Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంప్ స్వయంగా అమెరికా డాలర్‌కు చేస్తున్న ద్రోహం… ఇదీ కథ…

January 24, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….. RBI వ్యూహాత్మక మలుపు… డాలర్ నుంచి బంగారం వైపు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన విదేశీ మారక నిల్వల (Forex Reserves) వ్యూహాన్ని స్పష్టంగా మార్చుతోంది…

డానిష్, స్వీడిష్ పెన్షన్ ఫండ్లు అమెరికా ట్రెజరీ నుండి తన పెట్టుబడులు ఉపసంహరించటం మొదలు పెట్టాయి. భారత్‌లో బంగారం ధరలు ఎందుకు పెరిగాయి, పెరగొచ్చు అని కూడా చెప్పుకుంటూనే ఉన్నాం.

Ads

RBI ఎందుకు అమెరికా ట్రెజరీ బాండ్లను తగ్గిస్తోంది?
1️⃣ రిస్క్ డైవర్సిఫికేషన్ (Risk Diversification)
ఇప్పటివరకు భారత్ ఫారెక్స్ రిజర్వుల్లో పెద్ద భాగం, అమెరికా ట్రెజరీ బాండ్లలోనే ఉండేది. కానీ అమెరికా రాజకీయ అస్థిరత, ట్రేడ్ వార్స్, టారిఫ్‌లు, ఆంక్షలు (Sanctions) వల్ల డాలర్‌పై అధిక ఆధారం ప్రమాదకరం అన్న భావన బలపడింది. అందుకే RBI ఒకే కరెన్సీపై ఆధారం తగ్గిస్తోంది.

2️⃣ బంగారం ఎందుకు కీలకం అయింది?
బంగారం ప్రత్యేకతలు ఎవరి కంట్రోల్‌లో ఉండదు, సాంక్షన్లతో ఫ్రీజ్ చేయలేరు, సంక్షోభ సమయంలో విలువ నిలుపుకుంటుంది. అందుకే డాలర్‌కు ప్రత్యామ్నాయ రక్షణగా బంగారం.
– భారత నిల్వల్లో 2020లో బంగారం వాటా ~9%, ఇప్పుడు ~13.6%. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి.

డాలర్ బలహీనత… బంగారం ఆకాశమే హద్దు!
ప్రపంచ మార్కెట్లలో బంగారం చరిత్ర సృష్టిస్తోంది.
ఒక్క ఔన్స్ బంగారం ధర $5,000కి దగ్గరగా చేరింది
(≈ ₹4.15 లక్షలు | 1 oz = 31.1 గ్రాములు)

తాజా రికార్డులు
స్పాట్ గోల్డ్: $4,967 (≈ ₹4.12 లక్షలు)
వెండి: $100కి చేరువ (≈ ₹8,300 / కిలో)

3️⃣ రూపాయి రక్షణలో RBI పాత్ర
ఇటీవలి కాలంలో అమెరికా టారిఫ్ బెదిరింపులు, ట్రేడ్ డీల్ ఆలస్యాలు రూపాయిపై ఒత్తిడి కొంత పెరిగింది. RBI US బాండ్లు విక్రయించి వచ్చిన డాలర్లతో మార్కెట్లో జోక్యం, రూపాయి పతనం నియంత్రణ. అదే సమయంలో బంగారం కొనుగోలు = డబుల్ ప్రొటెక్షన్.

4️⃣ భారత్ “16 రోజుల్లో $16 బిలియన్ అమ్మకం” అంటే ఏమిటి?
ఇది చాలా పెద్ద సంకేతం. సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు నెమ్మదిగా మార్పులు చేస్తాయి. కానీ ఇక్కడ వేగంగా, నిర్ణయాత్మకంగా, స్పష్టమైన మెసేజ్‌తో అమెరికా ట్రెజరీల నుంచి బయటకు రావడం కనిపిస్తోంది. ఇది అమెరికాకి కూడా గట్టి సంకేతమే.

5️⃣ అందుకే అమెరికా అంబాసిడర్ RBI గవర్నర్‌ని కలిశారా?
డిప్లొమాటిక్‌గా చూస్తే ఇది సాధారణ భేటీ.
కానీ టైమింగ్ చాలా కీలకం . భారీ బాండ్ విక్రయం, డాలర్ డిమాండ్ తగ్గింపు, బంగారం వైపు మళ్లింపు, ఇవన్నీ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్‌కు ఇబ్బందికరమైన సంకేతాలు. అందుకే “చర్చలు” అవసరమయ్యాయి.

6️⃣ ఇది New World Order (NWO)కి సూచనా?
సూటిగా చెప్పాలంటే — అవును, ఒక దశ.

 గ్లోబల్ ట్రెండ్: భారత్ తో పాటు చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, సౌదీ అరేబియా, యూరప్ యూనియన్ దేశాలు ఇలా చాలా దేశాలు చేస్తున్న పని ఒక్కటే డాలర్ ఆధిపత్యం తగ్గించడం. బంగారం + స్థానిక కరెన్సీలకు ప్రాధాన్యం. ఇది మల్టీ-పోలార్ ఫైనాన్షియల్ వరల్డ్ దిశగా అడుగు.

అమెరికా లోపలే బాండ్ భయం!
ఇది కేవలం భారత్ కథ కాదు
Goldman Sachs సుమారు $847 బిలియన్ US బాండ్లు విక్రయం
Bank of America, J.P. Morgan తమ ట్రెజరీ హోల్డింగ్స్ తగ్గింపు, అమెరికన్ మెగా బ్యాంకులే US బాండ్లను వదులుతున్నాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు.

 US బాండ్ మార్కెట్ పతన భయం ఎందుకు?
🔴 అమెరికా భారీ ఋణ భారం
🔴 వడ్డీ రేట్ల ఒత్తిడి
🔴 ఇన్వెస్టర్ నమ్మకం తగ్గడం
🔴 గ్లోబల్ జియోపాలిటికల్ అస్థిరత
అందుకే బాండ్ హోల్డర్లు ముందే జాగ్రత్త పడుతున్నారు

 ముగింపు… RBI చర్యలు….
ఆర్థికంగా జాగ్రత్త
వ్యూహాత్మకంగా బలమైనవి
రాజకీయంగా సైలెంట్ కానీ పవర్‌ఫుల్
భారత్ ఇక “డాలర్‌పై ఆధారపడే దేశం” కాదు
స్వతంత్ర ఆర్థిక వ్యూహం ఉన్న దేశం.అందుకే పడే పడే రూపాయి వాల్యూ తగ్గుతోంది అని కంగారు పడాల్సిన పని లేదు…. — ఉపద్రష్ట పార్ధసారధి

#PardhaTalks #Economy #Geopolitics #RBI #ForexReserves #GoldReserves #USDollar #NWO #IndiaEconomy

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పక్కా డబుల్ స్టాండర్డ్స్…! ఫోన్ ట్యాపింగు అరాచకానికి విఫల సమర్థన..!!
  • ట్రంప్ స్వయంగా అమెరికా డాలర్‌కు చేస్తున్న ద్రోహం… ఇదీ కథ…
  • విచిత్ర సోదరులు..! సినిమా ప్రయోగాలకు 2 పేర్లు… సింగీతం, కమల్‌హాసన్..!!
  • చీకటిలో…! అక్కినేని శోభిత చుట్టూ ఓ మల్లెపూల కిల్లర్ కథ…!!
  • బోర్డర్-2…. ఆత్మ తక్కువ – అరుపులు ఎక్కువ… ఐనా హిట్టే… ఎందుకు..?
  • ‘ఒరే అబ్బాయ్… కొడుక్కి తండ్రి పెట్టిన ఖర్చుకు రికవరీ ఏముంటుందిరా…’
  • కేవలం పోలీసులు విచారిస్తున్నారు సారూ… తీర్పు చెప్పడం లేదు…
  • ఆహా… ఏం ప్రేమ కథరా బాబూ..! శిక్షిస్తున్నామా..? దీవిస్తున్నామా..?
  • కొందరిని మరిచిపోలేం… తరచూ గుర్తొస్తుంటారు… కళ్లు చెమ్మగిల్లజేస్తూ…
  • ట్రంపుతో పుతిన్ ఆట… ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై ‘షరతులు వర్తించును’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions