Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!

April 19, 2026 by M S R

.

ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ ‘లెన్స్‌కార్ట్’ (Lenskart) టీమ్‌లో ఏదో తేడా ఉంది ఖచ్చితంగా…!! మేనేజ్‌మెంట్‌కు తమ ప్రచార బృందం పనితీరు మీద, ప్రచార ప్రకటనల మీద ఏమాత్రం సోయి, పట్టు లేదా..? లేక కావాలనే ఎంకరేజ్ చేస్తున్నారా..? ఐపీఓ ద్వారా వచ్చిపడిన వేల కోట్ల సొమ్ముతో కళ్లు మూసుకుపోయాయా..? ఇలా మూసుకుపోయిన కళ్లకు ఏమైనా కళ్లద్దాలు ఉంటాయా..?

లెన్స్‌కార్ట్ అంతర్గత ‘డ్రెస్ కోడ్’ పాలసీపై ఇటీవల వివాదం రేగింది… అందరమూ చదివాం… తమ స్టాఫ్ తిలకం పెట్టుకోకూడదని, మణికట్టుకు పట్టీలు ఏవీ ఉండకూడదనీ ఆంక్షలు పెట్టి, హిజాబ్‌కు మాత్రం వోకే చెప్పిందని వివాదం… అది ఏకంగా #BoycottLenskart ప్రచారం దాకా వెళ్లింది… నెటిజనం తిట్టిపోశారు… దాంతో కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో పీయూష్ బన్సల్ గబగబా లెంపలేసుకుని, అది పాత డ్రెస్ కోడ్ సర్క్యులర్, ప్రస్తుతం అవేమీ లేవనీ, మాకు అన్ని మత సంప్రదాయాలూ సమానమేనని వివరణ ఇచ్చుకున్నాడు…

Ads

కాదు, మొదటి నుంచీ ఈ కంపెనీ ధోరణి ఇదే అని మళ్లీ కొందరు నెట్‌లో మరో యాడ్ వీడియో వదిలారు… అది పొంగల్ (మన సంక్రాంతి) సందర్భంగా లెన్స్‌కార్ట్ కళ్లద్దాల ప్రచారం… మామూలుగా పొంగల్, సంక్రాంతి యాడ్స్ ఎలా ఉంటాయి, మన పల్లెటూరి కల్చర్, హిందూ పండుగలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి కదా… ఇదేమో భిన్నంగా ఉంది…

ముగ్గులు, సంప్రదాయ వస్త్రధారణ, పూజలు, వంటకాలు, పాలుపొంగించడం, నవధాన్యాలు, గొబ్బిళ్లు, మామిడి తోరణాలు ఎట్సెట్రా… కానీ ఈ యాడ్‌లో ముగ్గురో నలుగురో విచిత్రంగా కళ్లద్దాలు పెట్టుకుని ఎగురుతుంటారు… అరటి ఆకులో భోజనం వడ్డిస్తున్నప్పుడు అందులో ‘ఖర్జూరాలు’ ఇతర డ్రైఫ్రూట్స్ ఉంటాయి… “పొంగల్ పండగకి ఖర్జూరాలకు సంబంధం ఏంటి? ఇది రంజాన్ అనుకున్నారా?” అంటూ విమర్శలు వస్తున్నాయి తాజాగా…

ప్రకటనలో నటించిన మహిళల నుదుట బొట్టు (Bindi) లేకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు…  సంప్రదాయబద్ధంగా కాకుండా, ప్లాస్టిక్ బంతి పూలు పెట్టుకోవడం, చిల్లర వేషధారణ అనే విమర్శలు వస్తున్నాయి… ప్రస్తుతం ఈ ప్రకటనపై వస్తున్న వ్యతిరేకత కారణంగా సోషల్ మీడియాలో #BoycottLenskart  అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది… సంప్రదాయాలను కించపరిచేలా లేదా తప్పుగా చూపేలా ఈ యాడ్ ఉందని నెటిజన్ల వాదన… అఫ్‌కోర్స్, ఇదీ పాత యాడ్… 2025 బాపతు…

ఎహె, ఫుడ్‌కు మతం ఉంటుందా అని కొందరు కౌంటర్ చేస్తున్నా సరే, నిజానికి సంక్రాంతి భోజనంలో ఖర్జూరాలు ఏమిటని మరికొందరు రీకౌంటర్లు వదులుతున్నారు…



Anything can be distorted under the label “Cool”, even culture and tradition. Lenskart's Pongal Ad. pic.twitter.com/amL5dWNBgo

— Arshdeep Singh Saini (@the_lama_singh) April 17, 2026



లెన్స్‌కార్ట్ (Lenskart Solutions Ltd) ఇటీవలే ఐపీఓ (IPO) ద్వారా భారీగా నిధులను సేకరించింది…

  • ఐపీఓ సమయం…: లెన్స్‌కార్ట్ తన ఐపీఓను అక్టోబర్ 31, 2025 నుండి నవంబర్ 4, 2025 వరకు నిర్వహించింది…

  • సేకరించిన మొత్తం…: ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం ₹7,278 కోట్లను సేకరించింది… ఇందులో ₹2,150 కోట్లు కొత్త షేర్ల జారీ (Fresh Issue) ద్వారా సేకరించగా, మిగిలిన మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా సేకరించారు…

  • లిస్టింగ్…: నవంబర్ 10, 2025న స్టాక్ మార్కెట్ (NSE & BSE)లో ఈ కంపెనీ షేర్లు లిస్ట్ అయ్యాయి…

  • స్పందన…: ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి భారీ స్పందన లభించింది… మొత్తం మీద ఇది సుమారు 28 రెట్లు సబ్-స్క్రైబ్ అయ్యింది…

  • ప్రస్తుత స్థితి…: ఏప్రిల్ 2026 నాటికి ఈ షేరు మార్కెట్లో చురుగ్గా ట్రేడ్ అవుతోంది… తాజా వివాదాల ప్రభావం షేరు ధరపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణపై విషం కాదురా తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమిరా…
  • సంక్రాంతి విందులో ఖర్జూరాలు..! మరో వివాదంలో లెన్స్‌కార్ట్..!!
  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?
  • ఈ ఇద్దరు… మొన్న బ్లాక్ బస్టర్స్… నిన్న ఫ్లాప్ షో…
  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions