.
నిజానికి వైసీపీ బ్యాచ్ వికటాట్టహాసం చేస్తున్నదేమో… ఆ థర్టీ ఇయర్స్ పృథ్వి గాడికి గుణపాఠం నేర్పించాం, లైలా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది అనుకుని…
కానీ, నిజానికి వాళ్ల నెగెటివ్ క్యాంపెయిన్ ఫలితం ఏమో గానీ… ఒరిజినల్‌గానే సినిమా ఓ స్క్రాప్ మెటీరియల్… ప్రస్తుత సోషల్ మీడియా భాషలో పెద్ద రాడ్డు… ప్రేక్షకులే తిరస్కరిస్తున్నారు… కానీ క్రెడిట్ వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోంది…
Ads
విష్వక్సేన్ హీరోహీరోయిన్లుగా నటించిన (అవును, మరో హీరోయన్ ఆకాంక్ష శర్మో ఎవరో ఉన్నారు గానీ, ఉత్త స్కిన్ షో తప్ప నయా పైసా ఫాయిదా లేదు కథకు…) లైలా సినిమా గురించి ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే… ఈటీవీ జబర్దస్త్ లేడీ గెటప్పులు చాలా నయం… మరీ మరీ శాంతి స్వరూప్ ఇంకా నయం…
లేకపోతే ఏముందిర భయ్ ఈ సినిమాలో..? కాస్త వెగటుతనం, ఇంకాస్త వెకిలితనం, మరికాస్త జుగుప్స కలిస్తే లైలా సినిమా… ఈమాత్రం దానికి ఓ స్క్రిప్టెడ్ ప్రశ్న… ఏమోయీ విష్వక్సేనుడూ, బాలకృష్ణ కంపౌండ్ విడిచి మెగా కంపౌండ్‌లోకి జంపావు ఏమిటోయీ అని… దానికి ప్రిరిలీజులో చిరంజీవి సుదీర్ఘ వివరణ… పైగా అప్రస్తుత ప్రసంగాలు… అచ్చం లైలా సినిమాలాగే…
అది చాలదని పృథ్వితో 11 గొర్రెల పిచ్చి వ్యాఖ్యలు, దాని మీద రచ్చ… హాస్పిటల్ పాలైన పృథ్వి… హీరో, నిర్మాతలు లెంపలేసుకున్నట్టు వీడియోలు… తరువాత చివరకు దిక్కుమాలిన రీతిలో సారీ చెప్పిన పృథ్వి… చివరకు అందరి నోళ్లూ ఖరాబ్… ఓ స్క్రాప్ సినిమాను తెలుగు ప్రేక్షకుల మీదకు రుద్దారు…
దిక్కుమాలిన కామెడీ, క్రీస్తుపూర్వంనాటి కథ… ఒక కమలహాసన్ పోషించిన ఒక భామా రుక్మిణి, ఒక రాజేంద్ర ప్రసాద్ పోషించిన ఓ మేడమ్ పాత్ర… వాటిని ఒకటికి నాలుగుసార్లు ఈ లైలా సినిమా దర్శకుడు, కథారచయితలు చూసి ఉంటే బాగుండేది… వర్దమాన హీరోలకు మరీ ఈ దిక్కుమాలిన కేరక్టరైజేషన్‌తో లైలా పాత్రను క్రియేట్ చేయడం, దాన్ని ఏమాత్రం పస లేని రీతిలో, ఓ వెకిలి కామెడీగా ప్రజెంట్ చేయడం, దాన్ని విష్వక్సేన్ పోషించడం… జస్ట్, తన జాతకదోషం ఏమో…
ఈ జబర్దస్త్ తాలూకు కామెడీకి సెన్సారోడు ఏ సర్టిఫికెట్ ఇచ్చాడు గానీ… ట్రిపుల్ ఎక్స్ అని ఓ కొత్త కేటగిరీ ఇచ్చేస్తే జనమైనా జాగ్రత్తపడేవాళ్లు… ఆ థియేటర్ల పరిసరాల్లోకి పోకుండా…
సంగీతమూ బాగాలేకపాయె, పాటలూ బాగాలేకపాయె… స్పెషల్ అట్రాక్షన్ అనుకున్న ఆ లైలా పాత్ర కేరక్టరైజేషనూ బాగాలేకపాయె… ఆమాత్రం కథకు సరిగ్గా ప్రజెంటేషనూ బాగాలేకపాయె… వోకే, విష్వక్సేన్ ఏదో తిప్పలు పడ్డాడు గానీ…
ప్చ్, నాలుగు మెట్లు అమాంతం తన కెరీర్‌లో కిందకు జారిపోయాడు… నిజం ఇలాగే నిష్ఠురంగానే ఉంటుందోయీ విష్వక్సేనా… ఇంతకు మించి ఒక్క పదం ఎక్కువ రాసినా ఈ రివ్యూ కూడా లైలా బాపతే అవుతుంది, కాబట్టి ముగిద్దాం…
Share this Article