పెళ్లి పెటాకులు, కేసులు, కౌన్సెలింగులు, విడాకుల నుంచి భరణాల దాకా బోలెడు వార్తలు వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం కదా… సాధారణంగా కోర్టులు మహిళల పట్ల సానుభూతిగా ఉంటాయి… ప్రత్యేకించి మహిళా జడ్జిలు ఇంకాస్త మద్దతుగా ఉంటారనే ఓ అభిప్రాయం ఉంది కదా జనంలో…
కానీ నిజం కాదు, మహిళలు అడిగే అసమంజస కోరికల మీద సానుభూతి చూపించడం కాదు, అవసరమైతే కాస్త పరుషంగా మందలించి తిరస్కరించే న్యాయమూర్తులూ ఉంటారు… ఈ కేసు అదే… ఈ కేసు విచారణకు సంబంధించిన వీడియో, జడ్జి కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు… ఈ జూమ్ వీడియో విచారణకు ఇప్పటికే 20 లక్షల వ్యూస్ ఉన్నాయి ఎక్స్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో… కామెంట్లు కూడా ఇంట్రస్టింగ్… మెజారిటీ జడ్జిని మెచ్చుకునేవే…
విడాకులు పొందిన ఓ మహిళ తన లాయర్ భర్త నుంచి నెలకు ఏకంగా 6,16,300 భరణం చెల్లింపునకు క్లెయిమ్ చేసింది… దీన్ని విన్న జడ్జి సానుకూలంగా తీర్పు చెప్పడానికి నిరాకరించింది… అసలు ఇంత మొత్తం ఓ ఒంటరి మహిళ ఏం చేసుకుంటుంది..? ఎలా ఖర్చు చేస్తుంది..? అలాంటి జీవితం కావాలనుకుంటే నువ్వే సంపాదించుకో, మొత్తం నీ మాజీ భర్త భరణంగా చెల్లించాలంటే ఎలా అని ప్రశ్నించింది…
Ads
‘నెలవారీ ఆహారానికి 60 వేలు… అప్పుడప్పుడూ బయట ఫుడ్ కోసం మరికొన్ని వేలు… చెప్పులు, గాజులు, గడియారాలు గట్రా ప్రాథమిక అవసరాల కోసం 50 వేలు… నా మోకాలి నొప్పులకు ఫిజియోథెరపీ కోసం నెలకు 4 నుంచి 5 లక్షలు ఖర్చులుంటాయి… నా భర్తేమో ఒక్కొక్కటీ 10 వేల రూపాయల ధర ఉండే బ్రాండెడ్ షర్టులు ధరిస్తాడు, నేనేమో ఓ మామూలు మహిళగా బతకాలా…’ అనడిగింది ఆ మాజీ భార్య…
జస్ట్, అడుగుతున్న భరణంలో పది శాతమే తిండి కోసం… మిగతాదంతా అదనం… పైగా పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులు ఆల్రెడీ ఆ మాజీ భర్తే భరిస్తున్నాడట కూడా…! ‘‘ఫిజియో థెరపిస్టు రోజూ ఇంటికి వచ్చి రోజుకు 1500 నుంచి 3000 ఛార్జి చేసినా లక్ష రూపాయల లోపే కదా, మరి ఈ 4, 5 లక్షల క్లెయిమ్ ఏమిటి’ అని ప్రశ్నించింది ఒకామె… ‘బహుశా ఆ జడ్జి ఓ కొడుక్కి తల్లి అయి ఉంటుంది’ అని సరదాగా మరో నెటిజెన్ వ్యాఖ్య… ‘ఈమెకు నిజంగా ఓ చీఫ్ జస్టిస్ అయ్యే అర్హత ఉంది’ అంటూ మరో నెటిజెన్ ప్రశంస…
‘ఆమె డిమాండ్ పూర్తిగా అసమంజసం… భరణం అనేది భర్తకు శిక్ష కాదు… మీ క్లయింటుకు సావధానంగా చెప్పండి’ అని మాజీ భార్య తరఫు న్యాయవాదికి జడ్జి సూచించింది… ఈ వీడియో కింద కామెంట్లలో దొరికింది చాన్స్ అనుకుని… ‘మేం 498ఏ సెక్షన్ దుర్వినియోగం మీద ఓ డాక్యుమెంటరీ తీశాం, పేరు martyrs of Marriage… అందరూ చూడండి’ అంటూ మరొకరు ప్రమోషన్ వర్క్… అది వరకట్న వేధింపులకు సంబంధించి…! మొత్తానికి సదరు న్యాయమూర్తి స్పందన నెట్‌ను దద్దరిల్లజేసింది..!!
Share this Article