.
ఇండియా చేపట్టిన ఖచ్చితమైన సర్జికల్ దాడులలో, పాకిస్తాన్ లోని పన్నెండు కంటే ఎక్కువ సైనిక స్థావరాలపై జరిగిన దాడులతో, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) మౌలిక సదుపాయాల్లో దాదాపు 20 శాతం నాశనమయ్యాయని అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లు, క్షిపణులతో దాడి ప్రయత్నాలకు ప్రతిగా, భారత వాయుసేన జరిపిన ఈ దాడులు ముఖ్యమైన క్షిపణి నిల్వ కేంద్రాలు, ఎయిర్ బేస్‌లు — ముఖ్యంగా సర్గోధా మరియు భోలారి (ఇక్కడే పాకిస్తాన్‌కి చెందిన F-16 మరియు JF-17 యుద్ధ విమానాలు ఉండేవి) — లక్ష్యంగా చేసుకున్నాయి.
Ads
సింధ్ రాష్ట్రం జంషోరో జిల్లాలోని భోలారి ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్‌తోపాటు నలుగురు ఎయిర్‌మెన్ సహా 50 మంది పైగా మరణించినట్టు సమాచారం. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన అనేక యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.
“ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్ నిర్వహించిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్‌కి చెందిన నూర్ ఖాన్ (చక్లాలా), రఫీకి (షోర్కోట్), మురీద్ (చక్వాల్), సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చూనియన్, సర్గోధా, స్కార్దూ, భోలారి, జకోబాబాద్ వంటి ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది…
జకోబాబాద్‌లోని షాహ్‌బాజ్ ఎయిర్ బేస్‌పై దాడికి ముందు, తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలు, అక్కడ జరిగిన నాశనాన్ని స్పష్టంగా చూపించాయి. అదే సమయంలో, నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత బలగాల గట్టి ప్రతిఘటనలో పాక్ ఆర్మీకి చెందిన పలు ఉగ్రవాదుల షెల్టర్లు, స్థావరాలు నాశనమయ్యాయి.
భారత సైనికాధికారులు వెల్లడించిందేమిటంటే.., ఈ కాల్పులపై స్పందనలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 35- 40 మంది సైనికులు మరణించగా, పాకిస్తాన్ వాయుసేన “కొన్ని” యుద్ధవిమానాలు కోల్పోయినట్లు తెలిపారు. సోమవారం, భారత సాయుధ దళాలు పాక్ ఎయిర్ బేస్‌లకు జరిగిన నష్టం, భారత రక్షణ వ్యవస్థలు నాశనం చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల దృశ్యాలను విడుదల చేశాయి…
మంగళవారం, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.రాణా, ప్రపంచంలోని 70 దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులకు “ఆపరేషన్ సిందూర్” విజయవంతంగా నిర్వహించిన తీరును వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన ఆయుధ వ్యవస్థల యుద్ధ సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్‌లో చూపించామని పేర్కొన్నారు… (న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్త)
Share this Article