.
నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, వెబ్ సీరీస్ కావచ్చు, టీావీ సీరియల్ కావచ్చు… ఏ పాత్రకైనా సరైన ఆహార్యం ముఖ్యం… వాచికం, ఆంగికం ఎంత ముఖ్యమో ఆహార్యమూ అంతే ప్రధానం…
తెలుగు పదాలే ఇవి… సరే, సరళంగా చెప్పుకుందాం… పాత్రకు తగిన మేకప్పు, దుస్తులు, లుక్కు, వేషం ప్రధానం… ఉదాహరణకు మనం ఓ పూజారి పాత్రను తీసుకుంటే… ఆ భాష వేరుగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజీ వేరే ఉండాలి… అంతకుమించి చూడగానే పూజారి అని స్పురించేలా దుస్తులు, వేషం ఉండాలి…
Ads
బయోపిక్కులు తీసేటప్పుడు ఆ ఒరిజినల్ కేరక్టర్స్ కనిపించేలా మరిన్ని జాగ్రత్తలు అవసరం… సరే, మనవాళ్లు ఏదైనా సరే బోలెడు క్రియేటివ్ లిబర్టీ, ఫ్రీడం తీసుకుని రుద్దుతారు కదా… అదేమంటే నటుల ఇమేజీ, కొత్తదనం మన్నూమశానం అని ఏదో చెబుతారు…
ఉదాహరణకు కృష్ణ అల్లూరి సీతారామరాజు తీసేటప్పుడు కాషాయం, విల్లంబులు, పంచె చుట్టారు… జంధ్యం వేసినట్టు ఓ తువ్వాల… కానీ జనం యాక్సెప్ట్ చేశారు… మరో ఉదాహరణ అఖండ… మొదట్లో ఆ పాత్ర అఘోరా అన్నారు… కానీ బాలయ్య ఇమేజ్‌కు మరీ అఘోరా తరహా లుక్కు, ఆహార్యం అయితే జనం దడుసుకుంటారు అనుకుని సరళీకరించారు…
త్రిశూలం బదులు పంచశూలం పట్టించారు… మీసం నల్లగా, గడ్డం తెల్లగా… నిండుగా బట్టలు, నడుంకు ఓ తోలు బెల్టు, చెప్పులకు శాండిల్స్… మోడరన్ అఘోరా అనాలేమో,.. సరే, దాన్ని కూడా జనం యాక్సెప్ట్ చేశారనే అనుకోవాలి… డైలాగులో, బాలయ్య పంచులో, ఆ నటనో, కథలో కొత్తదనమో, థమన్ బీజీఎమ్మో… ఏదో పనిచేసింది… గట్టెక్కింది… కానీ అఘోర అసలు లుక్కు వేరు, బాలయ్య లుక్కు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్… ఆ ఊపులో అఖండ-2 కూడా వస్తోంది కదా… లుక్కు మారదు… డౌటేమీ అక్కర్లేదు…
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… పాత్రల పేర్లు వేరు, వీళ్ల లుక్కులు వేరు… తాజా ఉదాహరణ తమన్నా భాటియా… ఓదెల-2 అనే సినిమా చేస్తోంది కదా… కాశీలో కాస్త షూటింగ్ వివరాలు, ఫోటోలు… ఓ టీజర్ కుంభమేళాలో ఆవిష్కరణ గట్రా వార్తలు కనిపించాయి… తమన్నా పోస్టర్ కూడా కనిపిస్తోంది…
చేతిలో ఢమరుకం, మరో చేతిలో ఓ కర్ర… నిండుగా కాషాయ దుస్తులు, ఓ స్కార్ఫ్… సరే, లుక్కు బాగానే ఉంది… సాధ్వి అంటారా వోకే… కానీ సినిమా ప్రచారవార్తల్లో ఆమెను నాగసాధు అంటున్నారు… ఏవో అతీంద్రియ శక్తులు ఉంటాయట, అదే కథలో మెయిన్ పాయింట్ అట…
నాగసాధు లుక్కు, ఆహార్యం ఎలా ఉంటుందో కుంభమేళా ఫోటోలు చూడండి తెలుస్తుంది… కానీ అలా చూపిస్తే మళ్లీ ప్రేక్షకజనం దడుసుకుంటారు అనుకున్నప్పుడు… ఆమెది నాగసాధు పాత్ర అని చెప్పడం మానేయండి… అది ఆ నాగసాధు లుక్కు కాదు, అది సాధ్యమూ కాదు… ఆ పేరును భ్రష్టుపట్టించడమూ కరెక్టు కాదు… ఆమె లుక్కుతోనే డివైన్ వైబ్ కనిపిస్తోందని కొందరు రాసిపడేస్తున్నారు… సాధ్వి లేదా సన్యాసిని, అంతే, నాట్ నాగసాధు…
మొన్నామధ్య పాత సినిమా నటి మమత కులకర్ణి సన్యాసం స్వీకరించింది… అందుకే జస్ట్, సన్యాసిని అనండి… ఎందుకంటే సేమ్, అదే వేషం తమన్నాది కూడా… పైగా సినిమాలో ఫైటింగులు కూడా చేస్తుందట తమన్నా, దానికోసం ఇంటెన్స్ ట్రెయినింగ్ కూడా తీసుకుందట…
అఘోరి అనగానే ఈమధ్య తెలంగాణలో అక్కడక్కడా అరాచకం చూపిస్తున్న ఓ అఘోరి గుర్తొచ్చింది… తెలంగాణ పోలీసులకు ఏమాత్రం కంట్రోల్ చేతకాని ఓ దిగంబరి… కానీ చిల్కూరు రంగరాజన్‌ను పరామర్శించడానికి వెళ్లినప్పుడు, ఆయన కర్రతో బాదుతాడని భయంతో కావచ్చు, దుస్తులతో వెళ్లింది… ఇవండీ ఆహార్యాలు, వేషాలు, దుస్తుల ప్రాముఖ్యత, మనవాళ్ల సృజనాత్మకత..!!
Share this Article