చాలామంది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మీద సర్కార్ -4 చూస్తూ ఉంటారు… ఇండియన్ ఐడల్ తెలుగు షో ప్లస్ సర్కార్ -4 పోటాపోటీగా పోటీపడుతున్నాయి… అఫ్‌కోర్స్, ఇండియన్ ఐడల్‌కు దాని నిర్వహణ తీరు, కంటెస్టెంట్ల ఎంపిక ఎట్సెట్రా ప్లస్ పాయింట్లు కాగా… సర్కార్-4కు మెయిన్ అసెట్ సుడిగాలి సుధీర్…
గత హోస్ట్ ప్రదీప్‌ను మించి రక్తికట్టిస్తున్నాడు, అందులో డౌట్ లేదు… క్రియేటివ్ టీం కూడా కాస్త ఎక్కువ వర్క్ చేస్తున్నట్టుంది… ఏదో పిచ్చి గేమ్ అన్నట్టు గాకుండా ఓ ఫన్ షోగా మారుస్తున్నారు… సరదా చెణుకులు, కౌంటర్లు, ఫన్నీ పంచులతో రక్తికట్టిస్తున్నారు మొత్తానికి…
అయితే… ఈ షో స్క్రిప్టులో ఓ లోపమున్నట్టు అనిపిస్తుంది… చాలామంది గమనించారో లేదో… (Subject to correction also)… కంటెస్టెంట్లకు తలా 3 లక్షల పాయింట్లు ఇస్తారు, వోకే… ఆ పాయింట్ల నుంచి ప్రతి ప్రశ్నకూ బిడ్ వేయొచ్చు… అందరూ పోటీపడతారు కాబట్టి పాడే అమౌంట్‌ను బట్టి హోస్ట్ క్లూస్ ఇస్తుంటాడు… ఆ క్లూస్ ఆధారంగా తమకు జవాబు తెలుసు అనుకునేవాళ్లు ఎక్కువ పాయింట్లను బిడ్‌లో పెట్టే చాన్స్ ఉంటుంది…
Ads
సో, ఇక్కడి వరకు వోకే… 7, 8, 9 ప్రశ్నల వద్ద ఒక్కొక్కరూ డ్రాప్ అవుతారు, తమ వద్ద మిగిలిన పాయింట్లను వేరే ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు… అక్కడి నుంచి పోటీకి పరిమితి ఏర్పడుతుంది… సభ్యులు తగ్గిపోతుంటారు కాబట్టి… చివరి ప్రశ్న దగ్గరే ఓ చికాకు… (ముందుగా ఓ క్లారిటీ… అందులో చూపించడమే తప్ప గెలిచినా ఓడినా ఎవరికీ ఏమీ ఇచ్చే డబ్బు ఏమీ ఉండదు, జస్ట్, ఏ గేమ్… అందరికీ ఎంతో కొంత గౌరవ రెమ్యునరేషన్ ఇస్తారేమో బహుశా… ఎంటర్‌టెయిన్ చేస్తున్నారు కాబట్టి…)
ఆ పదో ప్రశ్నకు సరైన జవాబు గెలిస్తే కోటి రూపాయలు… గెలిస్తే ఇచ్చేదేమీ లేకపోయినా షో చూస్తున్నవాళ్లకు కొంత సరదాగానే ఉంటుంది… కానీ క్లూస్ లాస్ట్ కంటెస్టెంట్ కొనుక్కోవాలి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… కొనుక్కోవడం వరకూ వోకే, కానీ క్లూస్ కొనుక్కోెవడం దేనికి..? ఎలాగూ ఇతర కంటెస్టెంట్లు ఎవరూ పోటీలోనే ఉండరు కదా… సో, క్లూస్ కొన్నా కొనకపోయినా నేరుగా ప్రశ్నను విని, జవాబుకు రెడీ అవడమే బెటర్ కదా…
ఇక్కడ ఆట నుంచి డ్రాప్ కావడం అనేది లేదా ఎంతో కొంత అమౌంట్ మిగలడం అనేది అర్థరహితం… ఇమ్మెటీరియల్… పోటీపడే వాడు ఉన్నప్పుడు కదా క్లూస్ కొనుక్కోవడం, ఎక్కువ బిడ్‌కు వెళ్లడం అనేది… కామన్ సెన్స్ పాయింట్ ఇది… సరే, ఏదో కాస్త మైండ్ గేమ్ అన్నట్టుగా చివరలో బాగానే ఉంటుంది కానీ, గేమ్ స్క్రిప్టు రాసే దశలోనే జరిగిన బ్లండరేమో అనిపిస్తుంది… ఐనా టీవీలు, ఓటీటీ షోల క్రియేటివ్ టీమ్స్‌కు ఎప్పుడూ ప్రేక్షకుడు అలుసే కదా… ఇదీ అంతే..!!
మరి సుడిగాలి సుధీర్ గానీ, ప్రదీప్ గానీ ఈ ల్యాప్స్ గుర్తించలేదు అంటారా..? భలేవారే, వాళ్ల చెక్కు వాళ్లు తీసుకుని చెక్కేయడమే… గేమ్ స్క్రిప్టు ఎలా ఉండాలనేది ఆ టీం ఇష్టం… వాళ్లకెందుకు..?! గత మూడు సీజన్లు, నడుస్తున్న ఫోర్త సీజన్‌లో కూడా ఏ కంటెస్టెంట్ అడిగినట్లు లేదు… అసలు పోటీపడేవాళ్లే లేనప్పుడు క్లూస్ ఎందుకు కొనుక్కోవాలి, దాంతో ఫాయిదా ఏమిటీ అని..!!
Share this Article