము ఒకడికి, సోకు ఒకడికి
డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, ఆ డబ్బును ఎలెక్టోరల్ బాండ్ ద్వారా పార్టీ కు మళ్లించడం…
ఏ సెక్షన్లు పెట్టారు?
( పాత కేసు కాబట్టి పాత ఐపీసీ సెక్షన్ లు)
PC Act సెక్షన్ 13
IPC 409
IPC 120B
ACB తుది మాట – సూటిగా…
“ఫార్ములా-E రేస్ అనేది ఒక్క క్రీడ మాత్రమే కాదు, ఆడిన ఆట మాత్రం అవినీతే.”
ప్రస్తుతానికి ఇది ACB రిపోర్ట్, దీని మీద పబ్లిక్ సర్వెంట్లు కాబట్టి వీరి మీద విచారణ చేసి చర్యలకు అనుమతి ఇవ్వమని గవర్నర్ ను అడగ్గా గవర్నర్ అనుమతి ఇచ్చారు… పలు దఫాలుగా KTR విచారణకు హాజరు కూడా అయ్యారు…
ఇదొక లొట్ట పీస్ కేసు అని కూడా వ్యాఖ్యానించారు…
చూద్దాం, ఈ లొట్ట పిసు కేసు ఎక్కడకు వెళ్తుందో…… — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #FormulaEScam #ACBReport #KTR #Telangana #WhistleblowerStyle #SimpleExplainer
Share this Article