Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ రొటీనే… ఐనా కశ్మీర్ లొకేషన్లు, కృష్ణ ట్రిపుల్ యాక్షన్‌తో హిట్టయింది…

October 16, 2024 by M S R

కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన మొదటి సినిమా 1978 లో వచ్చిన ఈ కుమారరాజా సినిమా . కుమార రాజా అంటే ఇద్దరు కృష్ణలు . ఒక కృష్ణ పేరు కుమార్ , మరో కృష్ణ పేరు రాజా . కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిన శంకర గురు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడ హీరో రాజకుమార్ స్వీయ నిర్మాణంలో వచ్చింది . అందులో మూడు పాత్రలూ ఆయనే వేసారు . జయమాల , పద్మప్రియ , కాంచనలు హీరోయిన్లుగా నటించారు .

తర్వాత కాలంలో తమిళంలో త్రిశూలం పేరుతో రీమేక్ అయింది . శివాజీ గణేశన్ నటించారు . మహాన్ అనే టైటిలుతో హిందీలోకి రీమేక్ అయింది . అమితాబ్ బచ్చన్ మూడు పాత్రలు వేసారు . వహీదా రెహమాన్ , పర్వీన్ బాబీ , జీనత్ అమన్ నటించారు . మన తెలుగులో పెద్ద కృష్ణుడికి జంటగా జయంతి , ఇద్దరు చిన్న కృష్ణులకు జంటగా జయప్రద , లతలు నటించారు .

అడవిరాముడు సినిమాను తీసిన సత్యచిత్ర వాళ్ళే ఈ సినిమాకు కూడా నిర్మాతలు . పర్వతనేని సాంబశివరావు దర్శకుడు . కృష్ణ మూడు పాత్రలను చాలా బాగా నటించారు . పెద్ద కృష్ణుడి పాత్రలో బాలెన్సుడుగా , subdued గా ఆ పాత్రకు ఎలా నటించాలో అంత చక్కగా నటించారు . ఇద్దరు చిన్న కృష్ణుల పాత్రలను కూడా ఒక పాత్రకు మరో పాత్ర భిన్నంగా , ప్రస్ఫుటంగా నటించారు .

Ads

ఈ సినిమాకు ఒక ప్రత్యేకత చాలా భాగం కాశ్మీర్లో తీసారు . లొకేషన్స్ అన్నీ అందంగా బాగుంటాయి . తర్వాత చెప్పుకోవలసింది జంధ్యాల డైలాగులు . అడవిరాముడు తర్వాత ఇది ఆయనకు రెండో సినిమా . డైలాగ్స్ బాగుంటాయి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించినా పాటలు బయట హిట్ కాలేదు . థియేటర్లో అన్నీ శ్రావ్యంగానే ఉంటాయి .

సత్యనారాయణ , జగ్గారావు , ఆర్జా జనార్ధనరావు , రాజబాబు , మోహన్ బాబు , రాజబాబు , పుష్పకుమారి , మణిమాల , అల్లు రామలింగయ్య , చలపతిరావు ప్రభృతులు నటించారు . కధ రొటీనే అయినా కృష్ణ త్రిపాత్రాభినయం , కాశ్మీర్ లొకేషన్స్ వలన హిట్టయింది .

వంద రోజులు ఆడింది . అప్పట్లో వంద రోజులు చాలా సినిమాలే ఆడాయి . ఇప్పుడు నెల ఆడితే గొప్ప , గగనం . గబగబా డబ్బులు వసూలు చేసుకోవడం , బిఛాణా ఎత్తేయటం . అప్పుడు బ్లాకులో టిక్కెట్లు మామూలు. జనం అమ్ముకొని పొట్టపోసుకునేవారు . Localised . ఇప్పుడు నిర్మాతలు , పంపిణీదారులు . Centralised . ప్రభుత్వాలతో కుమ్మక్కయి సినిమా పిచ్చోళ్ళను దోపిడీ చేస్తున్నారు . ఈ పరిణామం ఒక్క మన తెలుగు సినిమాలకేనా లేక అన్ని భాషల్లోనూ ఇలాగే చచ్చిందా !

ఈ కుమారరాజా సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!
  • అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!
  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!
  • ఉన్నమాటే అన్నాడు – నాణ్యమైన సరుకు ఉత్పత్తే లేదు కదా…
  • చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!
  • వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!
  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions