ఆటుపోట్లకు గురవుతున్న దిల్ రాజు మొత్తానికి ఒక సినిమాపై అసాధారణ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెసయ్యాడు… 5 కోట్లతో తీసిన సినిమా 60 కోట్లు వసూలు చేసిందీ అనే పాయింట్ సహజంగానే సినిమా పట్ల ఓ పాజిటివిటీని పెంచుతుంది… రిలీజుకు ముందే లవ్ టుడే సినిమా హిట్ అని కూడా బోలెడు స్టోరీలు అర్జెంటుగా వండబడ్డాయి… తీరా చూస్తే సోసో సినిమా… నిజానికి యూత్ కనెక్టవుతారనేది కూడా భ్రమే… చెప్పుకుందాం…
ఈ సినిమా వరల్డ్ వైడ్ 66 కోట్లు కలెక్ట్ చేస్తే… అందులో మేజర్ షేర్ 52 కోట్లు తమిళ మార్కెటే… అంతే… పక్కనే ఉన్న కేరళలో కేవలం 75 లక్షల కలెక్షన్… అంటే మలయాళీ ప్రేక్షకులు ఎహెఫోరా అని తీసిపడేశారు… కన్నడంలో 4 కోట్లు… కానీ నార్త్ ఇండియా మొత్తమ్మీద వచ్చినవి కేవలం 50 లక్షలు… ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా కదా… పలు భాషల్లోకి తర్జుమా చేయడం, వదిలేయడం… నార్త్ ప్రేక్షకులు ఏమైనా పిచ్చోళ్లా… ఈ సినిమాను తిప్పికొట్టారు… 50 లక్షలు అనేది మరీ దారుణమైన కలెక్షన్… నెట్ షేర్ లెక్కలు తీస్తే మైనస్…
ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు… నెట్ నిండా ఆహారావాలు, ఓహోరావాలు… అసలు బేసిక్ పాయింటే కన్విన్సింగుగా ఉండదు… 7, 8 తరగతులు చదివే అమ్మాయిలే తమ స్మార్ట్ ఫోన్లను ఎవరికీ ఇవ్వరు… అక్కాచెల్లెళ్లు, చివరకు తల్లులు అడిగినా డోన్ట్ కేర్… సేమ్, అబ్బాయిలు… అలాంటిది ‘‘మీరు ప్రేమించుకుంటున్నారు కదా, ఒక్కరోజు మీ ఫోన్లను మార్చుకొండి, తరువాత మాట్లాడండి’’ అని అమ్మాయి తండ్రి షరతు పెట్టడం… తీరా ఫోన్లలో డార్క్ సీక్రెట్స్ ఉండి, ఓ పెద్ద కథ కావడం…
Ads
నిజానికి ఇది 2017లో తీయబడిన అప్పా లాక్ అనే షార్ట్ ఫిలిమ్… దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దాన్నే ఫుల్ లెంత్ సినిమాగా డెవలప్ చేసుకున్నాడు… ఇప్పుడంతా ధనుష్, రిషబ్ టైప్ కదా… దర్శకులం మనమే, హీరోలం మనమే… ఒక్కసారి రియాలిటీలోకి వెళ్దాం… ఫోన్లు చోరీకి గురవుతున్నాయి… అందుకని ఇప్పుడు ఎవరూ ఫోన్లలో ఏ కంట్రవర్సీ, పర్సనల్, కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, ఆడియోలు, వీడియోలు, రికార్డింగులు ఉంచడం లేదు… చివరకు బ్రౌజింగ్ హిస్టరీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు… దాచిపెట్టుకోదగిన ఫైల్స్ అయితే డ్రైవ్‌లో దాచుకుంటారు… ఫోన్ స్పీడ్ కోసం వీలైనంతవరకూ స్పేస్ ఖాళీగా ఉంచేస్తుంటారు…
సో, ఆ ఇద్దరు ప్రేమికులూ ఒకరి ఫోన్ ఒకరు తీసుకున్నంత మాత్రాన పెద్దగా కనిపెట్టే రహస్యాలు ఏమీ ఉండవు… ‘‘ఇలా జరిగి ఉంటే ఎలా ఉంటుంది’’ అనేదే ఏ కథకైనా మూలం కాబట్టి… వోకే, ఇద్దరు ఫోన్లు మార్చుకున్నారు, సీక్రెట్స్ బట్టబయలయ్యాయి, అదే కథ అనుకుందాం… కానీ ఆ తమిళ కథ వేరే ఏ భాషలోనూ కనెక్ట్ కాలేదు… చూస్తూ ఉండండి, తెలుగులోనూ డ్రాప్ ఎలా ఉండబోతున్నదో… కారణాలు ఏమిటంటే..? ఈ కొత్త లైన్ యువప్రేక్షకులను థియేటర్ దాకా తీసుకురాలేదు… టికెట్టు రేట్లను ప్రధానంగా వ్యతిరేకించేది, దూరం ఉండేది యూతే… కాస్త ఇంట్రస్టు క్రియేట్ అయితే ఏకంగా ఐబొమ్మ వంటి సైట్లలోకి వెళ్లడం, పాటలూ మన్నూమశానం జంప్ కొట్టేసి, కీలకమైన ట్విస్టులు చూసేసి క్లోజ్ చేస్తారు…
దీన్ని రోమ్ కామ్ జానర్ అంటున్నారు కదా… ఆ కామెడీ కూడా అతి… అసలు ప్రదీప్ రంగనాథన్ యాక్షనే అతి… జీర్ణం కావడం కష్టం పలుసార్లు… బేసిక్‌గా ఈ కథనంలో నీతి ఏమిటయ్యా అంటే… మలయాళం, తమిళం అనగానే ఆ సినిమాల్లో నాణ్యత ఉంటుందని అనుకోవడం ఓ భ్రమ… అక్కడ హిట్ అయ్యిందంటే కారణాలు బోలెడు ఉండవచ్చు… ఓటీటీ, టీవీ రైట్స్ రేట్ల కోసం వసూళ్ల లెక్కలు కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేయబడి ఉండవచ్చు… అది వేరే భాషల ప్రేక్షకులకు నచ్చాలని ఏమీ లేదు… లేదు… కాకపోతే సినిమాలో బోర్ రాకుండా సీన్లు రాసుకోవడం, బీచ్ సీన్లు కొంత బెటర్… హీరో కమ్ దర్శకుడు ఎమోషనల్ సీన్లలో తేలిపోయాడు… సినిమా మొత్తమ్మీద చెప్పుకునేది ఒక్కటే… హీరోయిన్ ఇవానా… బాగుంది, బాగా చేసింది…!!
Share this Article