మొదట్లో కాస్త కామెడీ చేస్తూ, ఎంటర్టెయిన్ చేస్తూ హౌజులో సందడి చేసేవాడు లోబో… మిగతా అందరూ సీరియస్ కేరక్టర్లు, ఇగోయిస్టిక్ నేచర్ కనబడేది… అందరినీ టచ్ చేస్తూ, టీజ్ చేస్తూ సరదాగా కనిపించేవాడు… ఏమైందో ఏమిటో ఒక్కసారిగా లోబో డల్ అయిపోయాడు… కొన్నిసార్లు చిరాకెత్తేలా వ్యవహరించడం మొదలుపెట్టాడు… అరవడం, కేకలు, అనూహ్య ధోరణి… ప్రేక్షకులకు కూడా చిర్రెత్తింది… అనుకోకుండా ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ వచ్చాడు… కానీ ఈసారి ఇక తప్పలేదు, సూట్ కేసు సర్దుకున్నాడు… (నిజానికి ఈసారి దీపావళి ఈవెంట్ పేరిట పాత బిగ్బాస్ కేరక్టర్లను తీసుకొచ్చి ప్రత్యేకంగా షూట్ చేశారు… ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారు… కానీ..?)
(photo : TOI)…… నిజానికి వేరే సమాచారం వస్తోంది… ఓటింగ్ లో సిరి, లోబో ఇద్దరూ సేమ్ అట… కానీ ఇప్పటికే వరుసగా ఆడ లేడీస్ అందర్నీ వరుసగా ఎలిమినేట్ చేస్తున్నారు… ఒక్క నటరాజ మాస్టర్ తప్ప ఎలిమినేట్ అయిన వాళ్లంతా లేడీస్… ఈ స్థితిలో సిరిని కూడా ఎలిమినేట్ చేస్తే జనం థూ కొడతారని భయపడి లోబో మీద వేటు వేశారట… ఇద్దరూ ఇద్దరే… అసలే షణ్ముఖ ఒక హోప్ లెస్ పాత్ర, తనకు తోడు జెస్సీ… వాళ్ళతో కూడి తనకంటూ ఒక గేమ్ ప్లాన్ లేకుండా, స్ట్రాటజీ లేకుండా అడ్డదిడ్డంగా పోతోంది ఆమె… విసుగెత్తిస్తోంది… (షణ్ముఖ కు బయట ఒక లవర్ ఉంది, సిరికి సేమ్… సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి పొందిన విషయమే… మరి ఆ “లవ్ ట్రాక్” ఏమిటి..? ఇది వాళ్ళిద్దరికీ మైనస్ అవుతోంది…) ఇక మరో సిగ్గులేని ఎపిసోడ్ చెప్పుకోవాలి…
Ads
ఆనీ మాస్టర్ ను ఉద్దేశించి సన్నీ నార్త్ ఇండియన్ అని కామెంటడం చిల్లరతనం… ఈమధ్య మరీ వైల్డ్ గా, ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాడు… మీదిమీదికి పోతాడు… బెదిరిస్తాడు… ఆమె నార్త్ ఇండియన్ అయితే ఏమిటట..? అది అనర్హతా..? సన్నీ ఎవరు డిసైడ్ చేయడానికి..? ఇంకా నయం, చైనీస్ అని తిట్టలేదు ఆమెను…! బిగ్ బాస్ టీమ్ ఎందుకు కంట్రోల్ చేయదు సన్నీని..? నిజానికి ఆమె ఫ్యామిలీ రూట్స్ మేఘాలయ… ఆమె పక్కా హైదరాబాదీ… ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, చదివింది… ఫిలిం ఇండస్ట్రీలో ఉపాధి పొందుతోంది… ఆమె స్థానికతను హౌజ్ లో డిబేట్ కు పెట్టడం సన్నీ తెలివితక్కువతనమే… కానీ దాన్ని అలాగే టీవీలో ప్రసారం చేయడం ఏమిటి..? బిగ్ బాస్ టీమ్ బుద్దిరాహిత్యం..!!
Share this Article