Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సహజీవన మొగుళ్లూ… ఈ వార్త మీ కోసమే… జాగ్రత్త… సోలో బతుకే సో బెటరు…

April 27, 2026 by M S R

.

సహజీవనం… లైంగిక దాడి? హద్దులు మారుతున్న, మీరుతున్న బంధాలు… అయోమయంలో వివాహ వ్యవస్థ! మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య సంబంధాలు, పద్ధతులు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పవిత్రంగా భావించిన ‘వివాహం’ స్థానంలోకి ఇప్పుడు ‘సహజీవనం’ (Live-in Relationship) వచ్చి చేరింది. అయితే, ఇష్టపడి కలిసి ఉండటం వరకు బాగానే ఉన్నా.. ఆ బంధం విచ్ఛిన్నమైనప్పుడు అది కాస్తా కోర్టు మెట్లు ఎక్కి ‘లైంగిక దాడి’ కేసుగా మారుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తాజాగా ఒక కేసును విచారిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న) చేసిన వ్యాఖ్యలు సమాజం కళ్లను, కాదు, సహజీవన మొగుళ్ల కళ్లను తెరిపించేలా ఉన్నాయి. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి, బిడ్డను కూడా కన్నాక… విడిపోయే సమయంలో పురుషుడిపై లైంగిక దాడి కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది…

Ads

లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లోె ఉండి, పిల్లల్ని కూడా కని… తీరా ఏళ్లు గడిచాక, ఇప్పుడు భాగస్వామి మీద లైంగిక దాడి కేసు పెట్టడం ఏమిటని తాజాగా ఈ రోజులో ఓ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నించింది… లివ్ ఇన్ రిలేషన్ షిప్ నుంచి విడిపోవడం నేరం ఎలా అవుతుందని అడిగింది… అంతేకాదు, సంబంధం అక్రమం కావచ్చు, కానీ ఆ సంతానం అక్రమం కాదు కదా, కాకపోతే ఆ బిడ్డ కోసం భరణం అడగొచ్చు అని పిటిషన్‌దారుకు సూచించింది. విహిత పద్ధతుల్లో వివాహం జరిగి ఉంటే ఆమెకు కొన్ని హక్కులు, రక్షణ లభించి ఉండేవని అభిప్రాయపడింది…

చట్టం ఆయుధంగా మారుతోందా? నిజమైన బాధితులను రక్షించడానికి రూపొందించిన చట్టాలు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఆయుధాలుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

  • ఏళ్లుగా కలిసి ఉండి, అన్నింటికీ అంగీకరించి, కాపురం చేసి, చివరకు ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు’ అనడం ఎంతవరకు నైతికం?

  • వివాహేతర సంబంధాల కోసం, కామప్రకోపంతో ప్రియుళ్లతో కలిసి భర్తలను అంతమొందిస్తున్న ఉదంతాలు ఒకవైపు…

  • వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల దుర్వినియోగం మరోవైపు…

మగాళ్ల భయం.. పెళ్లికి దూరం! ఈ తరహా పరిణామాల వల్ల నేటి తరం యువకులు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. పెళ్లి చేసుకుంటే బాధ్యతల కంటే కేసుల గొడవలే ఎక్కువగా ఉంటాయన్న భయం వారిని వివాహ వ్యవస్థకు దూరం చేస్తోంది. ఒకప్పుడు కుటుంబం అంటే భరోసా.. కానీ ఇప్పుడు అది ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తుందో తెలియని అయోమయం.

చట్టబద్ధమైన వివాహం అంటే కట్నం వేధింపులు, గృహహింస కేసులు పెట్టేవాళ్లు… కానీ సహజీవనంలో ఆ చాన్స్ లేదని ఇక లైంగిక దాడి కేసులు పెడుతున్నారు… వివాహం, విడాకులయితే భరణం సమస్యలు, సహజీవనం జోలికి వెళ్తే, ఇదుగో ఇలాంటి కేసులు…

సహజీవనంలో పుట్టిన బిడ్డ అక్రమ సంతానం కాదని కోర్టు స్పష్టం చేసింది, అది మంచి పరిణామమే. కానీ, విడిపోయినప్పుడు లైంగిక దాడి ముద్ర వేయడం వల్ల చట్టం పవిత్రత దెబ్బతింటుంది. బంధాల్లో పారదర్శకత, ఒకరిపై ఒకరికి ఉండాల్సిన కనీస గౌరవం లోపిస్తున్న తరుణంలో.. చట్టాల కంటే మనుషుల మధ్య నైతిక విలువలే బంధాలను నిలబెట్టగలవు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions