Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజ్‌తరుణ్- లావణ్య కథతో మీడియా పండుగ చేసుకుంటోంది…

August 2, 2024 by M S R

రాజ్ తరుణ్… లావణ్య కథ చిత్ర విచిత్రంగా ఎటెటో సాగిపోతూ… ఇక చూసే ప్రేక్షకులకు కూడా వెగటు కలిగిస్తోంది… భలే కథ దొరికింది అన్నట్టుగా మీడియా మరింత ఆడుకుంటోంది… పెట్రోల్ పోస్తోంది… పండుగ చేసుకుంటోంది…

నిజానికి మొదటి నుంచీ ఈ కథలో లావణ్య మీద బాధితురాలు అనే సానుభూతి ఏమాత్రం కలగడం లేదు… పైగా ఆమె వయెలెంట్ బిహేవియర్ చాలా అనుమానాల్ని కూడా కలగజేస్తోంది… ఇలాంటి మహిళలో అసలు ఇన్నాళ్లూ సహజీవనం చేసిన రాజ్ తరుణ్ మీదే సానుభూతి కలుగుతోంది…

raj tarun

Ads

పదేళ్లో, పన్నెండోళ్లో కలిసి బతికారు, సరే… పెళ్లి కాలేదు… ఆమె డ్రగ్స్, మరొకరితో సంబంధం అంటాడు ఇతను.,. నో, నో, తనకే ఎవరెవరితోనో సంబంధాలున్నాయని అంటుంది ఆమె… నిన్ను విడిచిపెట్టను, నువ్వే కావాలి అంటుంది… నథింగ్ డూయింగ్, నువ్వూ వద్దు, నీతో సహజీవనమూ వద్దు, అసలు జీవితంలో నాకిక పెళ్లే వద్దు బాబోయ్ అంటాడు అతను…

raj tarun

అప్పట్లో సీనియర్ నరేష్, తన లేటెస్ట్ లవర్ పవిత్రా లోకేష్‌తో ఎక్కడ ఉన్నారని తెలిసినా సరే అతని మూడో భార్య అక్కడ ప్రత్యక్షమయ్యేది, గొడవ చేసేది… అదంతా ఎలా సద్దుమణిగిందో తెలియదు కానీ ప్రస్తుతానికి అందరూ సైలెంట్… ఇప్పుడు లావణ్య కూడా అంతే… రాజ్ తరుణ్ ఫలానా దగ్గర ఉన్నాడని తెలిస్తే చాలు ప్రత్యక్షం… గొడవ…

raj tarun

ఎలాగూ సంబంధం తెగదెంపులు… ఇక రాజ్ తరుణ్ ఆమెతో కలిసి ఉండటం అనేది కల్ల… మరి ఆమె ఏం ఆశిస్తోంది..? సహజీవనం తప్పు కాదు, నేరం కాదు, రాజ్ తరుణ్ మీద పోలీసులు చేయగలిగేదీ ఏమీ లేదు… కానీ ఆమె రోజురోజుకూ వయెలెంటుగా రియాక్టవుతోంది… మీడియా కూడా తెగ ఉత్సాహపడుతోంది… మరో ఇష్యూ దొరికాక లావణ్య నీడను కూడా దేకదు మీడియా… అర్థమవుతున్నట్టు లేదు… నిన్న రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య బిహేవియర్ మీద పోలీస్ ఫిర్యాదు నమోదు చేశారు…

lavanya

నిన్న ఏదో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మీడియా మీట్… రాజ్ తరుణ్ వ్యక్తిగత వివాదంపైనే ప్రశ్నలు… సినిమా గురించి ఏమీ లేదు… ఒకరకంగా తనతో ఆడుకునే ప్రయత్నం చేసింది మీడియా… ఏక్‌సేఏక్ ప్రశ్నలు… కానీ నిజంగా ఓ స్టార్ హీరో ఆ ప్లేసులో ఉంటే ఈ ప్రశ్నలు వేసేవాళ్లా..? రాజ్ తరుణ్ కాబట్టి రెచ్చిపోయారు గానీ… నిష్ఠురంగా ఉన్నా నిజమే ఇది…

https://muchata.com/wp-content/uploads/2024/08/453574847_8542760175747800_4891203043554865316_n.mp4

జీ న్యూస్ కూడా వస్తుందట… నిన్నే తెలిసింది… ఎందుకంటే..? ఏదో పిచ్చి డిబేట్ పెట్టేసి లావణ్యను పిలిచారు… ఎవరో శేఖర్ బాషా అని మరొకాయన ఉన్నాడు… చర్చ జరుగుతూ ఉండగానే హఠాత్తుగా ఆమె చెప్పు తీసి గట్టిగా విసిరింది తనవైపు… రభస, రసాభాస… మొత్తానికి ఇదొక చానెల్ ఉందీ అని జనానికి తెలిసిపోయింది… లావణ్య కూడా నాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా ఇలాగే స్పందిస్తా అనే మెసేజ్ ఇచ్చింది… ఇక మీడియా ఇష్టం… ఇంకా ఇలాగే పండుగ చేసుకుంటారా..? ఆపేస్తారా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions