మీకు తెలిసిన ఘాటు, వెరయిటీ బూతులు ఉంటే… ముందుగానే ‘‘కుర్చీ మడతపెట్టి… దెం–’’ తరహాలో ఏదో ఓ వీడియోలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టేసుకొండి, పోనీ, యూట్యూబ్‌లోనే ఏదో ఓ పిచ్చి చానెల్ ద్వారా జనంలోకి తీసుకెళ్లండి… తలకుమాసిన చానెళ్లు బోలెడు, ఎవడైనా రికార్డు చేసి, అప్‌లోడ్ చేసేస్తాడు…
ఎందుకు అంటారా..? భలేవారే… ఇప్పుడు బూతులకు కూడా డబ్బులొస్తున్నయ్… ఆశ్చర్యపడుతున్నారా..? భలేవారండీ మీరు… మొన్నామధ్య ఒక ముసలాయన… పేరు కాలా పాషా… ఏదో ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ ‘కుర్చీ మడతపెట్టి…’ అనే ఓ బూతుకు వాడేశాడు… అది కాస్తా మస్తు పాపులర్ అయిపోయింది… దాన్ని ఎస్ఎస్‌తమన్ గుంటూరు కారం సినిమాలోని ఓ గ్రూప్ పాటకు లీడ్‌గా చేసేసుకున్నాడు…
అంతేకాదు, సదరు కుర్చీ తాత ఆ బూతు మీద తనకే పేటెంట్ రైట్స్ ఉన్నాయనే వాదన అందుకుని, ఎవడైనా ఫ్రీగా దాన్ని వాడుకుంటే వాడిని ‘కుర్చీ మడతపెట్టి…’ అని తిట్టేస్తాడో, రచ్చ చేస్తాడో అని భయపడిపోయి, తమన్ ఐదారు వేల రూపాయలు కూడా ఇచ్చాడట… (లక్ష రూపాయలు ఇచ్చినట్టు మరో సైట్ వార్త చెబుతోంది…) సో, బూతులకూ పేటెంట్ రైట్స్ ఉండును, ఎవడైనా సినిమావాడికి నచ్చితే డబ్బులు కూడా రాలును…
Ads
సరే, సరే… ఏదోలే… ఐదారు వేలకు వచ్చిందేముంది..? ముసలాయనకు ఇస్తే ఏం పోయిందిలే అంటారా..? ఎస్, అదీ నిజమే… తమన్ రేంజుకు ఐదారు వేలు అనగా ఎంత..? ఇదంతా సరే గానీ… ఇలాంటి పేటెంట్ ఇష్యూస్ మీద సందేహాలు, సర్దుబాట్లు, సముదాయింపులు, చెల్లింపుల ఇష్యూ వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎవరిది..?
ఈ పాటలో సదరు బూతు రైట్స్ ఓనర్ రెండుమూడు పంక్తులు కూడా తనే పాడాడట… రేప్పొద్దున ఇంకెవరైనా ఇలాంటి బూతు వాడకం విషయంలో మొత్తం నేనే పాడతాను అంటే ఏం చేయాలి..? తక్షణం నిర్మాతల మండలి ఓ పాలసీని తీసుకురావాలి…
ఆ పాట రాసినోడు చెల్లించాలా… నిర్మాత బాధ్యతా..? లేక సంగీత దర్శకుడి తీటా..? ఇప్పుడంటే ఐదారు వేలతో అయిపోయింది… ఏమో, రేప్పొద్దున మరింత ఘాటు బూతులకు ధర చెల్లించాల్సి వస్తే, ఈ మేధో హక్కులకు విలువ తేలకపోతే..? అప్పుడు ఎవరు ఆ ఖర్చు భరించాలి..? సో, ఎందుకైనా మంచిది..? ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ రేట్లు ఎవరు చెల్లించాలో సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, హీరో, కొరియోగ్రాఫర్ల నడుమ ఒప్పందాల్లో రాసేసుకుంటే బెటర్… లేకపోతే అదీ గొడవ పెరిగిపోయి… ఒకరికొకరు కుర్చీలు మడతపెట్టి… సో, రచ్చ రాకుండా ఉంటుంది…!!
Share this Article