.
నిన్న మరణించిన ఎస్ఎంకృష్ణ జీవితం ఓసారి చదవాల్సిన విశేషమే…
92 ఏళ్లు బతికిన ఆయనకు పెద్దగా శత్రువులు లేరు,.. అంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా సరే, అయినవాడే అందరికీ అన్నట్టుగా మెలిగాడు,..
Ads
బ్రాండ్ బెంగుళూరు… నిజం, బెంగుళూరును మరో సిలికాన్ వ్యాలీని చేసి, ఓ విశ్వనగరం కావడానికి ఆయన వేసిన పునాదులే కారణం…
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి, స్పీకర్, ముఖ్యమంత్రి, లోకసభ, రాజ్యసభ, కేంద్ర మంత్రి, గవర్నర్… వాట్ నాట్..? మన రాజకీయ వ్యవస్థలోని అన్ని పదవులనూ… ప్రధాని, రాష్ట్రపతి మినహా… అనుభవించిన వ్యక్తి… పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత…
తండ్రి రెండు దశాబ్దాలపాటు ఎమ్మెల్యే… ఆ రాజకీయ కుటుంబంలో పుట్టిన కృష్ణ ఇక్కడే లా చదివి, అమెరికా వెళ్లి మాస్టర్స్ చేశాడు న్యాయవిద్యలోనే… ఆ సమయంలోనే కెనెడీ కోసం ప్రచారం చేశాడు… ఇండియన్- అమెరికన్ వోట్లు పొందడానికి సాయం చేశాడు… కెనెడీ ఆత్మీయవర్గంలో చేరిపోయాడు…
ఇండియాకు తిరిగి వచ్చాక ఇక రాజకీయాల్లో వెనుతిరిగి చూసిందే లేదు… అనేక పదవులు… ఏదో కొద్దికాలం ప్రజాసోషలిస్టు పార్టీలో సభ్యత్వం… కానీ 45 ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే… తరువాత ఆమధ్య బీజేపీలో చేరాడు గానీ యాక్టివ్‌గా లేడు అప్పటికే…
టెన్నిస్ అంటే మహా పిచ్చి… కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్, వాలీబాల్ తదతర ఆటలన్నీ ఆడినా తనకు టెన్నిసే అమిత ఇష్టం… సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు టెన్నిస్ బ్యాట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టుకు వెళ్లిపోయేవాడు నేరుగా… బెంగుళూరును విశ్వ టెన్నిస్ చిత్రపటంలో నిలపాలని కోరుకునేవాడు…
ప్రస్తుతం కర్నాటక రాజకీయాలను… ఎఐసీసీ రాజకీయాలను కూడా దాదాపు నిర్దేశించే స్థితిలో ఉన్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఎస్ఎం కృష్ణకు రాజకీయ శిష్యుడే… ఇద్దరి నడుమ మంచి సంబంధాలు ఉండేవి… కృష్ణ 2017లో బీజేపీలో చేరినా అలాగే కొనసాగాయి కూడా… అంతేకాదు…
కృష్ణ బిడ్డ మాళవిక… ఆమె భర్త కేఫ్ కాఫీడే ఫౌండర్ సిద్ధార్థ… అప్పుల బాధతో ఆమధ్య ఆత్మహత్య చేసుకున్నాడు గుర్తుంది కదా… ఆ మాళవిక కొడుకు పేరు అమర్త్య… తనకు డీకే శివకుమార్ బిడ్డ ఐశ్వర్యతో పెళ్లి జరిగింది… అంటే ఎస్ఎం కృష్ణ కుటుంబంతో బాంధవ్యం కూడా..!
కృష్ణ తమ్ముడు శంకర్ కూడా ఒకప్పుడు ఎమ్మెల్సీ… మొత్తం రాజకీయాలు, వ్యాపారాల్లో మునిగితేలే సర్కిల్ తనది… కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన నిన్న కన్నుమూశాడు..!
Share this Article