.
హైదరాబాదులో ఉండటానికి తమకు సరైన ఇల్లు కూడా లేదన్నాడు కదా కేటీయార్… ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వెళ్లి మరీ కేటీయార్‌కు హైదరాబాద్ అత్యంత విలువైన లొకాలిటీల్లో స్టార్ హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయని అన్నాడో, ఇక కేటీయార్‌కు అంగీకరించక తప్పలేదు…
నిజమే, వ్యాపారాలు ఉంటే తప్పేమిటి అంటూ ఓ విఫల సమర్థనకు ప్రయత్నిస్తున్నాడు గానీ… వరుసగా బయటపడుతున్న భూములు, ఆస్తులు, వ్యాపారాలు జనంలోకి ఫుల్లు నెగెటివ్‌గా వెళ్తున్నాయనీ, తమకు సరైన ఇల్లు లేదన్న తన వ్యాఖ్య హాస్యాస్పదమై భారీ కౌంటర్ ప్రొడక్ట్ అయిందనీ మరిచిపోతున్నాడు…
Ads
కేటీయార్ కుటుంబ దోపిడీపై వరుసగా అనేక అక్రమాలు బయటపెడుతూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి… ఇంకా అపారమైన ఆస్తిపాస్తులు, విదేశాల్లో పెట్టుబడులున్నాయనీ, అన్నీ బయటపెడతాననీ అంటున్నాడు… అవును, రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో ఓ కీలక ప్రశ్నను చర్చకు పెడుతున్నాడు… ఇంతటి ఆస్తిపాస్తులు ఈ కుటుంబానికి ఎలా వచ్చాయి..?
కాళేశ్వరం అక్రమాల నుంచి మొదలుపెట్టి… అనేకం… వందల ఎకరాల ఫామ్‌హౌజులు, భూములు, అసైన్డ్- సర్కారు భూముల ఆక్రమణలు, స్టార్ హోటళ్లు, విదేశాల్లో పెట్టుబడుల దాకా… అనేకం… రేవంత్ రెడ్డి జనంలోకి స్ట్రాటజిక్ రిలీజ్ చేస్తున్నాడు… మన చట్టాలు, మన న్యాయవ్యవస్థల సంగతి తెలుసు కదా, అందుకే ప్రజాకోర్టులోకి వదులుతున్నాడు…
జనానికి కేసీయార్‌ను ఓ వికటరూపంగా కాదు, నిజమైన ఓ వికృతరూపంగా దర్శింపచేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్… తను చెబుతున్నవన్నీ నిజాలే… కేటీయార్ అండ్ పార్టీకి అంగీకరించకతప్పని సిట్యుయేషన్… కేసీయార్ కుటుంబసభ్యులు అన్నీ చట్టప్రకారమే అంటున్నారు తప్ప అంత సంపద ఎలా పోగుపడిందో చెప్పలేని అవస్థ…
రేవంత్ రెడ్డి చెప్పిన స్టార్ హోటళ్ల విషయానికి వద్దాం… కేటీయార్‌కు హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నమాట నిజమే… హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెక్కన్ సెరాయి హైటెక్ సిటీ (డెక్కన్ సేరి), డెక్కన్ సెరాయి గ్రాండ్ హోటల్ గచ్చిబౌలిలో ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం సర్వీస్ అపార్ట్ మెంట్స్ కూడా ఇదే బ్రాండ్ తో ఉన్నాయి. ఇవన్నీ ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉన్నాయి.

ఇందులో ప్రసుతం డైరెక్టర్లుగా కేటీఆర్ భార్య శైలిమా కల్వకుంట్ల తో పాటు శ్రీధర్ తేలుకుంట్ల, పట్టాభిరామారావు చిలుకూరి ఉన్నారు. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 2005 అక్టోబర్ 25 నుంచి 2014 అక్టోబర్ వరకు డైరెక్టర్ గా కొనసాగాడు. గతంలో సంతోష్ రావు జోగినపల్లి కూడా ఈ కంపెనీలో డైరెక్టర్…
మరి సీఎం రేవంత్ రెడ్డి సోదరుల కంపెనీల మాటేమిటని బీఆర్ఎస్ ఎదురు ప్రశ్నిస్తోంది, అంటే తమ కంపెనీల కథ నిజమేనని అంగీకరిస్తున్నట్టే కదా… అంతేకాదు, రేవంత్ రెడ్డి చెబుతున్న కేసీయార్ కుటుంబ ఆస్తుల యవ్వారంపై తెలంగాణ సమాజంలో భారీగా చర్చ జరగడంతోపాటు, ఇంకెన్ని ఆస్తులు, ఏయే బినామీ పేర్లతో ఉన్నాయో అనే ఆసక్తి, సందేహాల వ్యాప్తి కూడా వేగంగా సాగుతోంది…
‘‘అవును, మేం అప్పుడెప్పుడో హోటల్ వ్యాపారం స్టార్ట్ చేశాం, మూడు హోటళ్లు నిజమే’’ అనేది కేటీయార్ ఒప్పుకోలు… తేడా ఏమిటంటే..? ఇంత అపారమైన ఆస్తిపాస్తుల సంగతి ఇంతకుముందు జనానికి తెలియదు… ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి… ఉద్యమపార్టీ కాస్తా ఫక్తు దోపిడీ పార్టీగా మారి, ముఖ్యనేతలు ఎలా దండుకున్నారనే చర్చ జరుగుతోంది జనంలో… ఇంకా ఏమేం బయటపెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి?!
బీఆర్ఎస్ క్యాంపు పదే పదే ఓ మాట వాడుతూ ఉంటుంది... ఇప్పుడు తనకు తానే వేసుకోవాల్సిన ప్రశ్న... ‘‘ఎవడి పాలైందిరో తెలంగాణ?’’
Share this Article