కొన్ని సోషల్ పోస్టులు,.. చాలా సీనియర్ జర్నలిస్టుల నుంచే… ‘ఆయ్ఁ పురంధేశ్వరి ఏమిటిలా కామెంటింది అని..?’ ఏమిటయ్యా అంటే… సుప్రీంకోర్టు చంద్రబాబుకు లడ్డూ కేసులో తన వ్యాఖ్యలతో తలంటింది కదా… ఈమె ‘అన్ ఫెయిర్’ అని కామెంటిందట…
సో, అది సుప్రీం ధిక్కారమే, ఇక సుప్రీం ఏం చేస్తుందో చూడాలి… వాటీజ్ దిస్ నాన్సెన్స్, అపెక్స్ కోర్టు పట్ల ఇంత ధిక్కారమా అంటూ ఏదేదో రాసుకొచ్చారు కొందరు… చంద్రబాబుతో బంధుత్వమే కారణమా అన్నట్టుగా అభిప్రాయాలు… బట్, సో వాట్..?
ఎస్… సో వాట్..? ఆమె ఏ జడ్జికి మోటివ్స్ అంటగట్టడం లేదు… ఆ వ్యాఖ్యల పట్ల ఆమె తన అభిప్రాయాల్ని వెలువరించింది… ఆమె మాజీ కేంద్ర మంత్రి… చదువుకున్నది… విజ్ఞత కలది… మూర్ఖంగా, ఎవడో అల్లాటప్పా గాడిలాగా వ్యాఖ్యానించలేదు… చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి లడ్డూ నెయ్యి కల్తీని చెప్పడం మీద సుప్రీంకోర్టు నెగెటివ్ వ్యాఖ్యల్ని అన్‌ఫెయిర్ అనేసింది…
Ads
సుప్రీంకోర్టు విచారణలో భాగంగా జడ్జిలు చేసిన వ్యాఖ్యలు మాత్రమే అవి… ‘ఓ సీఎం హోదాలో ఉన్నవ్, కోట్లాది మంది భక్తుల మనోభావాలు పట్టవా..? అసలు దేవుడిని రాజకీయాల్లోకి లాగడం దేనికి..?’ ఇలా… తప్పులేదు, సగటు హిందువు అనుకుంటున్నదే… పర్‌ఫెక్ట్ ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా వ్యాఖ్యలు చేయవచ్చా అనేది…
ఐనంతమాత్రాన పురంధేశ్వరిని బజారుకు ఈడ్వాల్సిన అవసరం ఏముంది..? ఆమె చాలా ఏళ్లుగా చంద్రబాబు వ్యతిరేక శిబిరంలోనే ఉంది… ఇప్పుడు చంద్రబాబు కోసమో, మరే అవసరం కోసమో… దిక్కులేక, వేరే గతిలేక, మనసు చంపుకుని చంద్రబాబు పార్టీతో పొత్తులో ఉంది… అంతే తప్ప బావ మీద ప్రేమ కాదు, రాజకీయాల్లో దానికీ స్కోప్ కూడా లేదు.,.
అవును, నిజంగానే జగన్ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారాలన్నీ విచారణకు రావాలని జనం కోరుకుంటున్నారు… ఎందుకంటే..? భూమన, వైవీ, ధర్మారెడ్డి తదితరులు సంపాదించుకున్న దరిద్రపు పేరు అది… అన్యమతస్తులతో తిరుమలను నింపేసి… పైగా జగన్ చేత ‘మానవత్వమే నా మతం, డిక్లరేషన్ రాసుకొండి’ వంటి శుష్క సమర్థనలు చేయిస్తున్న కాలమిది…
అందుకే పురంధేశ్వరి మాటల్లో తప్పేముంది..? అన్‌ఫెయిర్ అనే వ్యాఖ్యల్లో అన్‌ఫెయిర్ ఏముంది..? ఎస్, విచారణలో భాగంగా జడ్జిలు చాలా వ్యాఖ్యలు చేస్తారు… అవి అంతిమ తీర్పులో రిఫ్లెక్ట్ కావాలనేమీ లేదు… కావద్దని కూడా ఏమీ లేదు… పైగా ఆమె తీర్పు మీద కూడా వ్యాఖ్యానించలేదు… అందుకని ఆమె వ్యతిరేకులు చొక్కాలు చింపుకునే పనేమీ లేదిక్కడ…
నో, నో… సుప్రీం సీరియస్… చంద్రబాబు నాన్సెన్స్, పురంధేశ్వరి సపోర్ట్ మరీ నాన్సెన్స్ ఉంటారా..? వెయిట్… సుప్రీంకోర్టు అభిప్రాయాలు అంతిమం కాదు… ఈ దేశానికి సుప్రీం పార్లమెంటు… సోకాల్డ్, మోడీకి అంత సీన్ లేదు గానీ… ఇప్పుడు యోగి వంటి నేత ప్రధానిగా ఉంటే కథ వేరేగా ఉండేది..! కోట్లాది మంది భక్తులతో *కొవ్వు నెయ్యి*తో ఆడుకున్న ది గ్రేట్ వీర సెక్యులర్ నేతలకు శిక్షలు వేరేగా ఉండేవి..!!
Share this Article