మరో వివాదంలో సమంత… బండారం బయటపెట్టిన డాక్టర్… అని ఓ వార్త చూశాక సహజంగానే ఆసక్తి కలిగింది… అబ్బో, సమంత బండారం ఏమిటి..? ఎవరా డాక్టర్..? ఇంతకీ ఏం ద్రోహం చేసింది ఎవరికి..? అని వార్త ఓపెన్ చేస్తే… ఆ వార్త సారాంశం ఏమిటయ్యా అంటే…
ఆమె ఎవరో గెస్ట్ వెల్‌నెస్ కోచ్‌తో మాట్లాడుతూ కాలేయం ఆరోగ్యానికి ఉపయోగపడే ఓ మూలిక గురించి చర్చించింది… దాని పేరు Dandelion.,. తెలుగు పేరు నాకూ తెలియదు… సరే, ఆయనేదో చెప్పాడు, ఈమెకు 30 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు కదా… ఓ పాడ్‌కాస్ట్ ద్వారా దాన్ని షేర్ చేసుకుంది…
ఎంతమంది పాడ్‌కాస్ట్‌లు ఫాలో అవుతారో, వింటారో తెలియదు, ఎందరు వాటిని సీరియస్‌గా తీసుకుంటారో తెలియదు… యూట్యూబులో , హెల్త్ సైట్లలో కనిపించే అనేకానేక ఆరోగ్య సలహాల్లాగే అదీ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చింది… కానీ ఒకాయనకు బాగా కోపమొచ్చింది… ఆయన ఎక్స్ ఖాతా పేరు దిలివర్‌డాక్… హెపటాలజిస్టు, అంటే లివర్ డాక్టర్… ఆయుష్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాడట… అర్థం కాలేదా..?
Ads
ఆయుష్ అంటే ఆయుర్వేదం… ఈ అల్లోపతి, ఈ ఇంగ్లిషు డాక్టర్లు రాకముందు అదే భారత దేశంలో అమలులో ఉన్న వైద్యవిధానం… ఇప్పుడు దాన్ని నాన్సెన్స్ అని కొట్టేస్తున్నాడు ఈయన… చాలామంది అల్లోపతీ డాక్టర్లలాగే… అసలు హోమియో, ఆయుర్వేదం, యునాని, మూలికావైద్యం ఎట్సెట్రా ప్రజల్ని మోసగించే వైద్యవిధానాలు అన్నట్టుగా ఉంటాయి ఈయన పోస్టులు…
(ఆయన కవర్ ఫోటో ఇది… ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన ఏ పురాతన వైద్యవిధానమైనా సరే, వేస్ట్ అన్నట్టుగా…)
సమంత పాడ్‌కాస్ట్‌లో చెప్పిన మూలిక ఒక కలుపు మొక్క అట, దాన్ని సలాడ్‌లలో తీసుకుంటారట… అంతకుమించి దానికి ఏ ప్రయోజనమూ లేదట… ఈ లివర్ డాక్టర్ చెబుతున్నాడు… ఆమె కూడా ఆటో ఇమ్యూనిటీ వంటి ఏదో జబ్బుతో బాధపడింది, పడుతోంది కదా… పాత రోగి కొత్త డాక్టర్‌కన్నా మేలు అన్నట్టు తన జబ్బుకు చాలా చాలా సలహాలు తీసుకుని ఉంటుంది… పైగా ఆమె ఎవరో గెస్ట్‌తో చేసిన చిట్‌చాట్ షేర్ చేసుకుంది… ఆమే డాక్టర్ కాదు, ఆయనా డాక్టర్ కాదు… పాటించాలని కూడా చెప్పడం లేదు…
పతంజలి తరహాలో ఫలానా మందు ఫలానా వ్యాధిని తగ్గిస్తుందనే ప్రచారం కూడా కాదు… సరైన పరిశోధనలు, అభివృద్ధి లేక గానీ దేశీయ వైద్యవిధానాలు మోసం అనీ, ఆ డాక్టర్లను బంగాళాఖాతంలో విసిరేయాలి అన్నట్టు గొప్పలు పోయే వాళ్లకు కొదువ లేదు కదా… నో డౌట్, అల్లోపతి పరిశోధనలు, నిర్ధారణలు, ఫలితాలు గ్రేట్… ఐనంతమాత్రాన అల్లోపతి అన్ని జబ్బులకూ పరిష్కారాలు ఏమీ చూపదు…
అంతెందుకు..? చిన్న ఉదాహరణ… ప్లేట్‌లెట్లు ఘోరంగా పడిపోతే బొప్పాయి ఆకురసం పనిచేస్తుంది… ఆశ్చర్యపోయే రీతిలో… అలాంటి మందు అల్లోపతీలో లేదు… రక్తంలో హీమోగ్లోబిన్ దారుణంగా పడిపోతే బీట్‌రూట్ రసం అద్భుతంగా ఆ శాతాన్ని పెంచగలదు… రక్తమార్పిడి అవసరం లేదు… ఇలాంటివెన్నో… పైగా ఇక్కడ సమంత ఎవరినీ మోసం చేయడం లేదు… సదరు కాలేయ డాక్టర్ ఆమె ఏదో అర్జెంటుగా ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్నంత ఇదిగా పోస్టులు పెట్టి తెగడాల్సిన పనీ లేదు..!!
అవునూ… ఈయన కాలేయ డాక్టర్ కదా… జాండిస్ వస్తే సాధారణంగా డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసే లివ్52 టాబ్లెట్లు ఆయుద్వేద మందు కాదా… పల్లెల్లో బోలెడు మంది పత్యం చేయించి, మూలికావైద్యం చేసి తగ్గిస్తారు, ఆయనకు తెలుసో లేదో… దాన్ని కూడా ఖండఖండాలుగా ఖండిస్తాడేమో… మరి అల్లోపతీలో దానికి మందు ఉందా లివర్ డాక్టర్..?! కొంపదీసి ఇలాంటి డాక్టర్లు యాంటీ-ఆయుష్‌ను కూడా యాంటీ-హిందుత్వ క్యాంపెయిన్ అనుకుంటున్నారా..?!
Share this Article