Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రా, వెన్నెల దొరా, కన్నియను చేరా… రా, కన్నుచెదరా, వేచితిని రా రా…

March 31, 2024 by M S R

Subramanyam Dogiparthi…..  జయలలితనే కాదు , రాజశ్రీని కూడా ఎత్తుకుని పాట పాడతాడు NTR ఈ సినిమాలో . ఎత్తుకుని పాడినా , దాన వీర శూర కర్ణ సినిమాలో భానుమతీ దేవిని ( ప్రభ ) ఎత్తుకుని ఎత్తుకుపోయినా ఆయనకే చెల్లు . ఆ రోజుల్లో హీరోయిన్లు ఇప్పటి హీరోయిన్ల లాగా పలచగా , నాజూగ్గా ఉండేవాళ్ళు కాదు . చక్కగా తింటూ పుష్టిగా , దిట్టంగా ఉండేవారు . సావిత్రి , దేవిక , రాజశ్రీ , కె ఆర్ విజయ అందరూ పుష్టిగానే ఉండేవారు . NTR వాళ్ళకన్నా చక్కగా తినాలనుకున్నది తిని దిట్టంగా ఉండేవారనుకోండి .

NTR – విఠలాచార్య కాంబినేషన్లో 1970 లో వచ్చిన ఈ లక్ష్మీ కటాక్షం సినిమా బాగానే ఆడింది . NTR సినిమా కావటం , విఠలాచార్య మార్కు మంత్రాలు వగైరా ఉండటం , యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వం ఈ సినిమా బాగానే ఆడటానికి కారణాలు . సూపర్ హిట్ కాదు .
రా వెన్నెల దొరా కన్నియను చేర , అమ్మమ్మమ్మ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే , నా వయసూ సుమగంధం నా మనసూ మకరందం , కిల కిల బుల్లెమ్మా కిలాడి బుల్లెమ్మా , పొన్న చెట్టు మాటున పొద్దు వాలిపోతుంది పాటలు శ్రావ్యంగా ఉంటాయి . స్వాగతం స్వాగతం నృత్య గీతం చాలా బాగుంటుంది . అలాగే జ్యోతిలక్ష్మి డాన్సు పాట అందాల బొమ్మను నేను చెలికాడా హుషారుగా ఉంటుంది .
ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేది శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు అని లక్ష్మీ దేవిని ఎలా కాపాడుకోవాలో వివరించే పద్యమే . నాస్తికులకు , హేతువాదులకు కాస్త ఎగస్ట్రాగా అనిపించవచ్చు కానీ అవన్నీ సుకార్యములే . ముఖ్యంగా భార్యను , అక్కచెల్లెళ్ళను కంట తడి పెట్టించవద్దనే మాటలు నిస్సందేహంగా మంచి సలహాలు . అలాగే తల్లిదండ్రులను , సన్నిహితులను , నమ్మినవారిని , భృత్యులను కంట తడి పెట్టించకూడదు . బాధ పెట్టకూడదు . మోసం చేయకూడదు . ఇవన్నీ ఇప్పుడు సోదిగా ఉంటాయనుకోండి .
పి యస్ ఆర్ పిక్చర్స్ బేనర్లో పింజల సుబ్బారావు నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో NTR తో పాటు కె ఆర్ విజయ , రాజశ్రీ , సత్యనారాయణ , బాలయ్య , మిక్కిలినేని , ప్రభాకరరెడ్డి , హేమలత ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఓ రెండు సార్లు చూసా . టి విలో ఈమధ్యే వచ్చింది . యూట్యూబులో ఉంది . చూడండి . పాటలు , డాన్సులు బాగుంటాయి . మంచి కాలక్షేపం .
#తెలుగు సినిమాల సింహావలోకనం #తెలుగు సినిమాలు #telugureels #telugumovies #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions