Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Laila… చెరగని అదే నవ్వు… ‘శబ్దం’తో వెండితెరపైకి రీఎంట్రీ… నిశ్శబ్దంగా…

March 10, 2023 by M S R

లైలా… ఈ పేరు వినగానే నాటి ఎగిరే పావురమా సినిమా గుర్తొస్తుంది… ఆమె ముగ్ధమైన నవ్వు గుర్తొస్తుంది… 42 ఏళ్ల లైలా నవ్వు ఇప్పటికీ అలాగే ఉంది… నిజానికి పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉండి… కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన పాన్ ఇండియా స్టార్… కానీ ఒక్కటంటే ఒక్కటీ మంచి పాత్ర పడలేదు ఆమె కెరీర్‌లో… సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలిక…

గోవాలో పుట్టిన ఈమె 1996 నుంచి 2006 వరకూ చెప్పుకోదగిన రోల్స్‌లోనే నటించింది… జన్మతః క్రిస్టియన్… ఎనిమిదేళ్లు డేటింగులో ఉండీ ఉండీ, నిశ్చితార్థం తరువాత నాలుగేళ్లు వేచీ వేచీ… 2006లో ఇరానీ వ్యాపారి మెహ్‌దీని పెళ్లి చేసుకుంది… తరువాత సినిమాలు బంద్… అసలు ఆమె ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కూడా తెలియనంతగా అజ్ఞాతం… ఇద్దరు పిల్లలు… సినిమా ఫంక్షన్లలో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ కనిపించలేదు…

laila

Ads

టబు (52) వంటి ఇప్పటికీ చెప్పుకోదగిన పాత్రల్లో రాణిస్తున్న చాలామంది హిందీ తరాలతో పోలిస్తే లైలా వయస్సు పెద్దదేమీ కాదు… ఆమె మనస్సు సెకండ్ ఇన్నింగ్స్ వైపు మళ్లింది… ఇంద్రజ, ఆమని వంటి ఓ మోస్తరు తారలు కూడా ఏవో పాత్రలు దొరకబుచ్చుకుని తెలుగు తెరపై మళ్లీ కనిపిస్తున్నారు… అందుకే లైలా కూడా చెన్నైలోని తన పరిచయాలను టచ్ చేయడం మొదలుపెట్టింది… నిజానికి తను ఎక్కువ సినిమాలు చేసింది తమిళంలోనే…

తరచూ చెన్నై వెళ్తూ… మొదట జీతమిళ్ వంటి టీవీ చానెళ్లలో కనిపించసాగింది…  లైలాకు సినిమాలపై మళ్లీ ఆసక్తి పెరిగింది అనే సంకేతాలు జారీ అయిపోయాయి… ఫలితంగా సర్దార్‌‌లో చాన్స్ వచ్చింది… ఎందుకైనా మంచిదని తెలుగు చానెళ్లలో కనిపించడం మొదలుపెట్టింది… కొన్ని ఎపిసోడ్ల జబర్దస్త్‌కు జడ్జిగా చేసింది… ఈటీవీలోనే వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ, వావ్ వంటి షోలలోనూ కనిపించింది… శబ్దం అనే సినిమా చాన్స్ వచ్చింది…

shabdam

గతంలో అప్పుడెప్పుడో వైశాలి అనే సినిమా వచ్చిందిగా… ఆ టీం తీస్తున్న సినిమా శబ్దం… ఆమధ్య పోస్టర్ కూడా రిలీజ్ చేశారు… అందులో లైలాకు కూడా ఓ ముఖ్యమైన పాత్ర ఇచ్చారు… హీరోయిన్ వేరే అమ్మాయి… ఇది సస్పెన్స్, హారర్ థ్రిల్లర్… అన్నట్టు స్నేహ కూడా చానెళ్లలో కనిపిస్తోంది… సెకండ్ ఇన్నింగ్స్ మీద ఇంట్రస్ట్ చూపిస్తోంది… ప్రియమణి కూడా చానెళ్లలో తరచూ కనిపిస్తూ, అడపాదడపా సినిమా చాన్సులు కొడుతోంది… సదాకు మళ్లీ నటన మీద ఇంట్రస్ట్ ఉందో లేదో తెలియదు గానీ ఆమె కూడా టీవీ షోలలో యాక్టివ్ పర్సనాలిటీ… సో, సినిమా చాన్సులకు రీఎంట్రీ వయా చానెళ్లు…

laila

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions