.
ఖచ్చితంగా ఇది ఇండియా అత్యాధునిక సాంకేతిక రక్షణ నైపుణ్యంలో తలెగరేసే సందర్భమే… ఇప్పటిదాకా ఎయిర్ డిఫెన్స్ అంటే యుద్ధవిమానాలతో జరిగే పోరాటం…
లేదా బయటి నుంచి వచ్చే అన్‌మ్యాన్‌డ్ ఫ్లయిట్స్, డ్రోన్స్‌ను మిస్సయిళ్లతో కూల్చేయడం… మిస్సయిళ్లను కూల్చడానికి కూడా మిస్సయిళ్లే వాడాలి… కానీ ఇప్పుడు..?
Ads
పవర్‌ఫుల్ లేజర్ బీమ్స్ ఉపయోగించి బయటి నుంచి వచ్చే ఏ ఆయుధమైనా సరే గగనంలోనే కూల్చేయడం… DEW టెక్నాలజీ… 30 కిలోవాట్ల లేజర్ బీమ్‌తో ఎయిర్‌క్రాఫ్టులను కూల్చే పరిజ్ఞానాన్ని నిన్న కర్నూలు నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజులో విజయవంతంగా ప్రయోగించింది…
ఎస్, ఇప్పటిదాకా ఈ పరిజ్ఞానం అమెరికా, రష్యా, చైనాల వద్దే ఉంది… ఇప్పుడు వాటి సరసన మనం… ఐతే ఇదేమీ కొత్త కాదు… మన దేశం దుర్గ పేరుతో చాన్నాళ్లుగా ఈ ప్రయోగాలను పరీక్షిస్తూనే ఉంది… ఇప్పుడు తొలి విజయం… ఇంకా చాలాదూరం వెళ్లాల్సి ఉంది…
దుర్గ అంటే Directionally Unrestricted Ray-Gun Array … ఇది దుర్గ-1, సెకండ్ ఫేజు ఇంకా అడ్వాన్స్‌డ్…డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి కామత్ ఈ సందర్భంగా చెప్పిన మాటలు ఏమిటంటే..? ‘‘ఇంకా మైక్రోవేవ్ వెపన్స్, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వెపన్స్ డెవలప్ చేయాల్సి ఉంది… ఇవన్నీ సమకూరితే స్టార్ వార్స్ తరహా డిఫెన్స్‌కు మనం రెడీ..’’
నిజమే… మన అగ్నిక్షిపణుల రేంజ్ 10 వేల కిలోమీటర్లు దాటిపోయింది… మనం స్పేస్ మిసైళ్లతో అంతరిక్షంలో ఉన్న శత్రు ఉపగ్రహాలనూ కూల్చగలం… మైక్రోవేవ్ వెపన్స్ గురించి ఆయన ఇప్పుడు ప్రస్తావించడమే కాదు… కాళి ప్రాజెక్టు పేరిట చాన్నాళ్లుగా మనం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం…
యుద్ధం తీరు మారిపోతున్నది… ఉగ్రవాదులను జొప్పించి ఓ దేశాన్ని అస్థిరం చేయడం, నకిలీ కరెన్సీ ద్వారా ఆర్థిక వ్యవస్థలను కుంగదీయడం పాకిస్థాన్ స్టయిల్… కానీ రాబోయే యుద్ధాలు ఎలా ఉంటాయో చైనా ఇంకాస్త కొత్తగా, ముందుకు వెళ్లిపోతోంది…
వాటర్ వార్, కరెన్సీ వార్, వెదర్ వార్, బయో వార్… ఇలా… సరే, ట్రంపు తాజాగా టారిఫ్ వార్ మొదలు పెట్టాడు… ఈ స్థితిలో మనం చేతులు కలుపుదాం, కలిసి డాన్స్ చేద్దాం అనే పాట అందుకుంది చైనా ఇండియాతో…
అఫ్‌కోర్స్, చైనా, అమెరికా రెండూ నమ్మదగని దేశాలే… ఎలాగూ ఐక్యరాజ్యసమితి మీద ప్రస్తుతం ఏ దేశానికీ ఏ నమ్మకమూ లేదు, అదొక విఫల విశ్వవేదిక… ఒకవేళ బ్రిక్స్ వంటివి ఇంకా విస్తరిస్తే… ఆర్థికమే కాదు, రక్షణ అంశాన్ని కూడా ఎజెండాలో చేరిస్తే అమెరికా, దాని తోక దేశాలకు కౌంటర్, చెక్..!!
.
Share this Article