Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదో చిత్రమైన కేసు…! పైపైన చదివితే ఎక్కదు… తాపీగా అర్థం చేసుకోవాలి..!!

January 30, 2025 by M S R

.

ఓ మోటు సామెత… బర్రె ఎవడి దొడ్లో కట్టింది అని కాదు, ఏ దొడ్లో ఈనింది అనేదే ముఖ్యం అని…! క్షమించండి… సుప్రీంకోర్టు తాజా తీర్పు, అంతకుముందు దిగువ కోర్టుల తీర్పుల వార్త ఒకటి చదివాక హఠాత్తుగా స్పురించిన సామెత అది… అంటే…

ఎక్కడ కడుపు చేసుకున్నావ్ అని కాదు, ఎక్కడ బిడ్డను కన్నావ్ అని..! కాస్త హార్ష్‌గానో, అగ్లీగానో ఉన్నట్టుందా..? పర్లేదు, ఆ తీర్పుల ధోరణి కూడా అంతే గందరగోళంగా ఉంది… ఈ కేసు విషయంలో స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వాదనలు, తీర్పులు చదువుతుంటే అత్యంత గందరగోళం, అయోమయం… అసలు విషయం ఏమిటంటే..?

Ads

కేరళ… కొచ్చి… ఓ మహిళకు 1989లో పెళ్లయింది… 1991లో ఓ కూతురు పుట్టింది… పదేళ్ల తరువాత అంటే, 2001లో ఓ కొడుకు పుట్టాడు… 2003లో ఆమె భర్తతో విడిపోయింది… అంటే విడిగా ఉంటోంది అప్పటి నుంచి… 2006లో అధికారికంగానే విడాకులయ్యాయి… ఇదీ నేపథ్యం… సీన్ కట్ చేస్తే…

ఆమె మున్సిపల్ అధికారులను కలిసి కొడుకు జనన ధ్రువీకరణ పత్రంలో తనతో విడిపోయిన భర్త పేరు గాకుండా తండ్రిగా వేరే పేరు రాయాలని కోరింది… ఆయన ఎవరూ అంటే..? ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తి… వివాహ బంధంలోనే ఉంటూ వివాహేతర సంబంధం అన్నమాట… ఆ సంబంధం వల్ల పుట్టినవాడే ఈ కొడుకు కాబట్టి, అసలు జెనెటిక్ తండ్రి పేరే రాయాలనేది ఆమె కోరిక…

ఆమే స్వయంగా చెబుతున్నది ఆ కొడుకు అసలు తండ్రి వేరు అని… నిజాయితీగా తన అక్రమ సంబంధం వ్యక్తినే కొడుకు తండ్రిగా చూపిస్తోంది… మున్సిపల్ అధికారులు ఒప్పుకోలేదు… అలా కుదరదుపో అన్నారు… కానీ స్థానిక కోర్టు 2007లో సదరు అక్రమ సంబంధం వ్యక్తికీ ఈ కొడుక్కీ డీఎన్ఏ పరీక్షలు చేయాలని తీర్పు చెప్పింది…

ఠాట్, ఇదేం గొళ్లెం..? నేను డీఎన్ఏ పరీక్షలకు అంగీకరించను అని ఆ వ్యక్తి హైకోర్టుకు వెళ్లాడు… జెనెటిక్ తండ్రిగా నిరూపితమైతే ఆస్తిలో వాటాకు కొత్త పంచాయితీలు మొదలవుతాయని తన భయం… కానీ హైకోర్టు ఏమన్నదీ అంటే..? పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరు అని నిరూపిస్తే డీఎన్ఏ పరీక్షలకు అనుమతిస్తాం అని చెప్పింది…

అంతేకాదు, విడాకులు పొందిన 280 రోజుల్లోపు పుట్టిన పిల్లాడికి ఆ తండ్రి సక్రమ సంతానమే అవుతాడని ఏదో సాక్ష్యాధారాల చట్టాన్ని కూడా ఉదహరించింది… సదరు అక్రమ సంబంధం వ్యక్తి సందేహం నిజమే అయ్యింది… ఈ కొడుకు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన నుంచి భృతి కోరుతూ పిటిషన్ వేశాడు… (ఎందుకంటే, లీగల్ తండ్రి విడాకులు తీసుకుని, మీరేమైనా చేసుకొండి అని వదిలేశాడు వీళ్లను…)

