గుండెపోట్లకు మెయిన్ కారణం..? గుండెకు రక్తాన్ని తీసుకుపోయే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడటం… వాటికీ అనేక కారణాలు… ఇన్నాళ్లూ స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ చేయడం, కొన్నిసార్లు ఓపెన్ హార్ట్… ఇలా రకరకాల చికిత్సలు సాగుతున్నాయి… యాంజియోప్లాస్టీ కూడా..! ఇవేవీ అవసరం లేకుండా లేజర్ థెరపీని అందుబాటులోకి తెచ్చినట్టు ఓ డాక్టర్ చెబుతున్నాడు… ఇప్పటికే 55 సక్సెస్ ఫుల్ కేసులు తమ రికార్డుల్లో ఉన్నాయనీ అంటున్నాడు… ఇంట్రస్టింగు కదా…
టైమ్స్ నాగపూర్ సెంటర్ నుంచి ఈ న్యూస్ పబ్లిష్ చేసింది… లైవ్ నాగపూర్ కాంక్లేవ్‌లో మెదంతా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రవీణ్ చంద్ర ఈ వివరాలను వెల్లడించాడు… దీనివల్ల ఖర్చు, ప్రయాస, కోలుకునే టైమ్ కూడా తక్కువ… పైగా పర్‌ఫెక్ట్‌గా బ్లాకులను తొలగించొచ్చునని ఆయన వివరణ… ఆయన ఏమంటాడంటే..?
Ads
‘‘ఈ చికిత్సలో భాగంగా ఓ చిన్న గాటు పెట్టి అందులో నుంచి హైపవర్ లేజర్ గన్ జొప్పిస్తారు… బ్లాక్స్ ఎక్కడున్నాయో అక్కడి దాకా తీసుకెళ్లి వాటిపై లేజర్స్ ప్రయోగిస్తారు… దీంతో ఆ బ్లాక్స్ కరిగిపోతాయి… రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది… దీనివల్ల ధమనుల గోడలకు కూడా ఏ నష్టమూ ఉండదు… ఒకవేళ బెలూన్లు, స్టెంట్లు వేయాలనుకున్నా సరే, వాటిని కరెక్టు ప్లేసుల్లో కరెక్టుగా పెట్టడానికి కూడా ఈ లేజర్ గన్ ఉపయోగపడుతుంది…
కొన్నిసార్లు యాంజియోప్లాస్టీ కూడా కొందరికి ప్రమాదకరంగా మారొచ్చు… అలాంటివారికీ ఈ లేజర్ థెరపీ చాలా ప్రయోజనకరం… పేషెంట్ త్వరగా సాధారణ జీవితంలోకి వెళ్లడానికి ఇది ఉత్తమమైన, ఆధునిక చికిత్స…’’ అంటున్నాడాయన… ఈ నాగపూర్ లైవ్ కాంక్లేవ్‌కు దాదాపు 200 మంది డాక్టర్లు హాజరయ్యారు… గుండె చికిత్సల్లో ఆధునిక పద్ధతుల గురించి చాలామంది డాక్టర్లు తమ అనుభవాలను వివరించారు…
ముంబైకి చెందిన డాక్టర్ వీటీ షా ఏమంటాడంటే..? ‘‘మేం 360 డిగ్రీస్ ఇమేజింగ్ ద్వారా యాంజియోప్లాస్టీ చేస్తున్నాం… దీనివల్ల సరిగ్గా ఎక్కడ స్టెంట్ వేయాలో కూడా నిర్ధారణ జరుగుతోంది…’’వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి ప్రతి మూడునాలుగు నెలలకు ఒక కొత్త విధానం ప్రవేశపెట్టబడుతోంది… చాలా ఆధునికమైన మార్పులు, టెక్నాలజీ చోటుచేసుకుంటున్నాయి… ఇలాంటి కాంక్లేవ్స్ ద్వారా ఆ సమాచారాన్ని, డాక్టర్ల అనుభవాల్ని తెలుసుకోవచ్చు అంటాడు షా… గుడ్…
Share this Article