Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…

June 20, 2025 by M S R

.

చాన్నాళ్ల తరువాత ఓ సినిమా గురించి నాలుగు మెచ్చుకోలు మాటలు రాయడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమా… కుబేర… సినిమా ప్రేమికుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల దాదాపుగా నిలబెట్టుకున్నాడు… ఓ ఆలోచనాత్మక కథను నీట్‌గా ప్రజెంట్ చేశాడు…

సారీ, అడ్డగోలు ఎలివేషన్స్, బూతులు, అశ్లీలం, పిచ్చి పాటలు, స్టెప్పులు, ఐటమ్ సాంగ్స్ ప్రియులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు… ఏమో, ఇలాంటి సినిమాల్ని కూడా ప్రేమించడం. కొత్తగా నేర్చుకోవచ్చు కూడా… 

Ads

ఎవరు హీరో..? ఎవరూ లేరు… కథే హీరో… కాదు, తను అనుకున్న పాయింట్‌ను స్ట్రెయిట్‌గా, ఏ మసాలాలూ జతచేసి పాడు చేయకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేసిన దర్శకుడే హీరో… తను ఓ డిఫరెంట్ కేరక్టర్… రాజమౌళి చెప్పినట్టు కథ విషయంలో స్టబ్బరన్, ఎవరి ఇగోస్ కోసమే కథను మార్చాడు శేఖర్… నాగార్జున చెప్పిందీ అదే, శేఖర్ వినడు, అందుకే ఎవరూ కథలో వేలుపెట్టారు, పెట్టలేదు అని…

ఫక్తు రొటీన్ కమర్షియల్ మసాలా ఊకదంపుళ్ల నడుమ కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చినట్టుగా… సినిమా లెంత్ ఎక్కువై, కాస్త స్లోగా నడుస్తున్నట్టు అనిపించడం ఒక్కటే మైనస్… నిజానికి మైనస్ కాదు, కథ అలాంటిది మరి… 

సాధారణంగా శేఖర్ కథలు ఫీల్ గుడ్ స్టోరీలు… కానీ ఇందులో కాస్త భిన్నంగా ట్రై చేశాడు, స్కాం ఎట్సెట్రా…  ఇది ఓ నిరుపేదకూ, ఓ ధనికుడికీ నడుమ… కాదు, పేదరికాని, సంపన్నతకూ నడుమ ఘర్షణ కథ… నాగార్జున ఓ సీబీఐ అధికారి, ఓ భారీ ప్లాన్‌లో భాగంగా బెగ్గర్లను నియమిస్తుంటాడు… ఓ బెగ్గర్ ధనుష్ ఈ కథను ఎలా మలుపు తిప్పుతాడు, బలవంతులకు ఎలా పాఠం చెప్పాడు అనేది స్టోరీ…

ప్రధానంగా ఈ రెండు పాత్రల మీదే కథ ఆధారం... ఇద్దరూ సరిగ్గా న్యాయం చేశారు ఆ పాత్రలకు... నాగార్జున ఈ పాత్రను అంగీకరించడం మారుతున్న తన ప్రయారిటీలకు సూచిక... తన బాడీ లాంగ్వేజీ, భాష, మాటలు అన్నీ డిఫరెంట్... నటుడిగా చాన్నాళ్లుగా ఓ మంచి పాత్ర లేక, క్లిక్ కాక సతమతం అవుతున్న తనకు ఇది ప్లస్ ఇప్పుడు... తనకు రిలీఫ్ కూడా... తన భావి పాత్రలు ఎలా ఉండాలో కూడా నాగార్జున ఓ నిర్ణయానికి రావచ్చు...

ధనుష్ స్వతహాగానే మంచి నటుడు… ఇలాంటి పాత్రలు దొరికితే నటించడు, పూర్తిగా లీనమైపోతాడు… డిఫరెంట్ పాత్రలు ఎలా చేస్తాడో తను గతంలోనూ చూశాం కదా, ఇదీ అలాంటిదే తన నటనను ఆవిష్కరించే పాత్ర… బాగా చేశాడు… ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు దీంతో… ఒకేమాటలో చెప్పాలంటే ధనుష్ యువార్ ఎక్సలెంట్...

https://x.com/Santhosh85_/status/1935888152360894516?t=fXh1EDnHOE_TY37vCClugQ&s=08

