Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథలు వండే విధము తెలియండి జనులారా మీరూ… కేవీరెడ్డి రూటే వేరు…

September 4, 2024 by M S R

కథలు వండే విధము తెలియండి జనులరా మీరూ
కథలు వండి మోక్షమందండి…..
……………………

ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే …
ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా …
ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది….
ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు.
నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే …
పర్లేదండీ ట్రావెల్ అవుతాను …
ఇంటి బాదరబందీ నా మీద లేదు అన్జెప్పాకే ఆయన్ని తీసుకున్నారు.
పింగళి బ్రహ్మచారి … కనుక ఆయనతో కె.వికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు.

అలా ఓ పాయింట్ అనుకుని దాని మీద రచయితతో కూర్చుని ఓ నాలుగు నెల్ల పాటు కథ వండేవారు.
కథ ఓ షేపుకొచ్చేసిన తర్వాత …
స్టూడియోలోనో, తన ఇంట్లోనో పన్జేసే ఎవరినైనాను …
తన ఇంటి ముందు ఉండే టాక్సీ స్టాండ్ లోని డ్రైవర్ నెవరినైనానో … తో మొదలెట్టి మహిళలు పిల్లలతో సహా సమాజంలోని అన్ని తరగతుల నుంచీ…
ఒక్కో ప్రతినిధి ఉండేలా ఓ టీమ్ని తన ఇంటికి పిల్చి కూర్చోబెట్టి….
తాను తీయాలనుకుంటున్న సినిమా కథను వాళ్లకి పూసగుచ్చినట్టు చెప్పేవారట …
చెప్పేసి పంపేసి…

Ads

ఓ పదిహేను రోజులు గ్యాపిచ్చి రోజుకొక్కళ్లని పిల్చి నేనారోజు చెప్పానే కథ దాన్ని ఓ సారి నాకు చెప్పు అనేవారట …
ఆ చెప్పేవారు తను చెప్పిన కథలో ఏ అంశాలను విస్మరించారు.
ఏఏ అంశాల పట్ల తనను మించిన ఉత్సాహంతో మాట్లాడారు …
ఇలాంటి పాయింట్లు అన్నీ రాసుకునేవారట …
అలా మొత్తం అంత మందితోనూ తిరిగి కథ ఒప్పచెప్పించుకున్న తర్వాత మళ్లీ రైటర్ ను పిల్చి కూర్చుని ఈ మేరకు రిపేర్లు చేసి …
ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసేవారట …
ఇలా కథ అనే ప్రక్రియ పూర్తయ్యాక డైలాగులు కుట్టించేవారు.

ఆ డైలాగులు కుట్టేప్పుడు కూడా ఏ రోజు రాసిన డైలాగులు ఆ రోజే రివ్యూ చేసేసేవారట.
డైలాగులు రాసేప్పుడు నటుడి కెపాసిటీని దృష్టిలో ఉంచుకుని వాడెక్కడ బలంగా ఉంటాడు …
ఎక్కడ వీక్ గా ఉంటాడు అనేవి తెల్సుకుని మాటలు వేయమని చెప్పి ఆ మేరకు మార్పులు చేయించేవారట.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక …
అప్పుడు ఆయన దృష్టిలో మేధావులు అనే బ్యాచొకటి ఉండేది …
ఆ బ్యాచ్ లో పట్టాభి కూడా ఉండేవారు.

ఇలా సినిమా బైట తన పరిచయస్తులు మిత్రులతో కూర్చుని ఇంకోసారి ఈ కథను డిస్కస్ చేసి ఫైనల్ టచప్ ఇచ్చి …
దాన్ని దగ్గర పెట్టుకుని కెమేరామెన్ , కళా దర్శకుడు లాంటి టెక్నికల్ టీమ్ తో కూర్చుని డిస్కషన్స్ పెట్టేవారట…
కథలో మార్పులు సూచించమని వారినీ కోరేవారట …
వస్తే వాటిని కూడా కలుపుకుని …
అప్పుడు కాస్టింగ్ …
బడ్జట్ వేసేవారట.
ఆయన సినిమాకు ఎన్ని కాన్ల ఫిలిం పడుతుందని రాస్తే …
అంత పిలిమే వాడేవారట … అడుగు ఎక్కువ కాదు తక్కువా కాదు అన్నట్టు …
అసలు స్క్రిప్టులోనే ఆ సీను ఎన్ని నిమిషాల ఎన్ని సెకన్లు ఉండాలో కూడా రాసేసేవారట.

ఇంత కసరత్తు చేయడం వల్లే అంత కాలం ఇండస్ట్రీలో ఉండీ పద్నాలుగు సినిమాలే తీయగలిగారు.
అదే మా దాసరి చూడండి నూటాభై తీసవతల పడేశారు …
డైరక్టరంటే అట్టా ఉండాలె …
నేను చెప్పింది చాలా తక్కువ సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆయన చేసే కసరత్తు చాలా ఉండేదట… ప్రతి పాత్రకి స్కెచెస్ వేయించి వాటిని మార్చి … పాటలు సంగీతం దగ్గర నుంచీ ఇలానే బోల్డు టైమ్ తీసుకుని సెట్స్ మీదకు వచ్చేవాడు …
చాదస్తం అని తిట్టుకున్నా … ( రంగావఝుల భరధ్వాజ )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions