.
సీన్ -1 …. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ… టికెట్లు, చేరికలు, రాయబారాలు, చెల్లింపులు గట్రా మొత్తం తన బావమరిది అల్లు అరవింద్ చూసుకునేవాడు… పవన్ కల్యాణ్ యువరాజ్యం పేరిట పంచెలాడదీసి కొడతాం అనే తన సహజమైన పిచ్చి భాషలో ప్రసంగాలు చేస్తూ తిరిగేవాడు… అంతా సినిమా మార్కెటింగ్ యవ్వారం…
ఒకటి వైఎస్‌కు, మరొకటి చంద్రబాబుకు… మిగతా 292 స్థానాలు మావే అన్నాడు అల్లు అరవింద్… సీన్ కట్ చేస్తే 18 సీట్లు… డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ బయర్ కమ్ పార్టీ చీఫ్ ఆర్గనైజర్ పనితీరు అదీ… హీరో, అదనపు చిన్న హీరో ఫ్లాప్…
Ads
సీన్- 2 … జగన్ మోహన్ రెడ్డి… జనం చంద్రబాబు మరీ 23 సీట్లకు పరిమితమయ్యాడు… జనసేన దాదాపు జీరో… అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించలేక అడ్డదిడ్డంగా పాలించి, కులాన్ని పులుముకుని… వైనాట్ 175 అన్నాడు… అంటే సెంట్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్… సీన్ కట్ చేస్తే… 11 సీట్లు… అవీ కష్టమ్మీద, జనాన్ని తక్కువ అంచనా వేసి ఘోరంగా దెబ్బతినడం అంటే ఇదే…
.
వర్తమాన తెలంగాణ రాజకీయాల్లోకి వద్దాం… కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు కూడా రావు అంటున్నాడు చిన్న దొరవారు కేటీయార్… దీనికి నేపథ్యం ఏమిటయ్యా అంటే… రేవంత్ రెడ్డి సర్వే చేయించుకున్నాడు, అందులో 78 సీట్లు బీఆర్ఎస్‌కు వస్తాయని తేలింది, అందుకే ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నాడు అని కేటీయార్ ఎక్కడో అన్నాడు…
ఒరే నాన్నా… 2028 డిసెంబరులో కాదు, 2029లో జరుగుతాయి ఎన్నికలు… 119 సీట్లు కాదు, 182 ఉంటాయి, 17 ఎంపీ సీట్లు కాదు, 26 ఉంటాయి… మేం 117 గెలుస్తాం, భద్రాచలం రాముడి మీద ఆన అన్నాడు రేవంత్ రెడ్డి… వెంటనే ఉలిక్కిపడిన కేటీయార్ మీకు 7 సీట్లు కూడా రావు అన్నాడు…
దాని మీద సోషల్ మీడియాలో సెటైర్లు అప్పుడే… ‘‘అంటే చిన్నదొరా… మజ్లిస్‌కు 7, మీతో పొత్తు పెట్టుకునే బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 7… మీకు 148 అనుకోవాలా..? వావ్, ఒక అల్లు అరవింద్, ఒక జగన్ మోహన్ రెడ్డి… ఒక కేటీయార్…
నిజానికి కేడర్‌లో ఉత్సాహం నింపడానికి, ఇంకెవరూ పార్టీ విడిచి పారిపోవడానికి వీల్లేకుండా ఇలాంటి మ్యాథ్స్ గేమ్స్, మైండ్ గేమ్స్ ఆడుతుంటారు నాయకులు… మరీ దారుణంగా దెబ్బతిన్న తమ కేడర్‌ను కాపాడుకోవడానికి కేటీయార్ అలా సైకలాజికల్ వార్ తరహాలో, తన కోటరీ చెప్పినట్టు మాట్లాడి ఉండవచ్చు గాక… ఒక నెరేటివ్ సెట్ చేసే విఫల ప్రయత్నం కావచ్చుగాక… కానీ మరీ 292 మావే, వై నాట్ 175 బాపతు ప్రకటనలు దేనికి నాయకా..?
రేవంత్ రెడ్డి కూడా ఏ 80 శాతమో, 90 శాతమో గెలుస్తామని అనడం లేదు, పాపం… 117 మాత్రమే గెలుస్తాం అంటున్నాడు… కన్జర్వేటివ్ సమీకరణం… మరీ కేటీయార్‌లాగా గాకుండా..!!
Share this Article