Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లేడీ ఆర్టిస్ట్ అనగానే, పేలవంగా స్కిట్లు చేసే పర్‌ఫార్మర్ అనుకుంటిరా….. ఫైమా…!!

February 28, 2023 by M S R

ఇది వార్త అవుననుకుంటే వార్తే… కాదనుకుంటే కాదు… ఈమె పేరు ఫైమా… తెలుగు జనానికి బాగా పరిచయమైన పేరే… బక్కగా, నల్లగా, పొట్టిగా, ముందువైపు కాస్త ఊడిపోయిన జుట్టు, పళ్ల మధ్య సందు… బిలో యావరేజ్… ఇది సగటు మగాడు చూసే చూపు, వేసే అంచనా… కానీ ఆమెలో మెరిట్ సూపర్… అవ్వ, అయ్య, మగపిల్లల్లేరు, అక్కాచెల్లెళ్లే.. రేకుల ఇల్లు… దుర్భరంగానే లైఫు… అవేమీ ఆమెను ఫ్రస్ట్రేషన్‌లోకి పంపించలేదు…

తనలో కామెడీ టైమింగ్ ఉందనీ తనకు అంతగా తెలియదు… నాలుగు డబ్బులొస్తాయి కదా అనుకుని ఈటీవీ పటాస్ షోలో చేసేది… టీవీ ప్రోగ్రాముల కథాకమామిషు అర్థమైంది… పటాస్ నుంచి జబర్దస్త్‌ షోకు ప్రమోటైంది… మరీ డల్ గాళ్లు తప్ప ఓ మోస్తరు మెరిట్ ఉన్నా సరే జబర్దస్త్ సదరు పర్‌ఫామర్‌ను ఎంకరేజ్ చేస్తుంది… తెలుగు జనంలో రీచ్ బాగా ఎక్కువ… అందుకే జబర్దస్త్ ఎంత బూతు ప్రోగ్రామ్ అయినా సరే, దానిలో నటించే వాళ్లకు మంచి బూస్టప్ అది…

హైపర్ ఆది వంటి పాత సీనియర్ కేరక్టర్లు ఆమెను బాడీషేమింగుకు గురిచేసినా… ఆమె నిలబడింది… జబర్దస్త్ విడిచిపెట్టి పలువురు కమెడియన్లు వెళ్లిపోవడం, లేడీ గెటప్పులు తప్ప రియల్ లేడీ ఆర్టిస్టులు పెద్దగా క్లిక్ కాకపోవడం కూడా ఫైమాకు కలిసొచ్చింది… పైగా ఆమె ఎనర్జీ, టైమింగు ఆమెను నిలబెట్టాయి… ఆమె స్కిట్‌లో ఉంటే సీనియర్ ఆర్టిస్టులు కూడా పలుసార్లు డైలాగులు మరిచిపోయి, ఆమె ముందు వెలవెలాబోయేవారు… కానీ ఆమె పెట్టుకున్న లక్ష్యానికి ఆ సంపాదన సరిపోదు…

Ads

faima

ఆ రేకుల ఇల్లు బదులు ఓ మంచి పక్కా ఇల్లు పేరెంట్స్‌కు కొనివ్వాలి… ఓ కారు కొనివ్వాలి… వాళ్ల కళ్లల్లో ఆనందం చూడాలి… ప్రవీణ్‌తో ప్రణయం… ఈలోపు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది… జబర్దస్త్ విడిచిపెట్టి హౌజులోకి వెళ్లింది… దాదాపు చివరిదాకా కొనసాగింది… డబ్బులొచ్చాయి… ఫైనల్లో గెలుస్తాననే అత్యాశ ఆమెకు ఏమీ లేదు… బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మాటీవీ పలు అవకాశాలను కల్పిస్తుంది… ఆ దిశలోనే బిగ్ బాస్ జోడీ అనే ఓ వెరైటీ డాన్స్ షో చేస్తావా అనడిగారు…

ఏమీ ఆలోచించకుండా సై అనేసింది… బీబీ జోడీలో ఆర్జేతో ఆమె జంట… మస్తు ప్రాక్టీసు చేసి, తమ డాన్సులతో అదరగొడుతున్నారు.. అంటే ఓవరాల్‌గా ఆమె గుడ్ పర్‌ఫార్మర్… ఇల్లు కొనేసింది… ఇంటీరియర్ చేయిస్తోంది… అమ్మ కోసం కారు కూడా కొంటోంది… ఆ ఆనందంలో వీడియో చేసి వదిలింది… బాగుంది… ఆ వీడియో దిగువన చూడండి… కాస్త లెంతీ… కానీ సోకాల్డ్ హోమ్ టూర్లకన్నా చాలా బెటర్… అందులో ‘‘నీ కోసం డబ్బు దాచుకోమ్మా, మాకోసం ఈ ఖర్చులెందుకు’’ అని ప్రేమగా మందలిస్తున్న తల్లి హృదయం ఉంది… పోనీలేమ్మా, మీకోసం ఈమాత్రం చేయలేనా..? అని అమ్మ దగ్గర గారాలు పోతున్న ఫైమా ఉంది…. ఆల్ ది బెస్ట్ ఫైమా… ఇదే ఎనర్జీతో దుమ్ము రేపు…  బహుశా మళ్లీ జబర్దస్త్‌కు వెళ్తుందో లేదో తెలియదు, మాటీవీ వాళ్లు ఏదైనా కామెడీ షో స్టార్ట్ చేస్తే ఫస్ట్ సెలక్టయ్యేది తనే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions