.
Subramanyam Dogiparthi …… Title matters . సినిమా పేరు కూడా ఆ సినిమా జయాపజయాలను ప్రభావితం చేస్తాయి . దాసరి దర్శకత్వం వహించిన నూరవ సినిమా ఈ లంకేశ్వరుడు . 1989 అక్టోబరులో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి బాగా నటించాడు .
నెగటివ్ షేడ్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో చిరంజీవి నటన , డాన్సులు , ఫైట్లు అదరకొడతాయి . అయినా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది . అందువలనే దాసరి-చిరంజీవి కాంబినేషన్లో ఈ సినిమా ఫస్ట్ & లాస్ట్ అయిపోయింది .
Ads
విజయమాధవి బేనరుపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ సినిమాకు కధ , మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం సకలం దాసరే . సినిమాలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ , ఉన్నోళ్ళను కొట్టి లేనోళ్ళకు పెట్టే రాబిన్ హుడ్ ప్రవృత్తి , హీరోయిన్ రాధతో చిలిపి నటన అన్నీ ఉన్నాయి సినిమాలో .
చిరంజీవి నటన తర్వాత చెప్పుకోవలసింది రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో కొరియోగ్రాఫర్ సుందరం ఆధ్వర్యంలో పాటలన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . చిరంజీవి , రాధ అదరగొట్టేసారు . జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది డ్యూయెట్ చిత్రీకరణ సూపర్ . అలాగే మరో పాట కందిరీగ నడుము ఎగురుతోంది పట్టుకోరాదా పాట కూడా .
మరో డ్యూయెట్ ఏ బాబూ ఏఏ బాబూ ఏదో ఒకటి చేద్దాం . వారిద్దరితోటే గ్రూప్ డాన్స్ పాట పదహారేళ్ళ వయసు పడి పడి లేచే మనసు కూడా బాగా చిత్రీకరించబడింది . I am back yes I am back అంటూ సాగే ఫ్రస్ట్రేషన్లో పాడే పాటకు చిరంజీవి డాన్స్ బాగుంటుంది . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనో , సరళాదేవి పాటల్ని శ్రావ్యంగా పాడారు .
ఆ తర్వాత చెప్పుకోవలసింది రాజు కంపోజ్ చేసిన ఫైట్లు . క్లైమాక్సులో అదరగొట్టేసారు . అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు బయ్యర్లకు , ప్రదర్శకులకు కలిసి రాలేదని అంటారు . టైటిల్ని చూసి ఏవో over expectations !! అందులో దాసరి- చిరంజీవిల కాంబినేషన్ !!! టైటిలుకు చిరంజీవి పాత్రకు లింక్ కుదరకపోవటం !!! వీటితో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు .
చిరంజీవి , రాధ , కళ్యాణ్ చక్రవర్తి , రేవతి ,సత్యనారాయణ , రఘువరన్ , మోహన్ బాబు , త్యాగరాజు , అల్లు రామలింగయ్య , విజయచందర్ , నాగబాబు , నాగేష్ , రామకృష్ణ , బాబ్ క్రిస్ఠో , జీవా , మహేష్ ఆనంద్ తదితరులు నటించారు .
ఈ సినిమాలో చిరంజీవి పక్క ఓ చిరుత పులి కూడా ఉంటుంది . రాధకు ర పలకదు . ర బదులు ల అంటూ ఉంటుంది . ఆ సీన్లన్నీ సరదాగా బాగానే పండాయి .
సినిమా బాగుంటుంది . చిరంజీవి అభిమానులకు నచ్చుతుంది . బహుశా చిరంజీవి అభిమానుల్లో చూడనివారు ఉండరు . ఒకరూ అరా ఉంటే చూసేయండి . యూట్యూబులో ఉంది . నేను పరిచయం చేస్తున్న 1216 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article