జబర్దస్త్, ఈటీవీ ఇతర రియాలిటీ షోలలో ఆమధ్య బాగా పాపులర్ పాత్ర… బిల్డప్ బాబాయ్… గెటప్ శ్రీను వేసేవాడు ఆ రోల్… హిలేరియస్ కామెడీ బిట్స్ అవన్నీ… ఓచోట అంటుంటాడు తను… ఆవునో, బర్రెనో చూపిస్తుంటాడు.., పితికితే పెరుగు వచ్చేయాలి అంతే అంటుంటాడు… వెన్న, కోవా, నెయ్యి అన్నీ… హహహ…
ఎందుకో ఈ లడ్డూ నెయ్యి కొవ్వు నూనెల కల్తీ వివాదంలో వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాం మాటలు అంతకుమించి అనిపించాయి… తన మాటలు, తన చేతలు, తన హృదయం అంతుపట్టనిది కదా… లడ్డూ నెయ్యి మీద చిత్రాతివిచిత్ర వ్యాఖ్యల్ని వెలువరించారు స్వామి వారు… (ఎందుకోగానీ యెల్లో మీడియా కూడా ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకుని రాద్ధాంతం చేయలేదు…)
‘‘పౌష్టికాహారం లేని ఆవులు ఇచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అలాగే ఉంటుంది… ఊళ్లల్లో ఏదేదో తినేస్తుంటాయి, అలాంటి పాలే ఇస్తాయి… ఆవాలు, అవిసెలు గట్రా…’’ అని ఏదో చెబుతున్నాడు… తనేం చెప్పబోయాడో తనకైనా తెలుసో లేదో… తన భావం మనకు అర్థమైనకాడికి ఏందంటే…? ఊళ్లల్లో ఆవులు ఏదేదో చెత్తా తినేస్తాయి, మరి ఆ పాల నుంచి తీసే నెయ్యి ఇలాగే ఉంటుంది కదాని…
Ads
ఫాఫం… లడ్డూల నెయ్యిలో జంతుకొవ్వులు పరీక్షల్లో కనిపిస్తున్నాయీ అంటే అదే కారణమట… అంటే పాలు కల్తీ కాదు, ఆవులే కల్తీ అన్నమాట… ఆహా… జగన్… ఎలాంటి లీడర్లను నమ్ముకున్నావు స్వామీ… ఒక గోరంట్ల, ఒక రోజా, ఒక అంబటి… ఏక్‌సేఏక్… అసలు లడ్డూ వివాదం చెలరేగాక ఒక్కరంటే ఒక్క పెద్ద నాయకుడూ నోరిప్పడం లేదు… మాట్లాడేవారేమో ఇదుగో సీతారాముడి టైపు…
తిరుపతి మీద ఆధిపత్యం చెలాయించే ఆ చెవిరెడ్డి జాడే లేదు… భూమన పుష్కరిణి స్నానం, ప్రమాణం అంటూ ఏదోచేయబోయి అపహాస్యం పాలయ్యాడు… సుబ్బారెడ్డి ఏదో చెప్పబోయాడు… చివరకు ఇలా కాదు, బాగా హిందూ ద్వేషి ముద్ర పడుతోంది అనుకుని ఇక జగనే బయల్దేరాడు… ఏకంగా తిరుమలకు… బీజేపీ, జనసేన, టీడీపీ తన యాత్రను అంత సజావుగా సాగనిస్తాయని అనుకోను… కానీ జగన్‌కు తప్పదు…
ఏమాటకామాట… సాక్షి గరిష్ఠ స్థాయిలో జగన్‌ను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తోంది… సిన్సియర్‌గా ఈ వివాదంలో తన వెంట బలంగా నిలబడింది సాక్షి ఏపీ ఎడిషన్ మాత్రమే… అదొక్కటీ వదిలేస్తే హఠాత్తుగా జగన్ ఒంటరివాడైనట్టు కనిపిస్తోంది… జగన్ ఉద్దేశపూర్వకంగా తిరుమల వ్యవహారాల్లో తప్పు చేశాడని ఎవరూ అనలేరు, కానీ అధర్మారెడ్డి, భూమన, వైవీ వంటి వాళ్లను నమ్మి భంగపడ్డాడు… అలా చాలామంది విషయంలో కూడా గుడ్డిగా నమ్మితే, చాలామంది ఇప్పుడు జగన్ కాల్స్‌కు కూడా దొరకడం లేదు, పత్తా లేరు…
తనతో బాగా ప్రయోజనాలు పొందిన ఆ వైజాగ్ దివ్యస్వరూప స్వామి కూడా కనిపించడం లేదు… ఫుల్లు డిఫెన్సులో పడిపోయి, తెర వెనుకకు వెళ్లిపోయాడు… డియర్ జగన్ సార్, ఎవరెవరిని వదలుకున్నావో, ఎవరిని చేరదీశావో అర్థమవుతోందా..? తిరుమలకు వెళ్లి ప్రార్థించాల్సింది లడ్డూ బదనాం నుంచి విముక్తే కాదు… ఇలాంటి నష్టదాయక కేరక్టర్ల నుంచి విముక్తిని కూడా..!!
Share this Article