ఈ సీన్ వచ్చాక థియేటర్లలో జనం లేచి చప్పట్లు, కేకలు… వావ్, ఎన్నేళ్లయింది ఓ నటుడి యాక్షన్‌కు ఇలాంటి చప్పట్లు… కేక… ఈసారి జాతీయ అవార్డు గనుక తనకు దక్కకపోతే ఆ అవార్డులే దండుగ అన్నట్టుగా… అతిశయోక్తి ఏమీ కాదు… చాలామంది నటభీకర, నటబీభత్సలు చూసి నేర్చుకోవాలి…

dhanush

మూడో ప్రధాన పాత్ర రష్మిక… కొంతకాలంగా ఆమె ఎదుగుదల ఇండస్ట్రీకే ఆశ్చర్యం… అయితే సాధారణంగా శేఖర్ సినిమాల్లో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి… ఆత్మవిశ్వాసంతో కథను మోస్తాయి… ఇందులోనూ రష్మికకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికినా సరే, శేఖర్ సినిమాల్లో కనిపించే స్త్రీ పాత్రల్లాంటి బలమైన పాత్ర అనిపించదు... బట్, ఆమె తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది… ఎక్కువ కాదు, తక్కువ కాదు, శేఖర్ అలా చేయనివ్వడు కూడా…

కథే కాస్త డిఫరెంట్, శేఖర్ మార్క్ కథ కాదు… లక్ష కోట్ల కుంభకోణం, బినామీ బిచ్చగాళ్లు వంటి కొత్త కథాంశం మొదట్లో ఆశ్చర్యాన్ని కలిగించినా… ఎప్పుడైతే ధనుష్ పాత్రకు పేద- ధనిక అంతరాలు, ఇతర భావోద్వేగాలను జతచేశాడో కథ ఆసక్తికరంగా మారిపోతుంది… రష్మిక ప్రవేశంతో కథ కాస్త నీరసపడినా, తరువాత కవర్ చేశాడు దర్శకుడు…

కుబేర

పేద గర్భిణి ట్రాక్ బాగా వచ్చింది…  ఒక బిచ్చగాడు అత్యంత ధనవంతుడిని వీధులకు తీసుకువచ్చే సన్నివేశం కూడా… కొంత సినిమాటిక్‌గా ఉన్నా సరే, ఆ డ్రామా వోకే… కుబేరా టైటిల్ ఎంత ఆప్టో తెలుస్తుంది మనకు… 

జిమ్ సర్భ్ ఒక దురాశపరుడైన, డర్టీ రిచ్ పాత్రలో… ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, దలీప్ తహిల్, సునైనా ఫిట్టయ్యారు… విసిగించే మసాలాల వాసనలే లేకుండా… కేవలం ప్రధాన కథ,, ప్రధాన ప్రదర్శనలపై దృష్టి పెట్టాడు దర్శకుడు…  చాలా తక్కువ పాత్రలతో మొత్తం కథాంశాన్ని నడిపించడంలో శేఖర్ కమ్ములకు ఇది మరో పెద్ద విజయం…

పాటలు బయట పెద్దగా ఇంప్రెసివ్‌గా లేకపోయినా… కథలో సరైన సందర్భాల్లో ఇమిడాయి, చక్కగా అమిరాయి… గీత రచయితలు ఎవరో గానీ, కథకు తగినట్టు రాశారు, గుడ్… పాటలు అలా రాయించబడ్డాయి… బీజీఎం విషయంలో దేవిశ్రీప్రసాద్‌కు తిరుగేముంది…? ప్రతి సీన్‌  మూడ్‌ను సరిగ్గా చేసింది…

ముంబైలో అధికభాగం చిత్రీకరణ ఎందుకు అవసరమైందో పక్కన పెడితే  నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా ఆకట్టుకుంటుంది… సినిమాను కాస్త ఎడిట్ చేయగలిగితే, సినిమా నిడివి ఇంకాస్త తగ్గితే మరింత బాగుండేది… మొత్తంగా సినిమా బాగుంది…

అక్కడక్కడా స్లో అనిపించినా సరే… చూడదగిన చిత్రాన్ని అందించాడు శేఖర్ కమ్ముల… తన తత్వంలాగే నిజాయితీగా, స్ట్రెయిట్‌గా కథను చక్కగా ప్రజెంట్ చేశాడు… క్లైమాక్స్, కథ ముగింపు అంత ఇంప్రెసివ్‌గా లేకపోయినా సరే..!! (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
  • ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
  • ‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’
  • AI రోబో స్నిప్పర్… ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పర్‌ఫెక్ట్ మర్డర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions