.
ముందుగా ఓ వార్త చదవండి… ఇలాంటివి నమస్తే తెలంగాణలోనే కదా కనిపించేవి… సరే, వార్త సారాంశం ఏమిటంటే..?
‘‘శీర్షిక… ఇంటింటికీ టెట్రా మద్యం… ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడ… కర్నాటక తరహాలో టెట్రా ప్యాకుల్లో మద్యం… 60 (పెగ్), 90 (పెగ్గున్నర), 180 (క్వార్టర్) ఎంఎల్ ప్యాకులు… అనుమతి లాంఛనమే…
Ads
ఫ్రూటీ టెట్రా ప్యాకుల తరహాలో ఉంటే ఈజీగా జేబుల్లో పెట్టుకుని వెళ్తారు, పేద, మధ్యతరగతిని టార్గెట్ చేసే ఈ కొత్త విధానం ద్వారా జనం మరింత మందు తాగి, ఖజానాకు డబ్బు సమకూరుస్తారు…
గత ఏడాది తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఈ ప్రయోగం చేయబోయి, జనవ్యతిరేకతతో వెనక్కి తగ్గాయి… కర్నాటకలో 90, 180 ఎంఎల్ మాత్రమే ఇలా టెట్రా ప్యాకుల్లో దొరుకుతాయి… రేవంత్ రెడ్డి 60 ఎంఎల్ కూడా తీసుకొస్తాడు…’’
ఇదండీ సదరు వార్త సారాంశం… కొన్ని అంశాలు చెప్పుకుందాం… మరీ నమస్తే తెలంగాణ ప్రొఫెషనల్ జర్నలిజం స్థాయి ఎవరూ అందుకోలేనంత ఎత్తులో తిరుగుతూ ఉంటుందని తెలుసు కదా…
మద్యాన్ని టెట్రా ప్యాకుల్లో తీసుకొస్తే అది ఇంటింటికీ మద్యం చేరవేసినట్టు అవుతుందా..? రేషన్ సరుకులే షాపుకి వెళ్లి తీసుకోవాలి… మరి ఇంటింటికీ మద్యం ఎలా చేరుతుందో, ఎవరు చేరవేస్తారో ఆ పత్రికే చెప్పాలి…
వోకే, మందు తాగేవాడు తీసుకుపోతాడు అనుకుందాం… ఇంటి దగ్గర తాగడానికి అనుమతి ఉన్నవాడు, ఎప్పుడైనా ఇంట్లోనే తాగుతాడు కదా… వాడికి గాజు సీసా అయితే ఏంటి… ప్లాస్టిక్ సీసా అయితే ఏంటి… టెట్రా అయితే ఏంటి..? కొత్తగా వచ్చే మార్పేమిటో మరి…
నిజానికి ఇప్పటికే తెలంగాణలో 90 ఎంఎల్ ప్లాస్టిక్ సీసాలు కూడా దొరుకుతున్నాయి… అదీ చీప్ లిక్కర్ అనే కాదు, బ్రాండెడ్ మద్యం కూడా… టెట్రా ప్యాకులైతే ఉత్పత్తి ఖర్చు తగ్గడం కాదు ఫాయిదా… కల్తీకి చాన్స్ తక్కువ అని కర్నాటక దాన్ని ఎంకరేజ్ చేసింది… పైగా బీహార్‌లో గత ఏడాది ప్రవేశపెట్టాలని అనుకున్నారని రాసుకొచ్చారు…
అయ్యా, బీహార్‌లో మద్యనిషేధం ఉంది మాస్టారూ… టెట్రా ప్యాకుల్లో మద్యం తీసుకొచ్చినా సరే, దాన్ని ఏ ఫ్రూటీ ప్యాక్ తాగినట్టో తాగలేరు కదా… రా, అంటే కచ్చా కొట్టేవాళ్లు మరీ తక్కువ… ఇక్కడే ఈ వార్తలో నవ్వొచ్చిన ఓ విశ్లేషణను చెప్పుకుందాం…
‘‘ఈ సబ్ హెడింగు పేరు 140 రూపాయలకే కడుపు నిండా మద్యం… ఇందులో రాసుకొచ్చిన లెక్క ఏమిటంటే… చీప్ లిక్కర్ క్వార్టర్ 120, టెట్రా తెస్తే 105 చాలు… సో, క్వార్టర్ మీద 15 మిగులుతాయి కదా, మరో 20 కలిపితే మరో పెగ్గు వస్తుంది… 5 రూపాయల నీళ్ల పాకెట్, 10 రూపాయల శెనిగెల ఖర్చు కలుపుకున్నా 140 రూపాయలకు కడుపు నిండా మద్యం తాగినట్టు అవుతుంది…’’
హహహ… 1) టెట్రాలో మద్యం అమ్మినంత మాత్రాన రేట్లు తగ్గించరు… 2) 15 మిగులుకు మరో 20 కలిపితే మరో పెగ్గు ప్యాక్ రాదు… 3) సరే, ఈ పెగ్గుకు 5 రూపాయల నీళ్ల పాకెట్, 10 రూపాయల శెనిగెలు అనీ లెక్క చెప్పారు సరే, క్వార్టర్ ప్లస్ పెగ్గుకు ఒక 5 రూపాయల ప్యాకెట్ లెక్క ఏమిటసలు..? పైగా ఈ 10 రూపాయల శెనిగెల మంచింగ్ లెక్క ఏమిటి..?
చీప్ లిక్కర్ తాగేవాడు ఆ లెక్క ప్రకారమే తాగాలి, ఆ మంచింగ్ విత్తులే తినాలి అని సూత్రీకరణ ఏమిటో… ఐనా క్వార్టర్ ప్లస్ పెగ్గు తాగితేనే కడుపు నిండినట్టా..? ఇదేం లెక్క..? ఏదో ఒకటి రాయడం, జనంలోకి వదలడం… మస్తు టాలెంటెడ్‌గా ఉన్నారే మీరు..!! అన్నట్టు, మందు తాగడాన్ని కడుపు నిండటం కోణంలో చూడరు, కిక్కెక్కిందా లేదా చూస్తారు… క్వార్టర్ ప్లస్ పెగ్గు తాగితేనే కిక్కు ఎక్కుతుందనే లెక్క ప్యూర్ అబ్సర్డ్..!!
Share this Article