Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దానవీరశూర కర్ణుడు గెలిస్తే… ‘కురుక్షేత్రం’లో అర్జునుడు ఓడిపోయాడు…

September 23, 2024 by M S R

కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా 1977 లో వచ్చిన ఈ కురుక్షేత్రం సినిమా నిజంగా కురుక్షేత్రమే . ఆనాటి తెలుగు సినిమా దిగ్గజాలు అయిన యన్టీఆర్ , అక్కినేనిలతో పోటీ పడ్డారు కృష్ణ . దాన వీర శూర కర్ణ సినిమాను ఒంటి చేత్తో లాగించారు యన్టీఆర్ . కృష్ణ అందరితో లాగించారు .

కురుక్షేత్రం సినిమా ఔట్ డోర్ షూటింగ్ రాజస్థాన్ , మైసూర్లలో జరిపారు . ఈ రెండు సినిమాలు పోటాపోటీగా తయారవుతున్నప్పుడే జనం ఉత్కంఠతో వేచిచూసారు . కురుక్షేత్రం సినిమాను పాండవ వనవాసం సినిమా తీసిన A S R ఆంజనేయులుతో కలిసి తీసారు . ఆ సినిమాకు దర్శకుడు అయిన కమలాకర కామేశ్వరరావే కురుక్షేత్రానికి కూడా దర్శకులు .

యుధ్ధం సీన్లకు K S R దాస్ దర్శకత్వం వహించారు . ఓ మహా యఙం లాగా కష్టపడ్డారు ఈ సినిమా కొరకు . కురుక్షేత్రం యుధ్ధంలో ఎలా అయితే దేశంలోని రాజులందరూ పాల్గొన్నారో , ఈ కురుక్షేత్రం సినిమాలో కూడా తెలుగు సినిమా రంగంలో ఉన్న అతిరధ మహారధులు ఆల్మోస్ట్ అందరూ నటించారు .

Ads

భీముడిగా ప్రముఖ రెజ్లర్ దారాసింగ్ కుమారుడు రణధావె నటించారు . దుర్యోధనుడిగా సత్యనారాయణ యస్వీఆర్ని గుర్తుకు తెచ్చారు . కర్ణుడిగా కృష్ణంరాజు , కృష్ణుడిగా శోభన్ బాబు , అర్జునుడిగా కృష్ణ , అభిమన్యుడిగా చంద్రమోహన్ చాలా అందంగా , కష్టపడి నటించారు . రాయబారం సీన్లో శోభన్ బాబు చాలా బాగా నటించారు . యన్టీఆర్ తో అసలు పోల్చవద్దు . పౌరాణిక పాత్రల్లో ఆయనతో పోల్చాలంటే ఒక్క యస్వీఆరే . ఇతరులను ఇండిపెండెంటుగానే ఎవాల్యుయేట్ చేయాలి . ఆ లెక్కన వీరందరూ బాగా నటించారు .

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో మోగింది కల్యాణ వీణ పాట అద్భుతంగా ఉంటుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాగా హిట్టయింది కూడా . ఈ పాటలో సెట్టింగ్ అద్భుతం . అలాగే చంద్రమోహన్ – జయప్రదల డ్యూయెట్ ఔట్ డోర్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది . శ్రీశ్రీ వ్రాసిన ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం పాటను బాలసుబ్రహ్మణ్యం బాగా పాడారు . త్రిపురనేని మహారధి సంభాషణలను వ్రాసారు . చిత్రరంగంలోని గాయనీగాయకులు అందరూ పాడారు .

తెలుగులో బాగా ఆడకపోయినా హిందీలో డబ్బింగ్ చేస్తే , అక్కడ బ్రహ్మాండంగా ఆడింది . థియేటర్లలోనే ఈ సినిమాను మూడు సార్లు చూసా . టివిలో ఎప్పుడు వచ్చినా టైంను బట్టి చూస్తూ ఉంటా . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది .

ఈ తరంలో చూడని వారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . సాంకేతికంగా , నిర్మాణపరంగా కృష్ణ మార్కు గొప్ప సినిమా . ప్రతీ సినిమాను కమర్షియల్ గా , ఆడిన రోజులతో ఎవాల్యుయేట్ చేయలేం . అలా ఈ సినిమా ఓ క్లాసిక్ . సాహసవీరుడు కృష్ణని అభినందించవలసిందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు        (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)


కృష్ణ, శోభన్‌బాబు బాగానే నటించినా… మనకు కృష్ణుడు, అర్జునుడు అనగానే ఎన్టీయారే గుర్తొస్తాడు… రెండు సినిమాలూ ఒకేసారి రావడంతో పోలిక అనివార్యంగా వచ్చింది… ఎన్టీయార్‌తో పోల్చి అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడిగా శోభన్‌బాబు నప్పలేదనే అభిప్రాయాలు వచ్చాయి… అదే ఈ సినిమాకు మైనస్ అయ్యిందనేది అప్పట్లో రివ్యూయర్ల అంచనా…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!
  • డ్యూడ్… ఎవడ్రా నీకు సర్టిఫికెట్ ఇచ్చేది… ఖచ్చితంగా హీరో మెటీరియలే..!!
  • Dirty Tollywood… మీ పీకుడు సంస్కార భాష ఏమిట్రా కుయ్యా..!!
  • తెలుసు కదా… అందరికీ నచ్చకపోవచ్చు… సినిమా జస్ట్ వోకే…
  • బంద్‌కు అందరూ సై… కానీ బీఆర్ఎస్ మద్దతులో నిజాయితీ ఎంత..?
  • రెనిగేడ్, చెద… ముద్రలు సరే గానీ..! లోతైన పోరాటసమీక్ష అవసరం లేదా..?!
  • ఆర్కేతో ఓరోజు… తుపాకుల లొంగుబాట నేపథ్యంలో ఓ జ్ఞాపకం…
  • తళుకుబెళుకుల రంగుల ప్రపంచం వదిలేసి… బౌద్ధ సన్యాసినిగా…
  • ఫక్తు బాలకృష్ణ మార్క్ కమర్షియల్, రొటీన్, ఫార్ములా సినిమా..!
  • పీకేకు తత్వం బోధపడింది… ప్రజాక్షేత్రం అంటే తెర వెనుక జిత్తులు కాదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions