Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో బొట్టు, నో మణికట్టు పట్టీలు, నో సిందూరం… లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటంటే..?

April 17, 2026 by M S R

.

బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్ అనే హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందని అడిగారు ఎవరో… అక్కడక్కడా సోషల్ మీడియా పోస్టులు కూడా దీన్ని ప్రస్తావిస్తున్నాయి కానీ, సరిగ్గా వివరాలు లేవు… నిజానికి లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటి..? తాజాగా రచయిత్రి, కార్యకర్త షెఫాలీ వైద్య, లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడిని ట్యాగ్ చేస్తూ Xలో ఒక పోస్ట్ో పెట్టింది…

ఏమనీ అంటే..? ‘‘అయ్యా, మీ షోరూమ్స్‌లో పాటించాల్సిన డ్రెస్ కోడ్ గురించిన ఇంటర్నల్ డాక్యుమెంట్లలో మీరు ‘హిజాబ్ ధరించవచ్చుగానీ, తిలకం వద్దని, మణికట్టు పట్టీలు, దారాలు గానీ వద్దని ఎందుకు రాసి ఉందో చెప్పగలరా..?’’

Ads

ఇది కాస్తా వివాదాన్ని రేపింది… హిందూ యువతుల సిందూరం, బొట్టు, తిలకం, మణికట్టు పట్టీలు ఉండకూడదు గానీ, హిజాబ్ వరకూ అనుమతిస్తున్నట్టుగా ఆ గ్రూమింగ్ పాలసీ డాక్యుమెంట్ చెప్పడం వివాద కారణం… బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగులో వచ్చింది దీంతో…

అసలే కంపెనీ లాభాల బలుపులో ఉంది ఇప్పుడు… ఐపీఓ తరువాత షేర్ ధర 547కు చేరింది… ఒక త్రైమాసికంలో 70 రెట్ల లాభాలు… నికరలాభం ఏడాది క్రితం కేవలం 18.5 బిలియన్లు కాగా అదిప్పుడు 1.31 బిలియన్లకు ఎగబాకింది… ఆదాయం 38.8 శాతం పెరుగుదల సూచిస్తోంది… కానీ ఎప్పుడైతే ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్ బయటికి వచ్చిందో నెట్‌లో కంపెనీ పట్ల ఫుల్ నెగెటివిటీ మొదలైంది…

lenskart

దీంతో కంపెనీ ఫౌండర్, సీఈవో పీయూష్ బన్సల్ వివరణ ఇవ్వడానికి పూనుకున్నాడు… ‘‘వైరల్ అవుతున్న ఆ డాక్యుమెంట్ చాలా పాతది (Outdated), అది ప్రస్తుత కంపెనీ పాలసీ కాదు… అందులో బిందీ, తిలకం గురించి ఉన్న లైన్లు తప్పే, అవి మన విలువలను సూచించవు… ఆ పత్రంలోని తప్పులను నేను ముందే గమనించి ఉండాల్సింది, ఆ పొరపాటుకు నేనే బాధ్యత వహిస్తున్నాను…” అని చెప్పుకొచ్చాడు…

లెన్స్‌కార్ట్‌లో ఎవరి మతపరమైన ఆచారాలపైనా ఆంక్షలు లేవని, తమ ఉద్యోగులు స్వేచ్ఛగా తమ సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను ధరించవచ్చని వివరణ ఇచ్చాడు… అంటే ఒకరకంగా పాత డాక్యుమెంట్ అయినా సరే, డ్రెస్ కోడ్‌లో వివక్షను అంగీకరించినట్టే… క్షమాపణ చెప్పినా సరే, సంస్థలో అంతర్గత సర్క్యులర్లు, డాక్యుమెంట్లపై తనకు అసలు ఏమాత్రం అవగాహన లేదనీ, అంతా హెచ్ఆర్ కనుసన్నల్లో సాగుతోందనీ అర్థమవుతోంది…

హైదరాబాద్ ఎంపీగా పోటీచేసిన మాధవీలత ఏదో మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్‌లో ప్రార్థన చేస్తే అదీ వివాదం చేశారు… కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో కూడా ప్రేయర్ రూమ్స్‌లోకి హిందువులను రానివ్వడం లేదని మరో వివాదం… లవ్ జిహాద్ దగ్గర నుంచి ప్రార్థనల దాకా… హిందూ మహిళలే అందరికీ అలుసు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions