.
నాగశౌర్య తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన పేరే. తన సొంత మేనత్త ఒకప్పటి స్టార్ సిస్టర్! కానీ ఆ కుటుంబంతో మాటల్లేవు.. ఎందుకో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి చిత్రాలతో యూత్ మనసులు గెలుచుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. గత కొంతకాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఆమధ్య వచ్చిన ‘రంగబలి’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
Ads
అయితే సినిమాల సంగతి పక్కన పెడితే, నాగశౌర్యది పక్కా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబమే అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన సొంత మేనత్త (తండ్రి తోబుట్టువు) తెలుగులో ఒకప్పుడు మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
ఎవరామె? ‘చిట్టి చెల్లెలు’ లతాశ్రీ!
లతాశ్రీ.. పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఈవీవీ సత్యనారాయణ సూపర్ హిట్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రాజేంద్రప్రసాద్ చెల్లెలి పాత్ర అంటే ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. విజయవాడకు చెందిన లతాశ్రీ టాలీవుడ్‌లో ఒకప్పుడు ‘చిట్టి చెల్లెలు’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె కెరీర్ హైలైట్స్ చూస్తే: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 70కి పైగా సినిమాల్లో నటించారు.
యమలీల, నెంబర్ వన్, అబ్బాయి గారు, పోలీస్ భార్య, అల్లరోడు, బాలచంద్రుడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహాయ నటిగా, విలన్ గా మెప్పించారు.
1999 తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆమె, మళ్లీ 2007లో అల్లరి నరేష్ ‘అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.
అంతా బానే ఉంది కానీ.. ఆ ఫ్యామిలీతో మాటల్లేవ్!
వ్యక్తిగత జీవితానికి వస్తే.. లతాశ్రీ ఒక జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు (బీటెక్ చదువుతున్నారు). అయితే, అంత పెద్ద నటి అయిన లతాశ్రీ.. తన సొంత అన్నయ్య కుటుంబంతో, మేనల్లుడు నాగశౌర్యతో టచ్‌లో లేరనేది ఇండస్ట్రీలో ఒక ఓపెన్ సీక్రెట్. నాగశౌర్య ఇంట్లో జరిగే ఎలాంటి శుభకార్యాల్లోనూ ఆమె కనిపించరు.
దీనిపై గతంలో ఒక ఇంటర్వ్యూలో లతాశ్రీ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. “నాకు నా అన్నయ్య, నా మేనల్లుడు నాగశౌర్య అంటే చాలా ఇష్టం. వాళ్లు నా వాళ్లే.. కానీ వదిన మనవాళ్లు అవ్వరు కదా!” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క మాటతో నాగశౌర్య తల్లికి, లతాశ్రీకి మధ్య ఉన్న మనస్పర్థల వల్లే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని, అందుకే ఇరు కుటుంబాల మధ్య మాటల్లేవని స్పష్టమైంది. ఏదేమైనా ఒకప్పటి ఫేమస్ నటి, ఇప్పటి యంగ్ హీరోకి మేనత్త అవుతుందనే విషయం మాత్రం నిజంగానే ఆసక్తికరమైన విషయమే!
Share this Article