అక్షరాలా నిజం… కేంద్రం రంగంలోకి దిగింది లడ్డూ వ్యవహారంపై… కల్తీకి పాల్పడిన చెన్నై డెయిరీ కంపెనీ లైసెన్సే కేన్సిల్ చేసే పనిలో పడింది… నిజమే, కానీ చివరకు సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపించినా… సీబీఐకి ఇచ్చినా… ఇంటర్‌పోల్‌కు అప్పగించినా… చివరకు ఆ ఇజ్రాయిల్ మొసాద్‌ను రంగంలోకి దింపినా… అసలు తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు నూనె కల్తీ జరిగిందో లేదో మాత్రం తేల్చలేరు…
ఎందుకంటే..? సదరు టీటీడీ ఈవో శ్యామలరావు రూపొందించిన అధికారిక నివేదిక ప్రకారం… (కాస్త సరళమైన భాషలో చెప్పుకుందాం…) రివర్స్ టెండరింగ్ అనే ఓ దిక్కుమాలిన పద్ధతిలో తిరుమల నెయ్యి సప్లయ్ కంట్రాక్టులకూ ‘రివర్స్ టెండర్’ పెట్టారు… రివర్స్ టెండర్లు అంటేనే కమీషన్ల యావ యవ్వారం, పాత కంట్రాక్టుల రద్దు కదా…
చెన్నై, ఏఆర్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు… కర్నాటక సహకార డెయిరీ నందిని మాయమైపోయింది… జగన్ హయాంలో ఆ కంట్రాక్టు వచ్చిన సదరు ఏఆర్ కంపెనీ సప్లయ్‌కు వచ్చేసరికి చంద్రబాబు వచ్చాడు… సరే, నాలుగు ట్యాంకర్లు పంపించాడు… ఈవోెకు డౌటొచ్చింది… అసలు రంగురుచీవాసనచిక్కదనం ఏమీ లేవు ఈ నెయ్యికి, పైగా ఇంత తక్కువ ధరకు ఎలా సాధ్యం అనుకుని ఎన్‌డీడీబీ ల్యాబుకు పంపించాడు శాంపిళ్లు… కల్తీ అనుమానాలతో…
Ads
NABL గుర్తింపు పొందిన ల్యాబులతో కల్తీ పరీక్షలు జరిపించుకోవాలనే టెండర్ నిబంధనలున్నా సరే, ఇప్పటివరకూ ఆ పరీక్షలకు శాంపిళ్లు పంపింలేదు ఎప్పుడూ… ఏదో తూతూమంత్రంగా ఉండే తమ సొంత ల్యాబుల్లో కొన్ని పారామీటర్స్ మాత్రమే చెక్ చేసి, నాసిరకం అనిపిస్తే వాపస్ పంపించేవాళ్లు… అంతే తప్ప కల్తీ పరీక్షల జోలికి పోలేదు టీటీడీ…
పోనీ, జగన్ చెప్పినట్టుగా తిరుమలలో మూడు దశల అత్యద్భుత పరీక్షశాలలున్నాయా అంటే అదీ లేదు… కేవలం కొన్ని పారామీటర్స్ మాత్రమే పరీక్షించగల సాదాసీదా ప్రయోగశాల… వాటిల్లో ఇదుగో ఈ పరీక్షలు మాత్రమే చేయగలరు… ఈ పరీక్షల్లోనూ నాణ్యత తేలని 14 ట్యాంకర్లను వాపస్ పంపించిన మాట నిజమే… (కానీ వాపస్ చేసిన ట్యాంకర్ల నెయ్యిని కూడా తిరిగి టీటీడీకే అంటగట్టారని తిరుమల మీడియా సర్కిళ్ల సమాచారం)…
5. The Cow Ghee received through tankers was tested with basic parameters
like Moisture, Butyro refracto meter reading, Free fatty acid, RM Value, Baudouin
Test, Test for Mineral Oil, Added Colour, Melting Point and Test for Rancidity,
l\,lilk Fat, Polenske Value, lodine Value, Saponification value and sensor
parameters (not as per standards) lf there is any variation in specified
parameters, the tankers are being rejected. The remaining mentioned tests in
