.
Rochish Mon ……. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాట…. “ఇది తొలి రాత్రి… ప్రేయసి రావే ఊర్వశి రావే…”
& “పూవుక్కు పూవాలే మఞ్‌జమ్ ఉణ్డు…”
1987లో వచ్చిన మజ్ను సినిమాలోని పాట “ఇది తొలి రాత్రి… ప్రేయసి రావే ఊర్వశి రావే…” ఈ మజ్ను సినిమా ఆనంద్ పేరుతో తమిళ్ష్‌లో రీ-మేక్ అయింది. “ఇది తొలి రాత్రి… ప్రేయసి రావే ఊర్వశి రావే…” పాట సందర్భానికి తమిళ్ష్‌లో “పూవుక్కు పూవాలే మఞ్‌జమ్ ఉణ్డు…” పాట.
రెండు పాటల్ని ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడారు. సాహిత్యం, సంగీతం రెండు భాషల్లోనూ పుర్తిగా వేరు వేరు.
తెలుగు పాటకు సంగీతం లక్ష్మీకాంత్- ప్యారేలాల్; తమిళ్ష్ పాటకు సంగీతం ఇళైయరాజా . తెలుగు సినిమా మజ్నుకు సంగీత దర్శకుడిగా ముందుగా ఇళైయరాజాను దర్శకుడు దాసరి నారాయణరావు నిర్ణయించుకున్నారు.
Ads
కారణాంతరాల వల్ల ఇళైయరాజా స్థానంలోకి లక్ష్మీకాంత్- ప్యారేలాల్ వచ్చారు. (ఈ సమాచారం ప్రముఖ సినిమా రచయిత రాజేంద్రకుమార్ ఇచ్చారు. దాసరి నారాయణరావు అనుంగు శిష్యుడు రాజేంద్రకుమార్)
“ఇది తొలి రాత్రి… ప్రేయసి రావే ఊర్వశి రావే…” పాటను చాల గొప్పగా చేశారు లక్ష్మీకాంత్- ప్యారేలాల్. పాటపై లక్ష్మీకాంత్- ప్యారేలాల్ సంతకం ప్రస్ఫుటంగా ఉంటుంది. బాణి, prelude, interludes, rhythm సహిత వాద్య సంగీతం చాల బావుంటుంది.
“ఇది తొలి రాత్రి… ప్రేయసి రావే ఊర్వశి రావే…” పాట ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం చాల గొప్పగా పాడిన పాటల్లో ఒకటి. అతః పూర్వం దక్షిణాదికి తెలియరాని ఫణితి ఈ ఎస్.పీ.బీ. గానం. దక్షిణాదిలో మరే గాయకుడూ అందివ్వని గాన వైశేష్యం ఈ పాట గానం. Mood, modulation, expression exquisiteness ఈ గానంలో కొత్త ఎత్తులో నెలకొంది.
“పూవుక్కు పూవాలే మఞ్‌జమ్ ఉణ్డు…” ఇళైయరాజా చేసిన పాట. ఇళైయరాజా చాల గొప్పగా చేశారు. ప్రౌఢత్వం పరంగా ఇళైయరాజా ఒక మెట్టు పైన ఉన్నారు. లక్ష్మీకాంత్- ప్యారేలాల్ mood పరంగా ఒక మెట్టు పైన ఉన్నారు. నిజానికి ఇద్దరిలో ఎవరి సంగీతం బావుందో ఇక్కడ నేను తేల్చుకోలేక పోతున్నాను. మీరు తేల్చి చెబుతారా?
సందర్భం ఒకటే అయినా తమిళ్ష్ సాహిత్యం వేరు; తమిళ్ష్ పాట బాణి నడక, తీరు రుచి వేరు. కాబట్టి గాన విధానం modulation, expression వేరుగా ఉంటాయి. తెలుగు పాటను ఎంత గొప్పగా పాడారో తమిళ్ష్ పాటను కూడా అంతే గొప్పగా పాడారు.
Subtlety, profoundity పరంగా తమిళ్ష్ పాటను మేలుగా పాడారా? Mood, భావం, గాన- పరిణామం పరంగా తెలుగు పాట మేలుగా ఉందా? ఔను అని నా అవగాహన. కాదు, కాదు అని అనే అభిజ్ఞులకు ఆహ్వానం.
వినండి… విని నన్ను తప్పు పట్టండి
మజ్ను పాట ….. https://youtu.be/ycmwgJ9_-h8?si=Tjq1e_W7cwe-WcnN
తమిళ్ష్ పాట ……. https://youtu.be/sUJWaM3xqnc?si=8O09j8PGyyeUi_z0
.
రోచిష్మాన్ 9444012279
Share this Article