.
నాయకుడికి క్రెడిబులిటీ ముఖ్యం… తన మాటలకు విలువ ఉండాలి… రాజకీయ విమర్శ అయినా సరే జనంలో ఆలోచనను రేకెత్తించాలి… బట్, ముఖ్యమంత్రి కావాలనుకునే కేటీయార్‌కు అదేమీ పట్టినట్టు లేదు…
ఇది సోషల్ మీడియా యుగం… రకరకాల అబద్ధాలు, అతిశయోక్తులు సమాజంలో ప్రవహిస్తూ ఉంటాయి… కానీ వాటిని మెయింటెయిన్ చేసినా సరే, నాయకుడు అలా మాట్లాడకూడదు… జనం నవ్వుకుంటారనే ఇంగితాన్ని ప్రదర్శించాలి…
Ads
- ఫాఫం కేటీయార్… తను బాగానే సబ్జెక్టు అర్థం చేసుకోగలడు, ఆశువుగా మాట్లాడగలడు… కానీ తన టీమ్ మాయలో పడిపోయి, అచ్చంగా తనూ ఓ సోషల్ మీడియా కార్యకర్తలా మారిపోయి, నవ్వులపాలవుతున్నాడు… మరోరకంగా చెప్పాలంటే, తనే ఓ నమస్తె తెలంగాణ మార్క్ వింత కథనంలా మారిపోతున్నాడు… ఇదొక వింత రూపాంతరం… కవిత భాషలో చెప్పాలంటే… రామన్నా, జెర నీ మాటలకు విలువ నువ్వే బచాయించుకోవే.,..
పాత్రికేయ భాషలో చెప్పాలంటే ఓ న్యూనుడి… గాలి పోగేసి స్టోరీలు రాయడం… అంటే… గాలి నుంచి, శూన్యం నుంచి ఏదో ఓ వివాదాన్ని, రాద్దాంతాన్ని, కథనాన్ని క్రియేట్ చేసి జనంలోకి కుమ్మేయడం..! creating some thing from vaccume … ఉదాహరణ చెప్పమంటారా..? నిన్నటి కేటీయార్ అర్ధరహిత, హాస్యాస్పద విమర్శ…
యూరియా సంక్షోభం వెనుక పెను కుట్ర… అవునట… అదేమిటయ్యా అంటే… రైతులు ఎక్కువ పంట పండిస్తే, వాళ్లకు బోనస్ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి… ఆ పంటను కొనుగోలు చేయాల్సి వస్తుంది కాబట్టి… రేవంత్ రెడ్డి తనే యూరియా సంక్షోభానికి స్కెచ్ వేశాడట… ఢిల్లీలో మోడీ కలిపి పన్నిన కుట్ర, తెర వెనుక పుతిన్, ట్రంప్ కూడా ఉన్నారని అన్లేదు, సంతోషం…
ఇదే కుట్రను చంద్రబాబుతో కలిసి పన్ని, మన ప్రాజెక్టుల్లో నీళ్లన్నీ ఆంధ్రా వైపు పంపించేస్తున్నాడని కూడా అనలేదు… అదీ సంతోషమే… కుర్చీ మీద ఉన్న ఏ పాలకుడైనా సరే… రైతు ఆదరణను కోరుకుంటాడు… అది కేసీయార్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే… రైతు సంతృప్తిగా ఉంటేనే తనకూ, తన పార్టీకి, తన ప్రభుత్వానికి ఫాయిదా…
అలా ఆలోచించేవాడే అయితే… నిజంగా కేటీయార్ వైపరీత్యపు మాటల్లో 0.0001 శాతం నిజం ఉన్నా సరే, రేవంత్ ఖజానా కష్టాల్లో కూడా రుణమాఫీ ఎందుకు చేస్తాడు… రైతు భరోసా ఎందుకిస్తాడు… బోనస్ ఎందుకు చెల్లిస్తాడు..? కేటీయార్ మాటలు విని రైతులూ నవ్వుకుంటున్నారు… ఫాఫం కేటీయార్…
యూరియా ఎవరు ఇవ్వాలనే కనీస సోయి లేకపోతే ఎలా..? ఇవ్వాల్సింది కేంద్రం… అడగాల్సింది కేంద్రాన్ని… ఎస్, యూరియా కష్టాలు నిజం… కేంద్రంలోని బీజేపీని నిందించాలి కదా… కనీసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వరకైనా సరే, నిలదీయాల్సింది బీజేపీనే కదా… అది మరిచి ఏదేదో ఫాంటసీ కుట్రల్ని రేవంత్ మెడలో వేస్తానంటే ఎలా..?
సేమ్, బనకచర్ల మీద కూడా నిరర్థక, అర్థరహిత వ్యాఖ్యలు, విమర్శలు… కాళేశ్వరాన్ని ఎండబెట్టి, పండబెట్టడం వెనుక బనకచర్లకు నీళ్లు పంపించడమే కుట్ర అంటాడు… ఆలూ లేదు, చూలూ లేదు… ఆ ప్రాజెక్టే లేదు, కాళేశ్వరం నీళ్లను గోదావరిలోకి వదిలేశాడట రేవంతుడు…
వికారాబాద్ నేవీ రాడార్ దగ్గర నుంచి యూరియా కష్టాల దాకా… నమస్తే కేటీయార్… ఆ పత్రిక కథల్లాగే కేటీయార్ మాటలు… ఎస్, కేటీయార్ ఇలాగే ఉన్నంతకాలం, నీకేం ఢోకాలేదు రేవంత్… నో ఫికర్…
Share this Article