ఇక్కడ తేడా అర్థమైంది కదా… లీగల్ తండ్రి, జెనెటిక్ తండ్రి వేర్వేరు… సదరు స్థానిక కోర్టు కూడా భృతి ఇవ్వాలని చెప్పింది… భృతి విషయంలో సక్రమ, అక్రమ సంతానం తేడాలు ఉండవన్నది… వోర్నాయనో, నాకు ఆ పిల్లాడితో సంబంధం లేదని చెబుతుంటే ఈ భృతి ఇవ్వమని చెప్పడం ఏమిటి, భృతి ఇస్తే తండ్రినని అంగీకరించినట్టే కదా అంటాడు సదరు జెనెటిక్ తండ్రి…

హైకోర్టుకు పోయాడు ఈ భృతి తీర్పుపై… ఆ కోర్టు కూడా అదే చెప్పింది… లీగల్ తండ్రి ఉన్నంతమాత్రాన జెనెటిక్ తండ్రి నుంచి భృతిని పొందే హక్కును అడ్డుకోలేమంది… అదెలా..? అసలు డీఎన్ఏ పరీక్షలే జరగకుండా… జెనెటిక్ తండ్రి అని ఎలా ఖరారు చేయగలరు..? కేవలం ఆ కొడుకు, ఆ పిల్లాడి తల్లి చెప్పగానే సరిపోదు కదా…

పైగా కన్నతండ్రిని వెతికే హక్కు కూడా ఆ పిల్లాడికి ఉందని చెప్పింది హైకోర్టు… సదరు అక్రమ సంబంధం వ్యక్తి ఈసారి ఏకంగా సుప్రీంకోర్టుకు పోయాడు… నథింగ్ డూయింగ్, పిల్లాడు కడుపులో పడిన సమయంలో ఆమె భర్తతో, సదరు అక్రమ సంబంధం వ్యక్తితో కంటాక్టులో ఉన్నా సరే… ఆమె మాజీ భర్తే ఆ పిల్లాడికి సక్రమ సంతానం అవుతాడని తేల్చేసింది…

అసలు ఆ జెనెటిక్ తండ్రి అనుమతి లేకుండా డీఎన్ఏ పరీక్ష కుదరదని చెప్పింది… సో, ఈయనకు పుట్టినా సరే ఆమె మాజీ భర్తే ఆ పిల్లాడి తండ్రి అవుతాడు అని పేర్కొంది… ఇక ఇలాగే డీఎన్ఏ పరీక్షలకు అనుమతిస్తే రాను రాను చాలా కాంప్లికేషన్స్, ఇలాంటి కేసులు పెరుగుతాయనీ, డీఎన్ఏ పరీక్ష ప్రైవసీ వ్యవహారమని వివరించింది…

లీగల్ తండ్రి పట్టించుకోడు… జెనెటిక్ తండ్రి ససేమిరా అంటాడు… అవునూ, సదరు జెనెటిక్ తండ్రికి ఇది వ్యక్తిగత గోప్యత సమస్యే అనుకుందాం… కానీ ఆ పిల్లాడికి తన నిజమైన తండ్రి ఎవరో తేల్చుకునే హక్కు లేదా..? అదే కదా హైకోర్టు చెప్పింది… ఏమో… ఏతావాతా సుప్రీంకోర్టు ఏం తేల్చింది..? అదే ముందుగా మనం చెప్పుకున్నది… ఎక్కడ కడుపు చేసుకున్నావ్ అనేది కాదు, ఎక్కడ బిడ్డను కన్నావ్ అనేదే చట్టం చూస్తుందన్నమాట..!! అవునూ, హైకోర్టు కరెక్టా..? సుప్రీంకోర్టు కరెక్టా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions