.థాంక్ గాడ్… 4 గంటల్లో 40 CM, 2 డేస్ లో 60 CM… అత్యంత భారీ వర్షాలు… ఇవి కుండపోత కాదు… మేఘాలు మీదపడటం…ఊళ్లు ఖాళీ చేయించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వం పని… పక్కాగా చేస్తోంది… CM కూడా రెగ్యులర్ సమీక్ష ఉంటోంది… గుడ్…మరో వ్యక్తి గురించి ఓసారి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ సందర్భంగా… తను బండి సంజయ్…ఇది నా పని కాదు అనుకోలేదు… తను ఇలాంటి సందర్భాల్లో నేరుగా ఫీల్డ్ లో దిగిపోయాడు… అనవసర పబ్లిసిటీ హంగామా ఉండదు… ఎక్కడ ఎవరికి ఏం అవసరం వస్తుంది, నేనేం చేయాలి… ఇదే కనిపిస్తుంది…కామారెడ్డి ఐతే మునిగిపోయింది… ఆ పట్టణం కనీవినీ ఎరుగనంత కుమ్మరింత… సిరిసిల్ల, సిద్దిపేట డివిజన్లు, జిల్లాలు కూడా అతలాకుతలం…ఇది నా ఏరియా కాదు కదా, ఇది రాష్ట్ర సర్కారు పని కదా అని చూడకుండా… మొక్కుబడి పరామర్శలు గాకుండా సర్వీస్ చేయడం ముచ్చుకోవాల్సిన సుగుణం…నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడారంటూ కొనియాడుతున్న అక్కడి ప్రజలు…వరదల్లో చిక్కుకున్నారని తెలిసిన వెంటనే యుద్ద ప్రాతిపదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి, 4 ఆర్మీ హెలికాప్టర్లను తెప్పించాడు… తద్వారా నర్మాల వరదల్లో చిక్కుకున్న ఐదుగురు ప్రాణాలను ఎయిర్ లైఫ్ చేసి కాపాడినవి రెండు ఆర్మీ చాపర్లు… సకాల స్పందన ఫలితం ఇది…మరో రెండు హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపారు అధికారులు… ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పరుగులు తీయించాడు…వరదల్లో గలంతైన నాగం కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష సాయం అందచేశాడు… అదుగో అలా ఫీల్డ్ లో తిరుగుతుంటే నర్మాలలో ఎదురుపడ్డాడు కేటీఆర్…
పరామర్శలకు టైం ఉంది కేటీఆర్, హరీష్… ముందు సర్వీస్ ముఖ్యం… ఇద్దరూ వరద ప్రాంతాలకు వెళ్ళి రేవంత్ ను ఆడిపోసుకుంటున్నారు… వరద రాజకీయం, బురద రాజకీయం…ఇప్పుడు పబ్లిసిటీ కాదు కదా ముఖ్యం… ఒకవైపు స్టేట్ సర్కార్, సీఎం అలెర్ట్ గా ఉండి పర్యవేక్షిస్తున్నారు… ఈ కేంద్ర మంత్రి ఫీల్డ్ లో చురుకుగా అటెండ్ అవుతున్నాడు…
మరి మిగతా నాయకులు ఏరి అడక్కండి… రేపో ఎల్లుండో పరామర్శలకు వస్తారు…నర్మాలలో రెస్య్కూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ ను అభినందిస్తూ కేంద్ర మంత్రి శాలువాతో సన్మానించాడు…ఇక్కడ మరికొందరిని ప్రస్తావించాలి… సిరిసిల్ల ఉన్నతాధికారులు, NDRF, వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్ కమాండర్ వీఎస్.శైనీ, గ్రూప్ కెప్టెన్ హెచ్ సీ ఛటోపాధ్యాయ హకీంపేట కూడా సకాలంలో రియాక్ట్ అయ్యారు… గుడ్ గుడ్…
Share this Article