ఒక సినిమా విడుదల అవుతుందంటే చాలు… దాని రేంజ్ ఏదైనా సరే… ఇక వరుసగా దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ గట్రా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు… ‘కవరేజీ’ ఖర్చెక్కువైనా సరే, మంచి పబ్లిసిటీ… రాసేవాడికీ తెలుసు, చదివేవాడికీ తెలుసు… ఇవి ప్రమోషనల్ ఇంటర్వ్యూలని..! కాకపోతే పెద్ద పెద్ద యాడ్స్ ఖర్చుకన్నా ఇది బెటర్ అనేది సినిమా మార్కెటింగ్, పబ్లిసిటీ వాళ్లకు తెలుసు కదా… మీకు గుర్తుందా, బాహుబలికి రాజమౌళి చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు, జస్ట్, ఇంటర్వ్యూలతోనే లాగించేశాడు… సరే, వాళ్లు చెప్పే ముచ్చట్లలో 90 శాతం హిపోక్రసీ, స్క్రిప్టెడ్, పనికిరాని అబద్దాలు… చదివేవాడు కూడా అంతే లైట్‌గా చదివి వదిలేస్తాడు… ఐతే… ఇప్పుడు విషయం ఏమిటంటే… ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఇప్పుడు టీవీ సీరియళ్లకు కూడా ఆ పైత్యాన్ని అంటించేస్తున్నయ్… ఏదైనా టీవీలో కొత్త సీరియల్ వస్తుంటే ఇక ఆ సీరియల్ సంబంధ వ్యక్తులతో ఇంటర్వ్యూలు కుమ్మేస్తున్నాయి… ఫాఫం, సినిమా సైట్ల ఆదాయాన్ని కూడా పత్రికలు తన్నుకుపోతున్నయ్…
ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తొస్తున్నదీ అంటే… ఆంధ్రజ్యోతి ఈరోజు కావ్యశ్రీ అనే ఓ టీవీ సీరియల్ నటి ఇంటర్వ్యూను కాలాల కొద్దీ పరిచేసింది… తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే కన్నడ నటులు కదా… ఏదో ఒకరూ ఇద్దరూ ప్రేమి విశ్వనాథ్‌లు తప్ప మొత్తం కన్నడ హీరోయిన్లతో హవా ఇక్కడ… తప్పేమీ లేదు, ప్రతిభావంతులైన నటులే… ఈమధ్య కావ్యశ్రీ కూడా ఇంటింటికీ చేరువైంది… అయితే ఆ ఇంటర్వ్యూ చదువుతుంటే కొన్నిచోట్ల నిజంగా ఆమె చెప్పిందా అనే డౌటూ వచ్చింది… సేమ్, అందరూ చెప్పే రొటీన్ చిలక పలుకులే… సరే, ఆమె చెప్పిందో, వీళ్లే రాశారో గానీ… ఓచోట మాత్రం ఫక్కున నవ్వొచ్చింది… ‘‘హైదరాబాద్‌లో మొదటి సీరియల్ చూస్తున్నప్పుడు ఇక్కడి ఆహారం పడేది కాదు… భాష రాదు, ఓ లైన్ ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లి తినేసి వచ్చేదాన్ని, టీవీ వాతావరణం నచ్చడంతో సినిమా అవకాశాల్ని వదిలేశాను…’’ ఇలా సాగింది… (అమ్మకు తెలియని కోయిలమ్మ అనే కొత్త సీరియల్ లెండి… దరిద్రంగా ఉంది సీరియల్ పేరు…)
Ads
- అసలు బెంగుళూరు, మైసూరు తదితర కన్నడ నగరాల తిండికీ, మన తిండికీ ఏమైనా తేడా ఉంటుందా..? వండే విధానమే కాదు, చాలావరకూ వంటల పేర్లు కూడా అవే కదా… అసలు రెండు రాష్ట్రాల నడుమ గీతలు గీసి విడదీశారు గానీ, ఒకే సంస్కృతి కదా దాదాపు… భాష కూడా చాలావరకూ కలుస్తుంది, లిపితో సహా… మరి ఆమెకు ఈ ఆహారం పడకపోవడం ఏమిటి..? ఏదో ఇండియా వాడు ఏదో ఆఫ్రికాకో, అరబ్ దేశానికో వెళ్లి అవస్థలు పడ్డట్టు..!!
- హైదరాబాద్‌లో కొన్ని వందల ఉడుపి హోటళ్లున్నయ్… అవన్నీ కన్నడ వాసనలే కదా… ప్రత్యేకించి టిఫిన్లు అనేసరికి హైదరాబాదీయులు మొత్తం కన్నడ టిఫిన్లకు అలవాటు పడిపోయి ఏళ్లు గడుస్తున్నయ్… టీవీ సీరియళ్లు తీసేవాడు ఆ హోటళ్ల నుంచి ఓ పార్శిల్ తెప్పించలేదా ఈమె కోసం..? అందుకే నవ్వొచ్చింది…
- అనేకమంది కన్నడ నటులు, వృత్తి నిపుణులు హైదరాబాద్‌లో అవకాశాల్ని, ఉపాధిని వెతుక్కుంటున్నారు… వాళ్లే కాదు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు పలు రంగాల్లో బతుకుతున్నారు… మొదటిసారి హైదరాబాద్ ఫుడ్ పడలేదనే మాట వినడం… సో, అదేమిటో ఆమెకే తెలియాలి… పబ్లిష్ చేసిన జ్యోతి వాడికే తెలియాలి… దోశె, ఇడ్లీ, ఊతప్పం, అన్నం, కూరలు, సాంబార్, పెరుగు, నాన్-వెజ్ కూరల దగ్గర నుంచి టీ, కాఫీల దాకా… అసలు తెలుగు, కన్నడ ఫుడ్స్ మధ్య ఏమైనా తేడా ఉంటుందా..?
- సర్లెండి… ఎవరో ఏదో కూస్తారు, ఎవరో ఏదో రాస్తారు… చెవుల్లో రఫ్లీషియా పూలు పెట్టుకుని, బకరాలుగా కనిపించేది పాఠకుడే కదా… సాక్షి, నమస్తే, ఈనాడు, జ్యోతి… ఎవడూ తక్కువ కాదు… అందరూ అంతే… సీరియళ్లూ అంతే… దిక్కుమాలిన కథలు, కథనాలు, ట్విస్టులు, పైత్యాలు… ఆ సీరియళ్ల వార్తలు, ఇంటర్వ్యూలు కూడా అదే స్టయిల్‌లో…
Share this Article