ఫేక్ పేర్లతో… దొంగ మాటలతో బోలెడు పెళ్లిళ్లు చేసుకున్న మోసగాడు… కట్నం తీసుకుని, పరారైపోయి, మళ్లీ ఇంకోచోట ప్రత్యక్షం… ఇలాంటి వార్తలు చాలా చదివాం… అసలు ఏమీ తెలుసుకోకుండా, వరుడి కుటుంబం వివరాలు కనుక్కోకుండా ఎలా పిల్లనిస్తారు అనే ఆశ్చర్యం కలిగేది… కానీ ఇది పూర్తి భిన్నమైన కథ…
జమ్ముకాశ్మీర్‌లోని ఓ యువతి ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుంది… అందరినీ మోసగించింది… ఇప్పుడు 28వ పెళ్లి కోసం ఎవరిని బకరా చేసే ప్రయత్నంలో ఉందో తెలియదు… దిక్కుమాలిన ఈటీవీ భాషలో చెప్పాలంటే జమ్ముకాశ్మీర్ యువకులు అంత కరువులో ఉన్నారా..?
ఈ కథలో మరో విశేషమూ ఉంది… ఆ 27 మంది బాధితుల్లో 12 మందికి ఒకేసారి తాము మోసపోయినట్టు బల్బ్ వెలిగిందట… వేర్వేరు ప్రాంతాల్లో ఈమేరకు పోలీసులకు ఫిర్యాదులు అందాయి… అందరి ఫిర్యాదు ఒకటే… నా భార్య కనిపించడం లేదు… అందరూ ఫోటో ఇస్తారు కదా… సేమ్, అన్ని ఫోటోల్లోనూ ఆమే… ఫోటోలు కూడా వేర్వేరు కాదు… సేమ్ ఫోటో…
Ads
ప్రతిచోటా ఆమె తనే స్వయంగా పెళ్లి ప్రయత్నాలు చేయలేదు… మధ్యవర్తులు అనగా పెళ్లిళ్ల బ్రోకర్లే సాయం చేశారు… అలాగని ఏకకాలంలో మల్టిపుల్ హజ్బెండ్స్ అనే అనైతికతను కూడా కనబర్చలేదు… ఒక పెళ్లి, కొన్నాళ్లు కాపురం, వీలైనంత మనీ, బంగారం పట్టుకుని చెక్కేయడం… చాలా పద్ధతి కలిగిన మోసం… ఎక్కడా పదీపదిహేను రోజులకన్నా ఎక్కువ ఉండదు… మా పేరెంట్స్ ఇంటికి వెళ్లి చూసొస్తాను అని సాకు చెప్పడం, జంప్…
Rajouri 'Runaway bride' allegedly married twenty seven (27) men in Budgam district only.
Reports Ubaid Mukhtar~ TK pic.twitter.com/nbhRLObs2k
— The Kashmiriyat (@TheKashmiriyat) July 13, 2023
ఈమెది రాజౌరి జిల్లా అట, కానీ ఈ 27 మంది బాధితులు మాత్రం బుద్గాం జిల్లా వాళ్లే… పోలీసులు ఇతర జిల్లాల్లో కూడా ఈమె తన ప్రతాపాన్ని చూపించిందా అనే కోణంలో ఎంక్వయిరీలు చేశారు గానీ ఇంకా ఏమీ చెప్పలేకపోతున్నారు… ఈ వార్తలు చదివిన జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా బోలెడంత హాశ్చర్యపడిపోయాడు…
‘‘ఇది మామూలుగా లేదు… నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సీరియళ్ల కథలాగా అనిపిస్తోంది…’’ అని ట్వీటాడు… పోలీసులు మేమేదో సీరియస్ దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు గానీ లోకల్ పేపర్లలో వచ్చిన వార్తలు చదివాక ఇంకా ఆమె అదే జిల్లాలో ఉందానేది డౌటే… మరో కరువు జిల్లాను వెతుక్కుని జంపైపోయి ఉండవచ్చు…
Share this Article