Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!

June 23, 2025 by M S R

.

చెప్పాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… కుబేర కేవలం తెలుగులోనే సూపర్ హిట్… చాన్నాళ్ల తరువాత తెలుగు థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి… థియేటర్లు యాడ్ అవుతున్నాయి…

మార్కెట్‌లో మరో సినిమా ఏదీ చూడదగింది లేదు కాబట్టి కుబేరకు ఢోకా లేకపోవచ్చు… ఆదివారం రాత్రి కూడా హౌజ్ ఫుల్… ఓవర్సీస్‌లో మరీ ఎక్కువగా చూస్తున్నారు… దానికి కారణాల జోలికి ఇక్కడ పోలేం కానీ…?

Ads

తమిళ ప్రేక్షకులు వేరే ఏ ఇతర భాష సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు… చివరకు వాళ్ల హీరో ధనుష్ నటవిశ్వరూపం అయినా సరే, తెలుగులో చూసినట్టుగా తమిళంలో చూడటం లేదు… తమిళ్ డబ్బింగ్ కూడా నాణ్యతతో నిర్వహించారు…

అదొక భాషోన్మాదం అనాలా…? మరి అలాంటప్పుడు తమిళ హీరోల సినిమాల్ని తెలుగువాళ్లు ఎందుకు ఆదరించాలి..? తమిళ ఫ్యాన్సే చెప్పాలి… ఈ వార్త రాసే సమయానికి మొత్తం వసూళ్లు 56 కోట్లు కాగా… తెలుగులోనే 21.5 కోట్లు, తమిళంలో జస్ట్ 9 కోట్లు… కనిపిస్తూనే ఉంది వివక్ష…

ఇక చెప్పాల్సింది కన్నడంలో ఈ సినిమా డిజాస్టర్… నిన్న చెప్పుకున్నాం కదా, రష్మిక రచ్చ గెలిచినా ఇంట తలనొప్పులు, వివాదాలు, దాదాపు బాయ్‌కాట్ సిట్యుయేషన్… ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా కనిపిస్తోందా..? మొదటి రోజు 2 లక్షలు, సండే 5 లక్షలు… దారుణం… శెట్టి గ్యాంగ్ బాగానే ఆమె మీద నెగెటివిటీని క్రియేట్ చేసిపెట్టింది…

సరే, హిందీలో కూడా ఫ్లాపే… రెండు రోజుల్లో జస్ట్, అరకోటి మాత్రమే… వాళ్లకు పుష్ప-2 వంటి గుట్కా స్టోరీ కావాలి… శేఖర్ కమ్ముల ఆనడు… వాళ్లకు ఇప్పుడు సౌత్ మాస్ కావాలి… సో, మొత్తానికి సినిమా గట్టెక్కాలంటే… బీ, సీ సెంటర్లలో హోల్డ్ కావాలి… రెండోవారం నిలబడాలి…

సరే, ఓటీటీ, ఓవర్సీస్, శాటిలైట్ హక్కులతో గట్టెక్కొచ్చులే… కానీ నిర్మాత సునీల్ నారంగ్ ఓ మాటన్నాడు… నాకు పదో పదిహేను శాతమో నష్టాలు వచ్చినా పర్లేదు… కానీ ఈ సినిమా గనుక హిట్ గాకుండా ఉంటే తెలుగునాట 20 శాతం థియేటర్లు మూతపడేవి అని… సో, కుబేర సరైన సమయంలో థియేటర్లను కాపాడినట్టే..!!

ఇదంతా సరే గానీ.., మనం కన్నడ కేజీఎఫ్‌లను, కాంతారాలను ఆదరిద్దాం… తమిళ తంబీలను నెత్తిన పెట్టుకుందాం… కానీ వాళ్లు మాత్రం మనల్ని ఎందుకు దేకరు..? ఆలోచించారా ఎప్పుడైనా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions