Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జవాన్ లీక్డ్ వైరల్ వీడియో మాయం..! నిజానికి అది కాదు సినిమా విశేషం…

March 10, 2023 by M S R

షారూక్ ఖాన్ రాబోయే సినిమా జవాన్ నుంచి అయిదారు సెకండ్ల వీడియో క్లిప్ ఒకటి లీకయిందనే వార్త నిజానికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు… కొన్నిసార్లు సినిమా యూనిటే హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వేషాలు వేస్తుంటారు… కానీ ఇది అది కాదు… ట్విట్టర్‌లో ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోగానే, సినిమా యూనిట్ ట్విట్టర్‌కు కాపీ రైట్స్ కింద కంప్లయింట్ చేసింది… దాంతో ట్విట్టర్ అన్ని ట్వీట్ల నుంచి ఆ వీడియోను తీసేసింది… కాబట్టి ఎవరో యూనిట్ మెంబరే లీక్ చేసి ఉంటాడు…

ఇలాంటి లీకులు కొత్తేమీ కాదు… సినిమా మొత్తం అయిపోయాక రిలీజుకు ముందు… బాగా నిడివి ఉన్న సీన్లను కూడా లీక్ చేసిన సంఘటనలున్నయ్… అంతెందుకు ఐబొమ్మ వంటి సైట్లలో మొత్తం సినిమానే పెట్టేస్తుంటారు… సో, లీక్ అనేది పెద్దగా ఆశ్చర్యపరచలేదు… ఏదో ముఖం నిండా, రెండు చేతులకూ కట్టు కట్టుకుని కనిపిస్తున్నాడు… మొత్తం హిందీ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ సైట్లు ఈ వార్తకు నెట్‌లో మస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది…

jawan

Ads

నిజానికి సినిమాలో ఆసక్తికరం అనిపించింది ఈ సినిమాలో మొత్తం సౌత్ ఆడలేడీస్‌నే పెట్టుకున్నాడు షారూక్… పైగా ఇది తన సొంత సినిమా… నిర్మాతగా గౌరీఖాన్ పేరే కనిపిస్తుంది… సౌతిండియా సూపర్ స్టార్ నయనతారతోపాటు ప్రియమణి, సాన్యా మల్హోత్రా, రిద్ది డోగ్రా, అస్తా అగర్వాల్ ఉంటారు… వీరిలో కీలకమైన రోల్స్ ప్రియమణి, నయనతార పోషిస్తున్నారు…

అంతేకాదు, మరో కీలకమైన రోల్ విజయ్ సేతుపతి పోషిస్తున్నాడు… చివరకు ముఖ్యమైన కమెడియన్ కూడా సౌతే… యోగిబాబు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ తమిళ సినిమాలో హీరో షారూక్ ఖాన్… ఇప్పుడు టాప్ స్టార్ల సినిమాల్లో కూడా టాప్ స్టార్లను అతిథి పాత్రల్లో చూపించడం ట్రెండ్ కదా… మరి ఇదేమో పేరుకు హిందీ సినిమా అయినా దాని టార్గెట్ సౌత్ ప్రేక్షకులు కదా… అందుకని హీరో విజయ్‌ను అతిథి పాత్రకి తీసుకున్నారు…

నిజానికి ఇది కూడా కాదు విశేషం… పఠాన్ సినిమాలో రెండు గుడ్డ పీలికల్ని ధరించి, గలీజు మూమెంట్స్‌తో స్టెప్పులు వేసిన స్టార్ వ్యాంప్ దీపిక పడుకోన్ ఉందిగా… మరి ఆమె లేకుండా షారూక్ సినిమా ఏమిటి..? అందుకని ఆమెతో కూడా ఓ అతిథి పాత్ర వేయిస్తున్నారు… ఏమో… ఓ ఐటం సాంగ్ ఏమైనా చేస్తుందేమో…

మళ్లీ మరింత పత్‌లా, అంటే దాదాపు ట్రాన్స్‌పరెంటు గుడ్డ పీలికల్ని, ఇంకాస్త చిన్నగా, అనగా రిబ్బన్లలాగా వేలాడేసుకుని, ఇంకాస్త గలీజు స్టెప్స్ వేస్తుందేమో… మరి అవేమీ లేకుండా షారూక్ సినిమా హిట్టయ్యేదెలా..? ఎలాగూ మన సెన్సార్ ఎప్పుడూ కళ్లుమూసుకునే సర్టిఫికెట్లు ఇస్తుందిగా… నువ్వు కుమ్మేయమ్మా… ఒరేయ్, లీకు వీరుడా, నీకు అసలు టేస్ట్ లేదురా… వీలైతే ఆ స్టెప్పుల్ని లీక్ చేయి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…
  • డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions