ఎందుకో గానీ… నారా లోకేష్‌ను చూస్తుంటే… పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి, అకస్మాత్తుగా సుప్రీం స్టార్, సూపర్ హీరో అయిపోవాలనుకునే వారస హీరోలు గుర్తొస్తారు… నటనలో బేసిక్స్ తెలియకుండానే తెర మీదకు వచ్చి వీరంగం వేసి, ప్రేక్షకుల మెదళ్లు తినే బ్యాచు అన్నమాట… ఆ హీరోలు అప్పుడప్పుడూ చెబుతుంటారు… బ్యాక్ గ్రౌండ్ కేవలం ఎంట్రీకి, ఇంట్రడక్షన్ వరకే, మిగతాది మా మెరిటే అని… మెరిట్ అంటే ఏమీ లేదు, నాలుగు పిచ్చి గెంతులు, తిక్క ఫైట్లు… అంతకు మించి వాళ్లకేమీ తెలియదు… లోకేష్ బాబు సారు గారు కూడా వాళ్లనే ఆదర్శంగా తీసుకున్నాడో, లేక చంద్రబాబు దురదృష్టమో ఏమో గానీ… లోకేష్ తను ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయ తెరపై వెలిగిపోవాలని అనుకోవడమే తప్ప, దానికి కనీస శ్రమ కూడా తీసుకోవడం లేదు… అధ్యయనం లేదు, తను లీడర్‌గా ఎస్టాబ్లిష్ కావడానికి చంద్రబాబు మార్క్ తెలుగుదేశం వారసత్వం చాలు అనే భ్రమలోనే ఉన్నాడు ఫాఫం… గతంలో చాలాసార్లు నిరూపించుకున్నాడు… ఈరోజుకూ అంతే…
అప్పుడెప్పుడో తెలుగుదేశం పుట్టకముందే… విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకున్నది తెలుగుదేశమే అంటాడు… జనం నవ్వుతారనే సోయి కూడా లేకపాయె.,. వాజపేయి హయాంలో అడ్డుకున్నదీ మేమే అంటాడు… మరి లోకేష్ బాబు బాబు చంద్రబాబు గారు విదేశాలకు వెళ్లినప్పుడు ఇదే పోస్కో వాళ్లు ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో పోస్కో టీం చంద్రబాబును ఎందుకు కలిసింది..? పోనీ, 2019లో కేంద్రం ఓ ప్రైవేటీకరణ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ బాబు, లోకేష్ బాబు ఎటుపోయారు..? జగన్‌ను కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? జగన్ దుర్మార్గుడే, మోడీ ప్రపంచస్థాయి దుర్మార్గుడే… కానీ తమరు, తమ బాబు గారు విశాఖ స్టీల్‌పై మాట్లాడింది ఎక్కడ..? ఎప్పుడు..?
Ads
నిర్వేదంతో నవ్వుకోవడమే… త్రిపుర సీఎం విప్లవ దేవుడికీ లోకేషుడికీ పెద్ద తేడా ఏమీ కనిపించదు… కాకపోతే ఆ దేవుడికి వారసత్వం లేదు, ఈ దేవుడికి బ్యాక్ గ్రౌండ్ ఉంది… కానీ వాడుకోడు… తన మామ బాలయ్యలాగే… ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… అప్పట్లో పెద్ది రామారావు అనబడే ఓ పెద్దమనిషి లోకేషుడికి భాషను, ప్రసంగాలను నేర్పించేవాడని విన్నాం, చదివాం… ఇప్పుడాయన ఆ కొలువులో ఉన్నాడో లేదో తెలియదు, కానీ లోకేషుడిలో పరిణతి మాత్రం వీసమెత్తు కూడా కనిపించడం లేదు… లోకేషుడి వ్యాఖ్యలు చదివాక ఒకాయన వ్యంగ్యంగా ఇలా రాసుకొచ్చాడు,,, ‘‘నాడు స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం… ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు పలికింది తెలుగుదేశం… క్విట్ ఇండియాను జనంలోకి తీసుకెళ్లింది తెలుగుదేశం…’’ కాస్త వ్యంగ్యం ఎక్కువైనా సరే, లోకేష్ బాబుకు ఆప్ట్ అనిపించింది… తను మారడు… జగన్‌కు అదే ప్రధాన బలం…!!
Share this Article