.
చంద్రబాబు రాజకీయ వారసుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ గతంలో నానా విమర్శలకు, వెక్కిరింపులకు గురైన లోకేష్ కాదు ఇప్పుడు…
తన భాష, తన బాడీ లాంగ్వేజీ, తన వ్యవహార శైలి… చాలా డిఫరెంటుగా కనిపిస్తోంది… పరిణతి కనిపిస్తోంది… తనకు ఓ మంచి టీమ్ ఉన్నట్టుంది… లోకేష్ ఇమేజ్ బిల్డింగులో ఆ టీమ్ సక్సెసవుతున్నట్టే ఉంది…
Ads
తను మీడియాను ఫేస్ చేస్తున్నాడు… తన ప్రసంగ శైలి మారింది… అన్నింటికీ మించి అనేకానేక ప్రభుత్వ వ్యవహరాల్లో, పార్టీ వ్యవహారాల్లో చాలా యాక్టివ్ అయిపోయాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే తను యాక్టివ్ సీఎం…
ఇది నెగెటివ్‌గా చూడనక్కర్లేదు… ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే… టీడీపీ రాజకీయ వారసుడు లోకేషే… కనుచూపు మేరలో మరొకరు లేరు, ఉండరు, చంద్రబాబు ఉండనివ్వడు… ఇదేమైనా కుటుంబ వ్యవహారమా అనే ప్రశ్నకు తావులేదు… ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు కుటుంబ వ్యవహారమే…
కేసీయార్‌కు కేటీయార్… వైఎస్‌కు జగన్… చంద్రబాబుకు లోకేష్… రాజకీయ వారసత్వం దేశమంతా అలాగే ఉంది కదా… లెఫ్ట్, రైట్ పార్టీలు తప్ప… సరే, తన టీమ్‌ను ఎందుకు మెచ్చుకోవాలీ అంటే… మొన్న మెగా టీచర్ పేరెంట్ మీటింగు సందర్భంగా తను ప్రసంగంలోని కొన్ని అంశాలు… ఆశ్చర్యకరం…
ఒక పొలిటిషియన్… అదీ వర్ధమాన పొలిటిషియన్… ప్రసంగంలో ఆ అంశాలు ఏమిటంటే… “సమాజంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి… ఇందులో మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవ్వాలి… మనం ఇంట్లో కొన్ని పదాలు వాడతాం…
“గాజులు తొడుక్కున్నావా?”, “చీర కట్టుకున్నావా?” “అమ్మాయిలాగా ఏడవకు”… దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు…” ఇదీ తను అన్నది… తాను విద్యా శాఖ మంత్రి అయ్యాక ఒకటి రెండు తరగతుల పాఠ్య పుస్తకాల్లో ఇంటి పనులకు సంబంధించిన బొమ్మల్లో మగవాళ్లు కూడా ఇంటి పనులు చేస్తున్నట్లు చూపించామని అన్నాడాయన…
గుడ్… రాజకీయ నాయకుల నుంచి ఇలాంటి సెన్సిటివ్, ప్రొగ్రెసివ్…. అదీ బూతులు, కక్షలు, కేసులు, దాడులు తప్ప మరేమీ ఆశించలేని ఏపీ రాజకీయాల్లో ఓ నాయకుడి నోటి నుంచి ఇలాంటి మాటలు… గుడ్…
వర్తమాన ఏపీ రాజకీయాలలో విమర్శ పేరుతో స్త్రీలని కించపరిచే మాటలు, బూతులు సాధారణమైపోయాయి కదా… సమాజంలో ఏ పార్శ్వంలోనూ లేనంత లింగ వివక్ష, అసభ్యత సినిమాల తరువాత రాజకీయాల్లోనే కనబడుతుంది… సినిమా హీరోలకే కాదు, రాజకీయ నాయకులకూ డై హార్డ్ ఫాన్స్ వుంటారు…
వాళ్ల భాష, నడవడిక ప్రభావం ఆయా పార్టీల కేడర్ మీద, సాధారణ ప్రజల మీద వుంటుంది… టీడీపీతో పోలిస్తే వైసీపీ వాళ్లు నాలుగు ఆకులు ఎక్కువ చదివి వుండొచ్చు కానీ ఏపీలో హెచ్చు తగ్గుల తేడాతో రెండు పార్టీలకు చెందిన నాయకుల భాష అభ్యంతరకరంగానే వుందనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి…
ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ ఒక పాజిటివ్ జెండర్ చైతన్యంతో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మంచి మార్పు కోసం ఒక పొలిటీషియన్ గా పిలుపునివ్వడం అభినందించదగ్గ విషయం…. (ఫేస్‌బుక్‌లో మిత్రుడు అరణ్యకృష్ణ పోస్టు నుంచి కొన్ని ఇన్‌పుట్స్ ఆధారంగా...)
Share this Article