the tender document are not being carried due to lack of requisite equipment in
TTD Lab
మరి ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక హిందూ దేవుడికి… ఆఫ్టరాల్ 75 లక్షల విలువ చేసే అత్యాధునిక (కల్తీని కనిపెట్టేందుకు…) ప్రయోగశాల ఏర్పాటు ఎందుకు చేతకాలేదు..? ఇదొక మిస్టరీ… మొదటిసారి కేంద్ర ప్రయోగశాలకు కల్తీ నిగ్గు తేల్చేందుకు శాంపిళ్లు పంపించారు… నిజంగానే జంతుకొవ్వుల అవశేషాలు బయటపడ్డాయి…
అవి వాపస్ పంపించేశారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు… ఈ ప్రాసెస్‌లో శ్యామలరావు చంద్రబాబుకు ఈ సమాచారం ఇచ్చాడు… పార్టీ మీటింగులో జగన్ మీద ఎప్పటిలాగే ఏదేదో మాట్లాడుతూ ఫ్లోలో ‘చివరకు అత్యంత పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కూడా కలిపే పరిస్థితికొచ్చారు’ అనేశాడు… అది కాస్తా ఇదుగో ఇంత రచ్చకు కారణమైంది…
కేవలం తిరుమలకు జగన్ అపచారాలు అనే అంశం మీద ప్రెస్‌మీట్ పెట్టాలనే ఉద్దేశం ఉన్నట్టయితే… ముందుగానే ఈ రిపోర్టులన్నీ పట్టుకొచ్చి విడిగా వివరాలు చెప్పేవాడేమో… సరే, ఇదంతా జరిగిపోయింది… ఇప్పుడక్కడ కల్తీ నెయ్యి లేదు, కొత్తగా 20,00,000 కిలోల నెయ్యికి టెండర్లు పిలిచారు… అంతకుముందు కొన్ని ట్యాంకర్లు వాపస్ వెళ్లాయి…
ఐతే ఇప్పటిదాకా వచ్చిన నెయ్యి (అంటే వాడబడిన నెయ్యి)లో జంతువుల కొవ్వు నూనె అవశేషాలు ఉన్నాయా..? ఇదెవరూ తేల్చలేరు… ఎందుకంటే..? ఒకవేళ వాడినా సరే ఆ లడ్డూలన్నీ అయిపోయాయి కదా… సో, ఆ లడ్డూలు లేవు, ఆ నెయ్యీ లేదు… అంతా మాయ, అంతా మాయం… ఎంత అత్యున్నత స్థాయి విచారణ జరిపించినా సరే… గతంగతః ఏం తవ్వినా ఏమీ తేలదు… ఒకవేళ గతంలో నెయ్యి సప్లయ్ చేసిన వాళ్లను తీసుకొచ్చి… ‘పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్’ ఇస్తే తప్ప తేలదు… హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు అప్పగిస్తే ఏమైనా ఫాయిదా ఉండొచ్చునేమో…
అవును, నీ హయాంలోనే కదా ఆ కల్తీ నెయ్యి వచ్చింది, వాపస్ పంపించేశావు, ఇక అపచారం ఏముంది అనడానికి జగన్‌కు చాన్స్… నో, నో, కమీషన్ల కోసం రివర్స్ టెండర్లు పెట్టి ఆ దిక్కుమాలిన అడ్డమైన కంపెనీకి టెండర్లు ఇచ్చావు అనడానికి చంద్రబాబుకూ చాన్స్… కానీ కల్తీ నెయ్యి వాడకం జరిగిపోయిందని చంద్రబాబు రుజువులతో చెప్పలేడు… జరగలేదని జగనూ సాధికారికంగా చెప్పలేడు… ఇదీ అసలు సిట్యుయేషన్…
మొత్తం నివేదికలో ఇంట్రస్టింగుగా అనిపించిన చివరి వాక్యం… ఎన్డీడీబీ ఆ 75 లక్షల మేరకు పరీక్షా సామగ్రిని ఉచితంగా అందజేస్తానని ముందుకొచ్చింది… థూ, ఇంత ఆదాయం ఉండి, చివరకు ఈ ల్యాబ్ పెట్టుకోలేకపోయారా? మేమిస్తాం, కల్తీ పరీక్షలు చేస్తూ, కాస్త భక్తులకు మంచి లడ్డూలు ఇవ్వండి అని పరోక్షంగా చెబుతున్నట్టుగా…!!
Share this Article