Dr Cyriac Abby Philips… ఈయన ఓ హెపటాలజిస్ట్… అనగా కాలేయ వ్యాధుల్ని నయం చేసే డాక్టర్… ఈమధ్య పదే పదే వార్తల్లోకి వస్తున్నాడు… ప్రపంచంలో ఏ వైద్య విధానమైనా వేస్ట్, ఒక్క అల్లోపతీయే అల్టిమేట్ అనేది తన పాలసీ… ఎవరైనా సోషల్ మీడియాలో, మీడియాలో నోటికొచ్చిన వైద్య చిట్కాలు చెబితే ఇక వాళ్లపై ఎక్కేస్తాడు… తిట్టేస్తాడు, జైళ్లలో పెట్టాలి అంటాడు, ఆ చిట్కాలు ఎలా ప్రమాదకరమో శాస్త్రీయంగానే చెబుతాడు…
మరి సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, యూట్యూబుల్లో బోలెడుమంది రాస్తుంటారు కదా అంటారా..? అవును, అవన్నీ యథాతథంగా పాటిస్తే ప్రాణాంతకమే… వాటి జోలికి పోడు ఈ లివర్ డాక్టర్, ఎవరైనా సెలబ్రిటీలు గనుక ఏ ఇన్‌స్టాలోనో చిట్కాలు చెబితే ఇక ఊరుకోడు… అదేమిటయ్యా అంటే… వాళ్లకు లక్షల్లో ఫాలోయర్లుంటారు, వాళ్లకేమో ఏమీ తెలియదు, తోచిందేదో చెబుతారు, అసలే వీర ఫ్యాన్స్, పాటిస్తారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అంటాడు… ఆ కోణంలో నిజమే…
ఆమధ్య సమంత మొహానికి ఓ నెబ్యులైజర్ తగిలించుకుని వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు మందులు వాడటంకన్నా హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చుకుంటే సరి అని రాసుకొచ్చింది… దాంతో మండిపోయిన లివర్ డాక్టర్ ఆమెను జైలులో పెట్టాలి అని ట్వీటాడు… అంతకుముందు ఆమె ఎవరో గెస్ట్ వెల్‌నెస్ కోచ్‌తో మాట్లాడుతూ కాలేయం ఆరోగ్యానికి ఉపయోగపడే ఓ మూలిక గురించి చర్చించింది… దాని పేరు Dandelion.,. తెలుగు పేరు నాకూ తెలియదు…
Ads
అది సలాడ్లలో వేసుకోవడానికి తప్ప నయాపైసా ఫాయిదా లేదంటూ ఇదే డాక్టర్ విరుచుకుపడ్డాడు… ఖండిస్తే సరే గానీ మరీ జైలులో వేయడమనే కోరిక ఏమిటంటూ సమంత బాధపడింది… కానీ నయనతారకు కొంత ఎక్కువ టెంపర్‌మెంట్ కదా, మతిలేని మూర్ఖులతో వాదనలు వేస్ట్ అంటూ రీసెంటుగా తను పెట్టిన ఓ పోస్టును డిలిట్ చేసేసింది… ఐనాసరే, సదరు డాక్టర్ డిలిట్ కొట్టావు సరే గానీ క్షమాపణ చెప్పలేదేం అని మళ్లీ పోస్టాడు…
విషయం ఏమిటంటే..? ఆమె మందార పూలతో చేసిన టీ తాగండి అంటూ ఓ పోస్టు పెట్టింది… అందులో ఆమె ఈ టీలో ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అందుకని సుగర్, బీపీ రోగులకు బెటర్… అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధ అంశాలకూ మేలు… ఆనెలు వంటి చర్మ వ్యాధులకూ శ్రేష్టం… విటమిన్లు బాగుంటాయి కదా రోగనిరోధకశక్తినీ పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న కారణంగా ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకూ ఉపశమనం, మా మున్‌మున్ గనేరివాల్ చెప్పాడు అని రాసుకొచ్చింది… ఇదంతా ఆయుర్వేదంలో ఉందని చెప్పింది…
తన celebrity nutritionist ప్రచారం కోసం ఇదంతా రాసుకొచ్చింది తప్ప ఆయన ఓ gut microbiome specialist… ఆయుర్వేదం ఆయనకేం తెలుసు… పైగా నయనతార పోస్టులో ఉన్నవన్నీ అబద్ధాలే… ఏమీ ప్రూవ్ కాలేదు ప్రయోగాల్లో అంటాడు లివర్ డాక్టర్జ… దానికి సంబంధించిన ఆధారాలను కూడా తన సుదీర్ఘమైన పోస్టులో చెప్పుకొచ్చాడు… పురుషుల్లో టెస్టోస్టెరాన్ పెంచుతుందనే భ్రమలూ తప్పేనని అంటాడు…
వైద్య నయనతార అని వ్యంగ్యంగా ఎక్కడో ప్రస్తావించాడు… ఇదంతా రచ్చ అవుతుండేసరికి నయనతార సింపుల్‌గా తన పోస్టు డిలిట్ కొట్టేసి, తెలివితక్కువ వాళ్లతో వాదించొద్దు అని రాసింది… లివర్ డాక్టర్ పేరు తీసుకోకపోయినా ఆమె ఆ డాక్టర్‌ను నిందించడమే అని ఈజీగా అర్థమవుతోంది… తను చేసిందే ఓ తప్పు… శాస్త్రీయంగా ఏ ఆధారాలు, ప్రయోగ ఫలితాలూ లేని ఓ చిట్కా రాసేసి, ఎవరో ఒకరు శాస్త్రీయంగా అదంతా అబద్ధం అని వాదిస్తే… అది తెలివితక్కువతనం అవుతుందా..? లేక ఆ వైద్య చిట్కాయే తెలివితక్కువతనం అవుతుందా నయనతారా..?!
Share this Article